అన్వేషించండి

Devara Vs Vettaiyan: 'దేవర' వర్సెస్ 'వేట్టయాన్'... దసరా బరిలో ఎన్టీఆర్‌కు పోటీగా రజనీకాంత్!

Rajinikanth Vs Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకు థియేటర్లలో గట్టి పోటీ ఎదురుకానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ 'వస్తున్నా' అని చెప్పడంతో దసరా బరిలో థియేటర్లలో రెండు సినిమాలు సందడి చేయనున్నాయి.

రజనీకాంత్ వర్సెస్ ఎన్టీఆర్... కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్... దేవర వర్సెస్ వేట్టయాన్... ఎలాగైనా అనుకోండి. ఏ విధంగా అయినా చూసుకోండి. ఈ ఏడాది విజయదశమికి థియేటర్లలో సందడి మామూలుగా ఉండదు. ఒకటికి రెండు భారీ సినిమాలు పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దసరా మీద టాలీవుడ్ యంగ్ స్టార్ ఎప్పుడో కర్చీఫ్ వేస్తే... ఇప్పుడు కోలీవుడ్ స్టార్ వచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...

అక్టోబర్ 10న 'దేవర'తో పాటు 'వేట్టయాన్' కూడా!
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'దేవర'. తొలుత ఓ సినిమా అని మొదలు పెట్టినా, తర్వాతర్వాత రెండు భాగాలుగా విడుదల చెయ్యాలని డిసైడ్ అయ్యారు. దేవర ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న విడుదల చెయ్యనున్న విషయం తెలిసిందే. దసరా బరిలో ఎన్టీఆర్ సినిమాకు అడ్డు లేదని అనుకున్నారు ఫ్యాన్స్. ఆ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే సమయానికి మరో సినిమా లేదు. ఇప్పుడు రజనీకాంత్ వచ్చి చేరడంతో పోటీ రసవత్తరంగా మారింది. 

సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'వేట్టయాన్'. దీనికి సూర్య 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 12న రిలీజ్ కానున్న కమల్ హాసన్ 'ఇండియన్ 2'తో పాటు ఇంతకు ముందు ఎన్నో పాన్ ఇండియా ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. లేటెస్టుగా ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చెయ్యనున్నట్టు రజనీకాంత్ స్వయంగా చెప్పారు. దాంతో దసరా బరిలో దేవర వర్సెస్ వేట్టయాన్ కాంపిటీషన్ ఆడియన్స్ చూడనున్నారు.

రెండు సినిమాల్లోనూ హ్యుజ్ స్టార్ కాస్ట్!
'దేవర'లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తుంటే... 'వేట్టయాన్'లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 32 ఏళ్ల తర్వాత రజనితో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్నారు. 'దేవర'లో జాన్వీ కపూర్ హీరోయిన్ అయితే... 'వేట్టయాన్' సినిమాలో టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, మాలీవుడ్ స్టార్స్ ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ కీలక తారాగణం.

Also Readకాజల్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన శంకర్ - Indian 2 ఆడియోలో చందమామ పాత్రపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

దేశానికి ఆస్కార్ తెచ్చిన ఘనత మూట కట్టుకున్న 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాగా 'దేవర'కు క్రేజ్ ఉంటే... భారీ సక్సెస్ సాధించిన 'జైలర్' తర్వాత రజనీకాంత్ పూర్తి స్థాయి సోలో హీరోగా యాక్ట్ చేస్తున్న సినిమా 'వేట్టయాన్'. రెండు సినిమాలకూ పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ నెలకొంది. మరి, ఆ రెండు మూవీస్ మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు... రెండు సినిమాలకూ సంగీత దర్శకుడు ఒక్కరే అనిరుధ్ రవిచందర్. దసరా బరిలో బాలీవుడ్ నుంచి మినిమమ్ ఒక్క మూవీ అయినా వచ్చేలా ఉంది.

Also Read: రెహమాన్ మ్యూజిక్, 'భారతీయుడు'తో కంపేరిజన్ - Indian 2 ఆడియో లాంచ్‌లో అనిరుధ్ రియాక్షన్

టాప్ హెడ్ లైన్స్

This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Tumbbad 2 Update : వెల్ కం టు తుంబాడ్ 2 వరల్డ్ - హారర్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ
వెల్ కం టు తుంబాడ్ 2 వరల్డ్ - హారర్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ
NTR Office Statement: ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు చేసే అధికారం Raw NTR 'సంస్థకు లేదు - అఫీషియల్ స్టేట్మెంట్
'ఊరూ వాడ'తో పొలిటికల్ ఎంట్రీ, ఫేక్ వార్తలకు చెక్ పెట్టిన ఎన్టీఆర్ ఆఫీస్
Jr NTR Tirupati Press Meet: ఎన్టీఆర్ అభిమానులే కానీ ఆయనకు సంబంధం లేదు - 'ఊరూ వాడ' వెనుక ఫుల్ కహానీ
ఎన్టీఆర్ అభిమానులే కానీ ఆయనకు సంబంధం లేదు - 'ఊరూ వాడ' వెనుక ఫుల్ కహానీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
NTR Office Statement: ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు చేసే అధికారం Raw NTR 'సంస్థకు లేదు - అఫీషియల్ స్టేట్మెంట్
'ఊరూ వాడ'తో పొలిటికల్ ఎంట్రీ, ఫేక్ వార్తలకు చెక్ పెట్టిన ఎన్టీఆర్ ఆఫీస్
Gun At Shopping Mall: కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
Tirupati Leopard News: తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
POCSO Act: టీనేజ్ లవ్ అఫైర్లపై పోక్సో అస్త్రం.. చాలా కేసుల్లో చట్టం దుర్వినియోగం! సుప్రీంకోర్టు ఆందోళన
టీనేజ్ లవ్ అఫైర్లపై పోక్సో అస్త్రం.. చాలా కేసుల్లో చట్టం దుర్వినియోగం! సుప్రీంకోర్టు ఆందోళన
AP Local Body Elections November: నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
Bhagyashri Borse : ఏంజెల్ భాగ్యశ్రీ - ట్రెడిషనల్ డ్రెస్ విత్ క్యూట్ లుక్
ఏంజెల్ భాగ్యశ్రీ - ట్రెడిషనల్ డ్రెస్ విత్ క్యూట్ లుక్
IND Predicted XI Vs Eng in 1st ODI: ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
Embed widget