Thug Life Release: నో సారీ.. కర్ణాటకలో 'థగ్ లైఫ్' నో రిలీజ్.. - వెనక్కి తగ్గని కమల్ హాసన్
Kamal Haasan: కన్నడ భాషా కామెంట్స్‌పై కమల్ హాసన్ వెనక్కు తగ్గడం లేదు. తాను సారీ చెప్పనంటూ.. మూవీని కర్ణాటకలో ప్రస్తుతానికి రిలీజ్ చేయకూడదని నిర్ణయించారు.

Kamal Haasan Decided To Wont Release Thug Life In Karnataka: కన్నడ నాట కమల్ హాసన్ భాషా కామెంట్స్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. తన కామెంట్స్‌పై వెనక్కు తగ్గని కమల్.. 'థగ్ లైఫ్' మూవీని కర్ణాటకలో రిలీజ్ చేయకూడదని నిర్ణయించారు. దీంతో జూన్ 5న ఈ మూవీ రిలీజ్ కానుండగా.. కర్ణాటకలో మాత్రం విడుదలకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది.
'థగ్ లైఫ్' ఈవెంట్‌లో 'తమిళం నుంచే కన్నడ పుట్టింది' అంటూ కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ అధికార, విపక్ష సభ్యులతో పాటు కన్నడిగులు డిమాండ్ చేశారు. కేఎఫ్‌సీసీ దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం కమల్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అయితే.. ఆ కామెంట్స్ వెనుక తన ఉద్దేశం వేరని కమల్ వివరణ ఇచ్చారు. దీనిపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు లేఖ కూడా రాశారు.
ఒక్క వర్డ్ మిస్సింగ్
కమల్ హాసన్ కేఎఫ్‌సీసీకి రాసిన లెటర్‌ను ధర్మాసనానికి ఆయన తరఫు లాయర్ సమర్పించారు. దీనిపై మరోసారి విచారించిన న్యాయస్థానం.. కమల్ స్టేట్మెంట్‌లో ఒక్క వర్డ్ మిస్ అయ్యిందంటూ తెలిపింది. ఆ స్టేట్మెంట్ ఓకే గానీ ఒక్క వాక్యం మిస్ అయ్యిందంటూ జస్టిస్ నాగప్రసన్న తెలిపారు. కమల్ ఓ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడారని.. అంతే కానీ కన్నడ భాష గురించి కాదంటూ ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. 'అలాంటప్పుడు క్షమాపణలో ఈ వివాదం ముగించొచ్చు కదా.' అంటూ ప్రశ్నించింది.
దీనికి స్పందించిన కమల్ లాయర్.. 'కమల్ తాను చెప్పాలనుకుంది చెప్పారు. పరిస్థితి ఇలాగే ఉంటే కర్ణాటకలో తన సినిమాను రిలీజ్ చేయరు.' అని కోర్టుకు వివరించారు. అయితే.. కేఎఫ్‌సీసీతో సంప్రదింపులు జరిపేందుకు వారం గడువు ఇవ్వాలంటూ ప్రొడ్యూసర్ తరఫు లాయర్ కోర్టును కోరగా తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.
Also Read: ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే సెకండ్ పార్ట్! - 'రానా నాయుడు' వెబ్ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ చూశారా?
అసలేం జరిగిందంటే?
- 'థగ్ లైఫ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది' అంటూ కామెంట్స్ చేశారు కమల్. దీంతో కన్నడ సంఘాలు, అధికార, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
- కమల్ తన కామెంట్స్ వెనక్కు తీసుకుని సారీ చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. లేకుంటే 'థగ్ లైఫ్' మూవీ కర్ణాటకలో రిలీజ్ కానివ్వబోమంటూ వార్నింగ్ ఇచ్చాయి.
- కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీనిపై హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేసింది. మరోవైపు.. కమల్ హాసన్ సైతం తన మూవీ రిలీజ్‌కు మార్గం సుగమం చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
- విచారించిన హైకోర్టు కమల్‌పై మీరేమైనా భాషావేత్తనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలతో కేఎఫ్‌సీసీకి కమల్ లెటర్ రాశారు. తమిళం, కన్నడ ప్రజలు ఒకే ఫ్యామిలీ అని చెప్పడమే తన ఉద్దేశం అని.. ఏ భాషను తక్కువ చేయాలని కాదంటూ వివరణ ఇచ్చారు.
- తన లెటర్‌లో ఎక్కడా 'సారీ' అనే పదం వాడకపోవడంతో ఈ వివాదం ఇప్పట్లో సమసేలా కనిపించడం లేదు. దీంతో ఈ సినిమా రిలీజ్‌ను కర్ణాటకలో వాయిదా వేశారు.
- కమల్ హాసన్, శింబు ప్రధాన పాత్రలో నటించిన 'థగ్ లైఫ్' మూవీ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి మణిరత్నం దర్శకత్వం వహించగా.. త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.





















