అన్వేషించండి

Kona Venkat : ‘అదుర్స్-2’ పాన్ వ‌రల్డ్ సినిమా - ఎన్టీఆర్ చేయ‌ను అంటే.. వాళ్ల పిల్ల‌ల‌తో చేస్తా

Kona Venkat : కోనా వెంక‌ట్.. స్టార్ స్క్రిప్ట్ రైట‌ర్, ప్రొడ్యూస‌ర్. ఎన్నో అద్భుత‌మైన సినిమాలు అందించారు. ఇక ఇప్పుడు 'అదుర్స్ - 2' తీస్తాను అంటున్నారు ఆయ‌న‌. దానికి సంబంధించి విష‌యాలు పంచుకున్నారు.

Kona Venkat About Adhurs - 2 and Upcoming Projects: కోనా వెంక‌ట్.. స్టార్ స్క్రిప్ట్ రైట‌ర్, ప్రొడ్యూస‌ర్. ఎన్నో అద్భుత‌మైన క‌థ‌లు అందించారు ఈయ‌న‌. ఆయ‌న రాసిన 'గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది' రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాన‌ని చెప్పారు. వాటికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విష‌యాలు పంచుకున్నారు. సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా 'అదుర్స్' కి సీక్వెల్ వ‌స్తుంద‌ని, అది పాన్ వ‌ర‌ల్డ్ లెవెల్ లో ఉంటుంద‌న్నారు. ఆ సినిమాకి సంబంధించి మ‌రిన్ని విష‌యాలు పంచుకున్నారు ఆయ‌న‌. 

ఎన్టీఆర్ మాత్ర‌మే చేయాలి.. 

'అదుర్స్ - 2'  సినిమా ఎన్టీఆర్ మాత్ర‌మే చేయాల‌ని, ఆయ‌న కాకుండా వేరెవ‌రితో చేసే ప్ర‌స‌క్తే లేద‌ని అన్నారు కోనా. "అదుర్స్ - 2  స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఎన్టీఆర్ విన్న త‌ర్వాత చేసే ఫైన‌ల్ ట‌చ్ లు త‌ప్ప మిగ‌తా మొత్తం అయిపోయింది. 'RRR' త‌ర్వాత రీవ‌ర్క్ చేయ‌డం స్టార్ట్ చేశాను. అదుర్స్ గెట‌ప్ లానే ఉంటుంది. ఆ గెట‌ప్ ఆయ‌న‌కు త‌ప్ప మ‌రెవ్వ‌రికీ సూట్ అవ్వ‌దు. ‘RRR’ త‌ర్వాత ప్ర‌పంచం మొత్తం ఆడియెన్స్ వ‌చ్చేశారు. ఆయ‌న సినిమా ఇప్పుడు జ‌పాన్ లో చూస్తున్నారు. అన్ని దేశాల్లో చూస్తున్నారు. అంద‌రి క‌ళ్లు ఇండియావైపు తిరిగాయి. తెలుగు ప‌రిశ్ర‌మ వైపు చూస్తున్నాయి. అందుకే, అది పాన్ ఇండియా సినిమా అవ్వాల‌నే పాయింట్ లో రీ వ‌ర్క్ చేస్తున్నాను. 'అదుర్స్ - 2' పాన్ వ‌ర‌ల్డ్ సినిమా. అదే గెట‌ప్, అదే భ‌ట్టు, అదేచారి. కానీ వాళ్ల గోల్ బిగ్గ‌ర్. అవ‌తార్ లాంటి సినిమా అవ్వొచ్చు. పెద్ద ప్లాట్ ఫామ్ మీద, స్కేల్ పెంచి క‌థ‌ను రీ రైట్ చేస్తున్నాను. సేమ్ అదుర్స్ టీమ్ ఉంటుంది. ఒక‌రిద్ద‌రు మారితే మారొచ్చు. ఎన్టీఆర్ అనేది ప‌క్కా. ఆయ‌న మాత్ర‌మే చేయాలి. ఈ ఇంటర్వ్యూ విని ఎవ‌రైనా పెద్ద హీరో ఫోన్ చేసి రేయ్ కోనా నేను చేస్తాను అంటే.. సారీ. ఎందుకంటే ఈ క‌థ పుట్టింది, ఈ పాత్ర పుట్టింది ఎన్టీఆర్ కోస‌మే. చేస్తే ఎన్టీఆర్ చేయాలి. లేదంటే ఆ క‌థ నా ఇంట్లో ఉంటుంది. ఎన్టీఆర్ కొడుకు పెద్దైన త‌ర్వాత అత‌నితో చేస్తా. ఇంకొక‌రితో అయితే, చేయ‌ను" అని 'అదుర్స్  - 2' కి సంబంధించిన విష‌యాలు పంచుకున్నారు కోనా వెంక‌ట్. 

వెబ్ సిరీస్ లు కూడా.. 

"ఇప్ప‌టికి మూడు వెబ్ సిరీస్ లు చేశాను. 'పులి - మేక' భ‌యంక‌ర‌మైన హిట్. సీజ‌న్  - 2 కోసం టెంట్ వేసుకుని కూర్చున్నారంట చాలామంది. సీజ‌న్ - 2 కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది అని జీ వాళ్లు ఫోన్ చేశారు. మీరు సినిమాల్లో ప‌డ్డారు. ఇక్క‌డ చిన్న ట్విస్ట్ ఇచ్చి వ‌దిలిపెట్టారు. దానికోసం వెయిటింగ్ అంటూ ఫోన్లు చేస్తున్నారు. దాంతో పాటుగా హాట్ స్టార్ లో కూడా ఇంకో సిరిస్ మొద‌ల‌వ్వ‌బోతోంది" అంటూ త‌న అప్ క‌మింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు కోనా. 

సూప‌ర్ క్రేజ్.. 

'అదుర్స్' సినిమా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాంట్లో ఎన్టీఆర్, బ్ర‌హ్మానందం గురు శిష్యులుగా న‌టించిన విష‌యం తెలిసిందే. వాళ్లిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణులు అద్భుతంగా ఉంటాయి. విప‌రీతంగా న‌వ్వు తెప్పిస్తాయి. ఇక నయ‌న‌తార‌, ర‌మాప్ర‌భ త‌దిత‌రుల యాక్టింగ్ కూడా 'అదుర్స్' అనిపించేలా ఉంటుంది. అప్ప‌ట్లో భారీ హిట్ అయ్యింది సినిమా. అయితే, ఇప్ప‌టికీ ఆ సినిమాకి క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఏ మీమ్ చూసినా 'అదుర్స్' టెంప్లేట్ ప‌డాల్సిందే. అంత బాగుంటాయి ఆ సినిమా డైలాగులు. దీంతో ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు 'అదుర్స్ - 2'  కోసం వెయిట్ చేస్తున్నారు. మ‌రోసారి భ‌ట్టు, చారిని స్క్రీన్ పైన చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. 

Also Read: ఇదెక్కడి ప్రేమరా బాబు, పెళ్లయిన మహిళను ప్రేమిస్తాడు - ఏకంగా తన మాంసాన్నే రుచి చూపిస్తాడు, చివరికి..

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget