Kalki 2898 AD: రామ్ చరణ్ కూతురికి గిఫ్ట్ పంపిన ప్రభాస్ - క్లిన్ కారా కొత్త ఫ్రెండ్ ఎవరో చూశారా?
Prabhas Ram Charan: రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. చరణ్ కుమార్తెకు ప్రభాస్ ఒక గిఫ్ట్ పంపించారు. అది ఏమిటో చూశారా?
![Kalki 2898 AD: రామ్ చరణ్ కూతురికి గిఫ్ట్ పంపిన ప్రభాస్ - క్లిన్ కారా కొత్త ఫ్రెండ్ ఎవరో చూశారా? Klin Kaara Konidela daughter of Ram Charan receives gift from Prabhas Kalki 2898 AD team Kalki 2898 AD: రామ్ చరణ్ కూతురికి గిఫ్ట్ పంపిన ప్రభాస్ - క్లిన్ కారా కొత్త ఫ్రెండ్ ఎవరో చూశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/03/d49121c152cbb4c14c9c32a335b6372b1717399891969313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టాలీవుడ్ స్టార్ హీరోస్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ వుంది. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తమ స్నేహాన్ని ఏదైనా స్పెషల్ అకేషన్స్ వున్నప్పుడు సోషల్ మీడియా వేదికగా చూపిస్తూ వస్తున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్ స్టాపబుల్' టాక్ షో వల్ల రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఫ్రెండ్షిప్ ప్రేక్షకులకు తెలిసింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఫ్రెండ్ కూతురికి ప్రభాస్ ఓ గిఫ్ట్ పంపించారు.
క్లిన్ కారా కొణిదెలకు కల్కి మర్చండైజ్
ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD Movie). ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేశారు. ఆ రెండు క్యారెక్టర్లలో భైరవ ఒకటి. ఈ నెల 27న సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే, అంత కంటే ముందు భైరవ ఓటీటీలోకి వచ్చాడు. బుజ్జితో కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సందడి చేస్తున్నాడు. 'బుజ్జి అండ్ భైరవ' సిరీస్ ఫస్ట్ రెండు ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ సందర్భంగా 'కల్కి' మర్చండైజ్ కూడా రిలీజ్ చేశారు.
'కల్కి' బొమ్మలను... అంటే సినిమాలో బుజ్జి కార్ చూశారు కదా! ఆ మోడల్ టాయ్స్ తయారు చేయించిన 'కల్కి 2898 ఏడీ' టీమ్ కొంత మంది చిన్నారులకు ఏఎంబీ మాల్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేసింది. రామ్ చరణ్ కుమార్తె క్లిన్ కారా కొణిదెల (Klin Kaara Konidela)కు సైతం పంపింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో చరణ్ సతీమణి, ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ ఉపాసన షేర్ చేశారు. ప్రభాస్ సహా చిత్ర దర్శక నిర్మాతలు నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్నా దత్ (Kalki 2898 AD producer name)లకు థాంక్స్ చెప్పారు. అదీ సంగతి!
జూన్ 27 కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్
సైన్స్ ఫిక్షన్ జానర్‌లో టైమ్ ట్రావెల్ ఫాంటసీ మూవీ ప్రభాస్ చెయ్యడం ఫస్ట్ టైమ్ కావడంతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ యాడ్ అవ్వడం... ఆల్రెడీ రిలీజైన బుజ్జి కార్ ప్రోమోతో పాటు 'బుజ్జి అండ్ భైరవ' వెబ్ సిరీస్ ఎపిసోడ్ ఆకట్టుకోవడంతో 'కల్కి' మీద ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Also Read: ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక ఏపీకి రామ్ చరణ్ - Pithapuramకి దగ్గరలో షూటింగ్ ప్లాన్ చేసిన అబ్బాయ్
'కల్కి' సినిమాలో ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు యాక్ట్ చేశారు. దీపికా పదుకోన్, దిశా పటానీ సినిమాలో వున్నారు. ఇంకా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్లు వుండటంతో పాన్ ఇండియా ప్రేక్షకుల్లో సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. జూన్ 27న థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తడం ఖాయంగా కనబడుతోంది.
Also Read: 'దేవర' వర్సెస్ 'వేట్టయాన్'... దసరా బరిలో ఎన్టీఆర్‌కు పోటీగా రజనీకాంత్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)