Koratala Siva: చిరుతో విబేధాలు లేవు... 'ఆచార్య' తర్వాత మెగా మెసేజ్... పుకార్లకు చెక్ పెట్టిన కొరటాల
Koratala Siva On Acharya: 'ఆచార్య' తర్వాత చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ మధ్య సంబంధాలు బాలేదని సోషల్ మీడియాలో, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో తరచూ కొన్ని కథనాలు షికారు చేస్తాయి. వాటికి కొరటాల చెక్ పెట్టారు.
రచయితగా, దర్శకుడిగా కొరటాల శివ (Koratala Siva)ది చాలా విజయవంతమైన ప్రయాణం. 'బాహుబలి'కి ముందు రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు 'మిర్చి' వంటి భారీ బ్లాక్ బస్టర్ అందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' విజయాలు ఇచ్చారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'బృందావనం' చిత్రానికి ఆయన రచయిత. 'జనతా గ్యారేజ్' చిత్రానికి దర్శకుడు కూడా! ఆ రెండు హిట్ సినిమాలు. అయితే... కొరటాల శివ ప్రయాణంలో 'ఆచార్య' ఆశించిన విషయం ఇవ్వలేదు. అంచనాలు తప్పాయి.
ఆచార్య విడుదల తర్వాత చిరు నుంచి మెసేజ్!
Koratala Siva on Acharya movie result: 'ఆచార్య' ఫ్లాప్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి, కొరటాలకు మధ్య సత్సంబంధాలు లేవని, వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిందని పలు కథనాలు వచ్చాయి. కొన్ని వేదికలపై చిరంజీవి మాట్లాడిన మాటలు సైతం కొరటాల శివని టార్గెట్ చేసినవే అని కొందరు భావించారు. వీటన్నిటికీ కొరటాల చెక్ పెట్టారు.
ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా 'దేవర' (Devara Movie). ఈ శుక్రవారం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో కొరటాల ముచ్చటించారు. అక్కడ చిరంజీవి ప్రస్తావన వచ్చింది.
'మీకు చిరంజీవి గారికి మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అండి?' అని ఒకరు ప్రశ్నించారు. ''మా మధ్య సంబంధాలు ఎప్పుడూ బాగుంటాయి'' అని కొరటాల శివ సమాధానం ఇచ్చారు. 'ఆ మధ్య బయట మీటింగులలో మీ గురించి మాట్లాడారు' అని అడగ్గా... ''అనవసరంగా ఏదేదో రాశారు. 'ఆచార్య' విడుదల తర్వాత నాకు మెసేజ్ చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి గారు. You will bounce back stronger Shiva అని అన్నారు. 'మామూలుగా కాదు... శివ చాలా గట్టిగా కొడతావ్ ఈసారి' అని మెసేజ్ చేశారు. నాకు, ఆయనకు మధ్య ఏముంటాయి'' అని కొరటాల తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్యాన్ వార్ లేదా కొరటాల మీద కొంత మంది చేస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పడుతుందని ఆశించవచ్చు.
Also Read: 'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే
'దేవర' సినిమా విడుదల సందర్భంగా యువ కథానాయకులు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డకు ఎన్టీఆర్, కొరటాల శివ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ప్రతి ఒక్కరికి జవాబు దారితనం ఉండాలని, ఎవరి పని వాళ్లు చేయాలని కొరటాల అన్నారు. ఆ వ్యాఖ్యలను సైతం పలువురు విమర్శించారు. చిరంజీవిని ఉద్దేశించి కొరటాల ఆ మాటలు అన్నారని కొంత మంది కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో కొరటాల లేరు. కానీ, ఆ వ్యాఖ్యలు ఆయన దృష్టికి వెళ్లి కూడా ఉండవచ్చు. అయితే... ఆ ఇంటర్వ్యూ ప్రస్తావన వచ్చినప్పుడు ఊహాగానాలకు కొరటాల శివ ఫుల్ స్టాప్ పెట్టారు. సాధారణంగా పని గురించి మాట్లాడాను తప్ప ఆ వ్యాఖ్యలలో మరొక ఉద్దేశం లేదని ఆయన తెలిపారు.
Also Read: 'దేవర' అడ్వాన్స్ బుకింగ్స్ - సుదర్శన్, ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఆల్ షోస్ హౌస్‌ఫుల్, అదీ క్షణాల్లో!