Ram Gopal Varma: నారా లోకేష్‌కు ఆర్జీవీ ఫ్లయింగ్ కిస్ - ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆరే గొప్ప అంటూ స్టేట్‌మెంట్
Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల ఆధారంగా వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమానే ‘వ్యూహం’. ఈ సినిమా ఫైనల్‌గా రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ లాంచ్ చేసింది సినిమా బృందం.
Ram Gopal Varma Kiss to Lokesh-VYOOHAM : ‘వ్యూహం’.. ఎన్నో మలుపులు, వాయిదాలతో ఎట్టెకేలకు రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమా. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై డైరెక్టర్ వర్మ తెరకెక్కించిన సినిమా ఇది. నిజానికి ‘వ్యూహం’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. కానీ, నారా లోకేష్ వేసిన పిటిషన్ తో ‘వ్యూహం’ రిలీజ్ వాయిదా పడింది. తనను కించపరిచేలా సినిమా ఉంది అంటూ లోకేశ్ వేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు సినిమా విడులను వాయిదా వేసింది. ఇక ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో.. ఈ నెల 23న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ నారా లోకేశ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘థ్యాంక్యూ లోకేశ్.. ఉమ్మా’..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మీడియాతో మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ.. ‘‘ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ఎవ్వరికీ థ్యాంక్స్ చెప్పను. కానీ, ఒకే ఒకరికి చెప్తాను. అదే నా ప్రియ మిత్రుడు లోకేశ్ గారికి. ఇప్పుడు ఇక్కడ నేను, కిరణ్ ఇంతలా నవ్వుతూ ఆనందంగా ఉన్నాను అంటే కారణం.. లోకేశ్ గారు మాత్రమే. ఇక్కడున్న ఏదో కెమెరా నుంచి ఆయన మమ్మల్ని చూస్తుంటాడు అని తెలుసు. థ్యాంక్యూ వెరీమచ్ లోకేశ్.. ఐ కాంట్ సే ఉమ్మా.. ’’ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు ఆర్జీవి. ‘‘నిజానికి ‘వ్యూహం’ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. ఒక విధంగా నవ్వాలో, ఏడవాలో తెలీదు. లోకేశ్ వేసిన పిటిషన్ వల్ల డిలే జరిగింది. లోకేశ్ కి ఎంత తెలివంటే సినిమా ఆపేద్దాం అనుకున్నాడు. ఏ సినిమాని ఆపడం అనేది జరగదు. మేం అనుకున్నట్లుగా డిసెంబర్ లో రిలీజ్ అయ్యి ఉంటే.. ఇప్పటికి జనం మర్చిపోయేవారు. లోకేశ్ పిటిషన్ వేసి లాగి లాగి కరెక్టుగా ఎలక్షన్ ముందు రిలీజ్ అయ్యే విధంగా.. చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫాదర్ చంద్రబాబుకి కూడా కంగ్రాట్స్ చెప్పాలి అనుకుంటున్నాను’’ అన్నారు ఆర్జీవి.
సీనియర్ ఎన్టీఆర్ కంటే.. జూనియర్ ఎన్టీఆరే గొప్ప..
సీనియర్ ఎన్టీఆర్ కంటే.. జూనియర్ ఎన్టీఆర్ గొప్పవాడని కామెంట్స్ చేశారు ఆర్జీవి. సీనియర్ ఎన్టీఆర్ కి ఏకైక వారసుడు జూనియర్ ఎన్టీఆరే.. లోకేశ్ కాదు అని ట్వీట్ చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకి ఆర్జీవి సమాధానం చెప్పారు‘‘ అలా ట్వీట్ చేశానా? అయితే, అది వోడ్కాలో ఉన్నప్పుడు చేసి ఉంటాను. ఇప్పుడు వోడ్కాలో లేను. కానీ, ఒకటి చెప్తున్నాను సీనియర్ ఎన్టీఆర్ కంటే.. జూనియర్ ఎన్టీఆరే గొప్ప’’ అని అన్నారు వర్మ. ‘‘ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ కంటే.. జూనియర్ ఎన్టీఆర్ గొప్పా?’’ అని అడిగిన ప్రశ్నకు కూడా ఆయన ‘‘ అవును.. కచ్చితంగా జూనియర్ ఎన్టీఆరే గొప్ప. నేను ఇప్పుడు వోడ్కాలో లేను.. కానీ, చెప్తున్నాను’’ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీసే స్థాయిలో తను లేనని అన్నారు ఆయన.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరిగాయనే విషయాన్ని చూపిస్తూ ‘వ్యూహం’ సినిమాని తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం కావడంతో ఈ సినిమాకి హైప్ క్రియేట్ అయ్యింది. విడుదల అయితే ఓటర్లపై ప్రభావం పడుతుందని హైకోర్టు కూడా దీనిని నిలిపివేయాలని ఆదేశించింది. కానీ ఫైనల్‌గా తన మాట నెగ్గేలా చేసుకొని ‘వ్యూహం’ను విడుదలకు సిద్ధం చేశాడు వర్మ. ఫిబ్రవరీ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.
Also Read: మంచులో సాయి పల్లవి, అమీర్ ఖాన్ కొడుకు ఆటలు.. ఫొటోలు వైరల్