Rana Naidu Series Season 2 Trailer: ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే సెకండ్ పార్ట్! - 'రానా నాయుడు' వెబ్ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ చూశారా?
Rana Naidu Season 2 Web Series: రానా, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా సీజన్ 2 రాబోతుండగా.. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Daggubati Rana Venkatesh's Rana Naidu Web Series Season 2 Trailer Released: విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. ఈ సిరీస్‌లో అడల్ట్ కంటెంట్, అసభ్యకర డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టినా యూత్ ఆడియన్స్ ఎక్కువగా వీక్షించారు. అయినా.. రిలీజ్ అయిన అన్నీ భాషల్లోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుండగా.. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే..
ఫస్ట్ పార్ట్‌లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో ఈ సిరీస్‌పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని సెకండ్ పార్ట్‌లో దాన్ని కాస్త తగ్గించినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం ట్రైలర్‌లోనూ అలాంటి సీన్స్ లేవు. అయితే, ఫస్ట్ సీజన్‌కు మించి థ్రిల్, వినోదం పంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Rana’s only rule: When it comes to his family, he follows no rules 👊🥵
— Netflix India (@NetflixIndia) June 3, 2025
Watch Rana Naidu Season 2, as he returns with drama, dhamaka, and destruction on 13 June, only on Netflix.#RanaNaiduOnNetflix #JoLineCrossKiyaWoGaya pic.twitter.com/2z6OckWG8W
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుందని సదరు ఓటీటీ సంస్థ తెలిపింది. 'రానా ఏకైక రూల్. అతని ఫ్యామిలీ విషయానికొస్తే అతను ఎలాంటి రూల్స్ పాటించడు.' అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ సిరీస్‌లో రానా, వెంకటేష్‌లతో పాటు అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి కర్బంద, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినోమోరియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ శర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించగా.. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ మీడియా నిర్మిస్తున్నారు.
అయితే ఇందులో అసభ్యకర పదాలు, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో తెలుగు ఆడియన్స్ నుంచి ఎక్కువగా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఫ్యామిలీ హీరో వెంకటేష్‌ను ఆ రోల్‌లో తెలుగు ఆడియన్స్ తీసుకోలేకపోయారు. టాలీవుడ్ ఆడియన్స్ నుంచి నెగిటివిటీ వచ్చినా. ఎక్కువగా యూత్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసింది. దీంతో విడుదలైన అన్నీ భాషల్లోనూ ఈ సిరీస్ ఫస్ట్ పార్ట్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఈ సిరీస్ సీజన్ 2 కోసం యూత్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫస్ట్ పార్ట్ స్టోరీ ఏంటంటే?
బాలీవుడ్‌లో ఏ సెలబ్రిటీకి సమస్య వచ్చినా రానా నాయుడు (రానా) పరిష్కరిస్తుంటాడు. భార్య, ఇద్దరు పిల్లలతో హాయిగా జీవితం సాగిస్తుండగా.. అదే టైంలో రానా తండ్రి నాగా నాయుడు (వెంకటేష్) జైలు నుంచి వస్తాడు. అతనంటే రానాకు అస్సలు పడదు. తన తండ్రి వల్ల ఫ్యామిలీలో సమస్యలు వస్తాయని అనుకుంటాడు రానా. అసలు తండ్రీ కొడుకుల మధ్య వైరం ఎందుకు ఏర్పడింది? నాగా నాయుడు వచ్చిన తర్వాత రానా జీవితంలో జరిగిన మార్పులేంటి? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.





















