Kanal Kannan Arrest : ఆ వీడియోను షేర్ చేసినందుకు స్టంట్ మాస్టర్ కనల్ కన్నన్ అరెస్ట్
ఓ మతాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ఓ వీడియో చేశారని పేర్కొంటూ పోలీసులు స్టంట్ కొరియోగ్రాఫర్ కనల్ కన్నన్‌ను అరెస్ట్ చేశారు.
Kanal Kannan Arrest : ప్రముఖ సినీ స్టంట్ కొరియోగ్రాఫర్ కనల్ కన్నన్‌ను తమిళనాడు సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మతానికి వ్యతిరేకంగా ఓ వీడియో షేర్ చేశారన్న ఆరోపణలే ఈ అరెస్టుకు కారణమయ్యాయి. కొద్దిరోజుల క్రితం కనల్ కన్నన్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో ఓ మతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉండటంతో పలువురు అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. దేన్ని షేర్ చేసిన అది క్షణాల్లో ప్రపంచం మొత్తం చూస్తుంది. దీనివల్ల ఎంత ప్రయోజనం ఉందో తేడా వస్తే అంతే నష్టం కూడా ఉంటుంది. ఇలా సోషల్ మీడియా కారణంగా పలువురు సెలబ్రెటీలు చిక్కుల్లో పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కనల్ కన్నన్ కూడా అదే తరహాలో అరెస్ట్ అయ్యాడు.
ఆ వీడియోలో ఏముందంటే..
కన్నన్ షేర్ చేసిన వీడియో.. ఓ పాస్టర్ డాన్స్ చేయడంతో ప్రారంభమవుచుంది. మామూలుగా అయితే ఓకే కానీ.. పాస్టర్ ఒక్కడే కాదు.. అతనితో పాటు ఓ యువతి కూడా ఉండడం వివాదానికి దారి తీసింది. వారిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే డీఎంకే ఐటీ విభాగం డిప్యూటీ ఆర్గనైజర్ ఆస్టిన్ బెన్నెత్ సైబర్ క్రైమ్ తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో మనదేశానికి సంబంధించింది కాదు.. అయినప్పటికీ పలువురి మనోభావాలు దెబ్బతిన్నాయి. దాంతో వారు సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం కాస్తా ముదరడంతో పోలీసులు వీడియో షేర్ చేసిన కన్నన్ ను అదుపులోకి తీసుకున్నారు. జూలై 1న కన్నన్ పై కేసు నమోదు కాగా.. తాజాగా ఆయన్ను అరెస్టు చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. కాగా కన్నన్ ఈ వీడియోను జూన్ 18న సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కన్నన్ కు ఇదేం కొత్త కాదు..
కనల్ కన్నన్ ఇలా అరెస్ట్ అవ్వడం కొత్తేమీ కాదు.. గతంలోనూ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని ఓ ఆలయం విషయంలో చేసిన వివాదాస్పదం కావడంతో ఆయన్ను గతేడాది అరెస్టు చేశారు.
కనల్ కన్నన్ గురించి..
కన్నన్ ఒక యాక్షన్ కొరియోగ్రాఫర్, తమిళనాడుకు చెందిన నటుడు, రచయిత కూడా. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమా పరిశ్రమలలో పనిచేశారు. 1991లో చేరన్ పాండియన్ అనే తమిళ సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించాడు. ప్రాంతీయ సినిమాలో చేసిన కృషికి గాను కన్నన్ 16 అవార్డులు గెలుచుకున్నారు. ఆయన తెలుగులో అన్నయ్య, ఆజాద్, ఎదురులేని మనిషి, హనుమాన్ జంక్షన్, బన్నీ, అందరివాడు, లక్ష్మీ, మిర్చి, రామయ్యా వస్తావయ్యా, వినయ విధేయ రామ లాంటి ఎన్నో చిత్రాలకు కన్నన్ స్టంట్ మాస్టర్ గా పని చేశారు.
Read Also : Vaishnavi Chaitanya: రియల్ లైఫ్ లో జరిగిన కథే ఈ సినిమా- ‘బేబీ’పై హీరోయిన్ వైష్ణవీ చైతన్య
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial