Siren OTT Release: నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న 'సైరన్ 108' తెలుగు వెర్షన్ - ఆ రోజు నుంచే స్ట్రీమింగ్, ఎక్కడంటే
Siren 108 Streaming On OTT in Telugu: ఎట్టకేలకు 'జయం' రవి, కీర్తి సురేష్ సైరన్ తెలుగు వెర్షన్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్రం నేరుగా ప్రముఖ డిజిటల్ వేదికపై ప్రీమియర్ కానుంది.
Siren 108 in Telugu OTT Streaming and Release Update: కోలీవుడ్ స్టార్ హీరో 'జయం' రవి లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ 'సైరెన్'.. 108 (Siren OTT) అనేది ట్యాగ్ లైన్. మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh Siren)ప్రధాన పాత్రలో, అనుపమ పరమేశ్వరన్ కీ రోల్లో నటించింది. తమిళ్ డైరెక్టర్ ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హెమ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుజాత విజయ్ కుమార్ నిర్మించారు. క్రైం రీవెంజ్ డ్రామా రూపొందిన ఈ సినిమా తమిళంలో ఫిబ్రవరి 16న విడుదలైన మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వర్ రేర్ కాంబినేషన్‌లో పైగా మహానటి పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించింది. దీంతో ఈ మూవీపై తెలుగు ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
నేరుగా ఓటీటీకి
Siren Movie OTT Streaming in Telugu Update: తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల రిలీజ్ ఆగిపోయింది. దీంతో తెలుగు ఆడియన్స్ డిస్పప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. అయితే థియేటర్లో కాదు ఒటీటీలో. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ (Siren Telugu OTT) ప్రీమియర్‌కు అంతా రెడీ అయిపోయింది. మరో రెండు రోజుల్లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‌కు రాబోతుంది. తాజాగా దీనిపై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ ఓటీటీ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకోగా ఇప్పుడు స్ట్రీమింగ్ చేయబోతుంది. ఏప్రిల్ 19 అంటే శుక్రవారం ఈ మూవీ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రాబోతుంది. ఈ క్రైం, రీవెంజ్ డ్రామాని ఈ వీకెండ్ ఇంట్లోనే ఒటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
View this post on Instagram
క్రైం రీవెంజ్ డ్రామాగా..
హోమ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుజాత విజయ్ కుమార్ - అనూష విజయ్ కుమార్ భారీ బడ్జెట్‌తో 'సైరన్' చిత్రాన్ని నిర్మించారు. ఇక జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాను . సెల్వ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా, రూబెన్ ఎడిటర్ గా వర్క్ చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన రివేంజ్ డ్రామాలో జయం రవి అంబులెన్స్ డ్రైవర్‌గా నటించగా అతడికి భార్యగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. అలాగే కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఒక పిల్లాడి హత్య కేసుకు సంబంధించిన కథతో సినిమా సాగనుందని సమాచారం.
Also Read: కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ - 'ఆరంభం' పేరుతో రెస్టారెంట్ ప్రారంభం