అన్వేషించండి

Dhoni - Yogi babu: సీఎస్‌కే‌ టీమ్‌లో చేర్చుకోమన్న కమెడియన్ యోగిబాబు - ధోనీ రిప్లై అదుర్స్

ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘ఎల్‌జీఎం’. ఈ మూవీ ట్రైలర్ చెన్నైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా యోగి బాబు అడిగిన ఓ ప్రశ్నకు జార్ఖండ్ డైనమైట్ అదిరిపోయే సమాధానం చెప్పారు.

క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టారు. రీసెంట్ గా ధోని ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ నుంచి అతడి భార్య సాక్షి  నిర్మాతగా ‘ఎల్‌జీఎం’ చిత్రం తెరకెక్కుతోంది. ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు  రమేష్ తమిళ మణి దర్శకత్వం వహిస్తున్నారు. హరీష్ కల్యాణ్, ఇవానా (లవ్ టుడే ఫేమ్), యోగి బాబు, మిర్చి విజయ్, నదియా సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సీఎస్‌కే‌ టీమ్‌లో చేర్చుకోమన్న యోగిబాబు  

తాజాగా ‘ఎల్‌జీఎం’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. చిత్రబృందంతో పాటు ధోనీ, ఆయన సతీమణి సాక్షి ఈ వేడుకలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న  హాస్య నటుడు యోగి బాబు ధోనీని ఓ ప్రశ్న అడిగారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లోకి తనను చేర్చుకోవాలని కోరారు. దీంతో ధోనీ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. “చెన్నై టీమ్‌లో రాయుడు రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం రాయుడు స్థానం ఖాళీగా ఉంది. నేను టీమ్ మేనేజ్మెంట్ తో మాట్లాడతాను. కానీ మీరు(యోగిబాబు) సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. మా టీమ్ తరఫున ఆడితే మీరు నిలకడగా ఆడాలి. మీకు ఇంకో విషయం చెబుతున్నా. అసలే మావాళ్లు ఫుల్ స్పీడ్‌తో బాల్స్ వేస్తారు. మిమ్మల్ని గాయపరచడానికి వాళ్లు ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఆడాలి’ అని అనడంతో అక్కడున్నవాళ్లంతా నవ్వుల్లో మునిగిపోయారు. 

ముగ్గురి చుట్టూ తిరిగే ఓ సరదా కథ

ఇక ‘ఎల్‌జీఎం’ సినిమా గురించి ధోని మాట్లాడుతూ.. “ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమా షూటింగ్ తక్కువ సమయంలో కంప్లీట్ అయ్యింది. ఈ సినిమాను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడవచ్చు. మూవీ అందరికీ నచ్చుతుంది. నా భార్య, కూతురుతో కూర్చుని ఈ సినిమా చూశాను. మా పాప బాగా ఎంజాయ్ చేసింది. ఈ సినిమా ముగ్గురి చుట్టూ తిరిగే ఓ సరదా కథ.  తల్లి, భార్య మధ్య నలిగిపోయే పాత్రలో హీరో అద్భుతంగా నటించారు. ఈ సినిమా మీకందరికీ తప్పకుండా నచ్చుతుంది. నేనైతే మూవీని చాలా ఎంజాయ్ చేశాను” అని చెప్పారు.   

ఆకట్టుకుంటున్న‘ఎల్‌జీఎం’  ట్రైలర్

ఇక ‘ఎల్‌జీఎం’  ట్రైలర్ వినోదం, భావోద్వేగాల మేళవింపుతో నిండిపోయింది.  మీరాతో ప్రేమలో ఉన్న గౌతమ్, తన తల్లికి దూరంగా ఉండటం ఇష్టం ఉండదు. మీరాను పెళ్లి చేసుకుని తన తల్లితో కలిసి జీవించాలనుకుంటున్నాడు. మీరా ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉంటుంది.  కూర్గ్ వెకేషన్ కు వెళ్లాలని ఇద్దరు భావిస్తారు. ఈ హాలీడే ట్రిప్ సందర్భంగా తమ బంధం మరితం బలపడుతుందని గౌతమ్ నమ్ముతాడు.  అతడి ప్లాన్ అనుకున్నట్లు వర్కవుట్ అయ్యిందా? ఇవానా అత్తగారితో హాయిగా ఉంటుందా? ఆ తర్వాత ఏం జరిగింది? అనే విషయాలను ఈ ట్రైలర్ లో ప్రస్తావించారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘ఎల్‌జీఎం’(లెట్స్ గెట్ మ్యారీడ్) విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Read Also: అమరావతికి అటు అమ్మ, ఇటు నాన్న- ‘గుంటూరు కారం’ అసలు కథ ఇదేనా?, ఆ టైటిల్ ఎందుకు మార్చారు?

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Opium: ఇండియాకు ఓపియం ఎలా వచ్చిందంటే? NTR Dragon Glimpseలో చూపించిన డ్రగ్ హిస్టరీ
ఇండియాకు ఓపియం ఎలా వచ్చిందంటే? NTR Dragon Glimpseలో చూపించిన డ్రగ్ హిస్టరీ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తనని కాపాడింది లక్ష్మీనే అని విహారికి తెలిసిపోయిందా! లక్ష్మీ డెలివరీకి ఏర్పాట్లు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తనని కాపాడింది లక్ష్మీనే అని విహారికి తెలిసిపోయిందా! లక్ష్మీ డెలివరీకి ఏర్పాట్లు!
Suniel Narang Resigned: తెలంగాణ ఛాంబర్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్ రాజీనామా... 'పెద్ది' ఇష్యూలే కారణమా?
తెలంగాణ ఛాంబర్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్ రాజీనామా... 'పెద్ది' ఇష్యూలే కారణమా?
Godavari Serial Today May 20th: 'గోదావరి' సీరియల్: జానుకి సూర్య ఇచ్చిన సలహా ఏంటి? తల్లీకొడుకుల మధ్య గొడవకు కారణమేంటి?
'గోదావరి' సీరియల్: జానుకి సూర్య ఇచ్చిన సలహా ఏంటి? తల్లీకొడుకుల మధ్య గొడవకు కారణమేంటి?

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi In Italy: మెలోనీకి ‘మెలొడీ’ చాక్లెట్లు ఇచ్చిన మోదీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ పిక్స్!
మెలోనీకి ‘మెలొడీ’ చాక్లెట్లు ఇచ్చిన మోదీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ పిక్స్!
CBN In Kuppam: కుప్పంలో చంద్రబాబు దంపతుల ఆధ్యాత్మిక యాత్ర - గంగమ్మకు పట్టువస్త్రాలు.. రోడ్డు పక్కన తాటి ముంజల విందు!
కుప్పంలో చంద్రబాబు దంపతుల ఆధ్యాత్మిక యాత్ర - గంగమ్మకు పట్టువస్త్రాలు.. రోడ్డు పక్కన తాటి ముంజల విందు!
Caste Census 2027: కుల గణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు- ప్రభుత్వానికి తెలియాల్సిందే .. వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
కుల గణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు- ప్రభుత్వానికి తెలియాల్సిందే .. వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
Bandi Bhagirath POCSO Case: బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!
బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!
Dragon Glimpse vs Peddi Trailer: డ్రాగన్ గ్లింప్స్‌ vs పెద్ది ట్రైలర్... ఏది బావుంది? ఎన్టీఆర్ vs రామ్ చరణ్... ఎవరిది అప్పర్ హ్యాండ్?
డ్రాగన్ గ్లింప్స్‌ vs పెద్ది ట్రైలర్... ఏది బావుంది? ఎన్టీఆర్ vs రామ్ చరణ్... ఎవరిది అప్పర్ హ్యాండ్?
Andhra Pradesh Heatwave: మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
Telangana Heatwave : నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!
నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!
అరటి పండు తొక్క ఎలా తీయాలి? అదే మీ వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని చెబుతుందా?
అరటి పండు తొక్క ఎలా తీయాలి? అదే మీ వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని చెబుతుందా?
Embed widget