Ram Charan: ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక ఏపీకి రామ్ చరణ్ - Pithapuramకి దగ్గరలో షూటింగ్ ప్లాన్ చేసిన అబ్బాయ్
Election Results 2024: ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఏపీ కూడా అందులో ఉంది. రిజల్ట్స్ వచ్చాక ఏపీలో షూటింగ్ చేసే ఫస్ట్ హీరో ఎవరో తెలుసా? రామ్ చరణ్! అది కూడా పిఠాపురానికి దగ్గరలో!

ఏపీలో తెలుగుదేశం, జనసేన (Janasena), భారతీయ జనతా పార్టీలతో కూడిన కూటమి విజయం సాధిస్తుందా? అధికారంలోకి వస్తుందా? లేదా? పిఠాపురంలో జనసేనాని, ఎమ్మెల్యేగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు మెజారిటీ ఎంత వస్తుంది? అని యావత్ తెలుగు ప్రజలు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు? ఎలక్షన్ రిజల్ట్స్ మీద ఆసక్తి తారాస్థాయిలో ఉంది.
ఎన్నికల ఫలితాలు పక్కన పెడితే... రిజల్ట్స్ వచ్చాక ఏపీలో షూటింగ్ చేసే తొలి హీరో ఎవరో తెలుసా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). అదీ బాబాయ్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గానికి 60 కిలోమీటర్ల దూరంలో 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ప్లాన్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
రాజమండ్రికి ఈ వారమే 'గేమ్ ఛేంజర్'
Game Changer Latest Schedule In Rajahmundry: ఎన్నికల ఫలితాలు వచ్చిన మర్నాడు పిఠాపురంలో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా 'మనమే' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశాడు హీరో శర్వానంద్. అయితే, ఇంకా పోలీస్ పర్మిషన్ రాలేదు అనుకోండి. దాంతో ఆ ఈవెంట్ మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ అది వచ్చినా లేకున్నా ఈ వారం రామ్ చరణ్ ఏపీ వెళ్లడం గ్యారంటీ.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. షూటింగ్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజికి వచ్చింది. ఈ వారం రాజమండ్రిలో ఒక షెడ్యూల్ ప్లాన్ చేశారు. జూన్ 6 నుంచి అక్కడ షూటింగ్ జరగనుంది. దాంతో సినిమా అంతా కంప్లీట్ అవుతుందని సమాచారం. రాజమండ్రికి పిఠాపురం జస్ట్ 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే... బాబాయ్ దగ్గరకు వెళ్లి కలిసే అవకాశం కూడా ఉంది.
Also Read: 'దేవర' వర్సెస్ 'వేట్టయాన్'... దసరా బరిలో ఎన్టీఆర్‌కు పోటీగా రజనీకాంత్!
ఇంతకు ముందు రాజమండ్రిలో రామ్ చరణ్ షూటింగ్ చేశారు. అది వేరు, ఇప్పుడు చేయడం వేరు. ఎన్నికల ఫలితాల వచ్చిన తర్వాత ఏపీలో షూటింగ్ చేసే తొలి స్టార్ హీరోగా ఆయన రికార్డ్ క్రియేట్ చెయ్యనున్నారు. షూటింగ్ లొకేషన్స్ దగ్గర ఈసారి సామాన్య ప్రజల తాకిడి ఎక్కువ ఉండే అవకాశం ఉందని సమాచారం.
అక్టోబర్ 31న థియేటర్లలోకి 'గేమ్ ఛేంజర్'
Game Changer release date: 'గేమ్ ఛేంజర్' సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ కథానాయికగా నటించారు. మరో నాయికగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వరకు అంజలి కనిపించనున్నారు. శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అక్టోబర్ 31న ఈ సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేశారు. 'ఇండియన్ 2' కంప్లీట్ కావడంతో ప్రజెంట్ శంకర్ ఈ మూవీ మీద కాన్సంట్రేట్ చేశారు. త్వరలో సినిమా ప్రచార కార్యక్రమాలు సైతం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమన్ సంగీతం అందించిన 'జరగండి...' సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది.
Also Read: కాజల్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన శంకర్ - Indian 2 ఆడియోలో చందమామ పాత్రపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

