అన్వేషించండి

P Susheela: గాయని పి. సుశీలకు అస్వస్థత, చెన్నైలో చికిత్స - నిలకడగా ఆరోగ్యం

Singer P Susheela: ప్రముఖ గాయని పి. సుశీల అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆమెని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు.

 P Susheela Hospitalized: ప్రముఖ గాయని పి. సుశీల (86) అస్వస్థకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కంగారు పడాల్సిన పనేమీ లేదని తెలిపారు. ఆగస్టు 17వ తేదీన ఆమె కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. వైద్యులు కొన్ని టెస్ట్‌లు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేదని, అది సాధారణ కడుపు నొప్పే అని తెలిపారు. ఇదే విషయాన్ని సుశీల కుటుంబ సభ్యులు వెల్లడించారు. త్వరలోనే ఆమెని డిశ్చార్జ్ చేస్తారని అన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

భారత చలన చిత్ర సంగీత చరిత్రలో పి. సుశీల పేరుకి ప్రత్యేక స్థానం ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, తుళు భాషల్లో 17 వేలకుపైగా పాటలు పాడారు. దాదాపు 60 ఏళ్ల పాటు ఆమె సంగీత ప్రయాణం కొనసాగింది. వయసు మీద పడడం వల్ల కొన్నేళ్లుగా ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. మొత్తం 5 జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న పి. సుశీల.. నేషనల్ అవార్డ్ సాధించిన తొలి గాయనిగా రికార్డు సృష్టించారు. ఎక్కువ పాటలు పాడినందుకు గిన్నిస్ బుక్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవలే తిరుపతికి వెళ్లిన సుశీలమ్మ తలనీలాలు సమర్పించారు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల ఓ సంగీత కార్యక్రమానికి హాజరైన ఆమె తమిళ సినీ పరిశ్రమలో మంచి గాయకులు లేరని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పాడే ఓపిక లేదని, లేదంటే కచ్చితంగా ఈ తరం వాళ్లతో కలిసి పాడే దాన్ని అని వెల్లడించారు. 

"నాకు ఇప్పుడు వయసైపోయింది. శరీరంలో ఓపిక లేదు. ఓపిక ఉండి ఉంటే ఈ తరం వాళ్లతో పోటీ పడి మరీ పాటలు పాడే దాన్ని. ఇప్పటి సినిమాల్లో మంచి సంగీతమే వినిపించడం లేదు. గాయకులూ సరిగ్గా లేరు. ఇదంతా చూస్తుంటే ఎంతో బాధగా ఉంటోంది. ఎమ్‌ఎస్ విశ్వనాథన్, కేవీ మహదేవన్‌ లాంటి దిగ్గజ సంగీత దర్శకులు పాటే ప్రాణంగా బతికే వాళ్లు. వాళ్లకు పాటలు తప్ప మరో ప్రపంచమే లేదు. కానీ ఈ తరం అలా లేదు"

- పి. సుశీల, ప్రముఖ గాయని 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget