Kuberaa Movie Collections: రూ.100 కోట్ల క్లబ్‌లోకి 'కుబేర' - మూవీ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్
Kuberaa Collections: కోలీవుడ్ స్టార్ ధనుష్ లేటెస్ట్ మూవీ 'కుబేర' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన 5 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది.

Dhanush's Kuberaa Entered Into 100 Crores Club: కోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కుబేర'. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాగా హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ అయినప్పటి నుంచీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.
రూ.100 కోట్ల క్లబ్‌లోకి
విడుదలైన 5 రోజుల్లోనే 'కుబేర' రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ మేరకు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా వేసింది. 'సంపద, జ్ఞానం, ఇప్పుడు రూ.100 కోట్లకు పైగా విలువైన వేవ్.' అంటూ రాసుకొచ్చింది. తమ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.
ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా.. భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత రిచ్చెస్ట్ పర్సెన్‌కు వీధుల్లో సంచరించే బిచ్చగాడికి మధ్య జరిగే సంఘర్షణనే శేఖర్ కమ్ముల అద్భుతంగా తెరకెక్కించగా.. యూత్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Wealth. Wisdom. And now... ₹100+CR worth of WAVE 🌊#Kuberaa rules with a grand century at the box office.🔥
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) June 25, 2025
Book your tickets now: https://t.co/DvwpK1GDz0 #Kuberaa#BlockBusterKuberaa #SekharKammulasKuberaa #KuberaaInCinemasNow pic.twitter.com/0qXlXOVY3I
Also Read: పాన్ ఇండియా బాక్సాఫీస్ మీద టాలీవుడ్ దండయాత్ర - 2025 సెకండాఫ్‌లో ప్రతి నెల రెండు భారీ సినిమాలు
ఈ మూవీలో బిచ్చగాడి రోల్‌లో దేవాగా ధనుష్.. సీబీఐ ఆఫీసర్ దీపక్‌గా నాగార్జున తమ నటనతో మెప్పించారు. సినిమాలో జిమ్ సర్బ్, ప్రియాంశు ఛటర్జీ, దలీప్ తాహిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మూవీకే హైలెట్‌గా నిలిచింది.
స్టోరీ ఏంటంటే?
దేశంలోనే అత్యంత సంపన్నుడు నీరజ్ మిత్రా (జిమ్ సర్బ్) ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారాలని కలలు కంటాడు. ఇదే టైంలో బంగాళాఖాతంలో భారీ ఆయిల్ రిగ్ బయటపడగా.. దాన్ని సొంతం చేసుకునేందుకు రూ.లక్ష కోట్లతో ప్రభుత్వంతో డీల్ మాట్లాడుకుంటాడు నీరజ్. తన చేతికి మట్టి అంటకుండా ఆ డబ్బును వారి అకౌంట్లలోకి చేర్చేందుకు ప్లాన్ చేస్తాడు. ఇందుకోసం నిజాయతీ పరుడైన దీపక్ సాయం తీసుకుంటాడు.
ఓ మంత్రి ఇంటిపై రైడ్ చేసినందుకు సిన్సియర్ సీబీఐ ఆఫీసర్ దీపక్‌ను అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తారు. దీపక్‌ను బయటకు తీసుకొచ్చిన నీరజ్ అతని సాయంతో డబ్బును ప్రభుత్వ పెద్దల అకౌంట్లలోకి వేయాలని ప్లాన్ చేస్తాడు. ఇందుకోసం ధనుష్‌తో (దేవా) పాటు మరో ముగ్గురు అనాథలను సెలక్ట్ చేసుకుంటాడు దీపక్. వారి పేరు మీద బినామీ కంపెనీలు సృష్టించి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. ఇంతలో నీరజ్ గ్యాంగ్ నుంచి దేవా తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది?, ఓ బిచ్చగాడి వల్ల రిచ్చెస్ట్ పర్సన్ నీరజ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















