By: ABP Desam | Updated at : 12 Jul 2023 08:49 AM (IST)
వైష్ణవి చైతన్య(Photo Credit: Vaishnavi chaitanya/Instagram)
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రమోషన్ వీడియోలు, పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం అలరించింది. టీజర్, ట్రైలర్‌లో డైలాగ్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ మూవీ జూలై 14న రిలీజ్ కాబోతోంది. యూట్యూబర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి, ‘బేబీ’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ వైష్ణవీ చైతన్య ‘బేబీ’ సినిమా గురించి పలు విషయాలు వెల్లడించింది.
హీరోయిన్ కావాలనే తన కోరిక సుమారు 8 సంవత్సరాల తర్వాత నెరవేరిందని వైష్ణవి చెప్పింది. “ హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. నా ప్రయాణం మొదలై 8 ఏండ్లు అవుతుంది. ఇప్పుడు ‘బేబీ’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. నా మీద నాకు నమ్మకం ఉంచి దర్శకుడు సాయి రాజేష్ ఈ అవకాశం ఇచ్చారు. ఇన్ స్టాలో వీడియోలు, టిక్ టాక్ వీడియోలు చేస్తే సినిమా హీరోయిన్ అవుతుందా? అని నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. కానీ, వాటిని దాటుకుని ముందుకు వచ్చాను” అని చెప్పింది.
ఇక ‘బేబీ’ సినిమాలో బస్తీ అమ్మాయిగా నటించినట్లు వైష్ణవి చెప్పింది. “’బేబీ’ సినిమాలో నాది బస్తీలో పెరిగే ఓ అమాయకురాలైన అమ్మాయి క్యారెక్టర్. బస్తీ నుంచి బయటకు వచ్చిన ఆ అమ్మాయి జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేది కథ. ఆ జీవితం నుంచి ఏం నేర్చుకుంటుంది? చిన్నప్పటి నుంచే ఓ అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. కాలేజ్‌కు వచ్చాక మరో అబ్బాయి లైఫ్‌లోకి వస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి జీవితం ఎలా ప్రభావితం అయింది అనేది చక్కగా చూపించారు. ఈ సినిమా కథ విన్నప్పుడు నా జీవితమే గుర్తుకు వచ్చింది. రియల్ లైఫ్‌లోంచి తీసుకున్న కథ. ఈ కథ, పాత్రతో నేను ఎక్కువగా రిలేట్ అయ్యాను. నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర. చాలా డెప్త్ ఉన్న సీన్లు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడూ ప్రెజర్ అని ఫీల్ అవ్వలేదు. ఇలాంటి పాత్ర వచ్చినందుకు ఎంతో గర్వపడుతుంటాను. నా ప్రాణం పెట్టి ఈ పాత్రను చేశాను” అని చెప్పుకొచ్చింది.
“ఈ సినిమా చూస్తే మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాలో నెగెటివ్, పాజిటివ్, హీరో, హీరోయిన్లు అని ఉండరు. పరిస్థితులే ప్రభావితం చేస్తాయి. తొలిప్రేమ అనేది జీవితంలో ఎప్పటికీ ఓ అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఎప్పటికీ జీవితంలో మధురానుభూతిలా మిగిలిపోతుంది. ఈ సినిమాతోనూ అదే చెప్పబోతోన్నాం” అని చెప్పింది.
“తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ లు ఇవ్వరనే మాట, ప్రచారం ఎలా వచ్చిందో నాకు తెలీదు. అలా ఏం ఉండదు. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే అవకాశాలు వస్తాయి. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసేందుకు ఇష్టపడతాను. గ్లామర్ రోల్స్ కంటే.. పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తాను” అని వైష్ణవి వివరించింది. ప్రస్తుతం తాను ఏ సినిమాను అంగీకరించలేదని చెప్పింది. ఈ సినిమా తర్వాత తన గురించి అందరికీ తెలిసే అవకాశం ఉందని వైష్ణవి చెప్పుకొచ్చింది.
Read Also: సీఎస్‌కే టీమ్‌లో చేర్చుకోమన్న కమెడియన్ యోగిబాబు - ధోనీ రిప్లై అదుర్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Brahmamudi September 29th: మైఖేల్ బెండు తీసిన కనకం- ఇంటికి తిరిగొచ్చిన స్వప్న, రాహుల్ మైండ్ బ్లాక్!
Guppedanta Manasu September 29th: కన్నీళ్లతో జగతికి ప్రామిస్ చేసిన రిషి, శైలేంద్రకి మొదలైన కౌంట్ డౌన్!
వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్ప్రైజ్ అదిరింది
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
/body>