Kamal Haasan: మీరేమైనా చరిత్రకారుడా.. భాషావేత్తనా? - ఒక్క 'సారీ' చెబితే అయిపోద్దిగా.. కమల్ కామెంట్స్‌పై హైకోర్టు రియాక్షన్
Thug Life: కన్నడ నాట కమల్ హాసన్ కామెంట్స్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. 'థగ్ లైఫ్' బ్యాన్ చేయాలని వేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. కమల్ హాసన్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Karnataka High Court Comments On Kamal Haasan Kannada Language Comments: కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'కన్నడ' భాషపై చేసిన కామెంట్స్‌కు నిరసనగా.. కర్ణాటకలో 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్‌పై బ్యాన్ విధించాలని కోరుతూ కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) కోర్టును ఆశ్రయించగా దీనిపై మంగళవారం విచారించింది. ఒక్క 'సారీ' చెబితే సరిపోతుందని.. ఎంత పెద్ద నటుడైనా.. ప్రజల మనోభావాలు దెబ్బతీసే హక్కు లేదని తెలిపింది.
'మీరేమైనా చరిత్రకారులా?'
కమల్ కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించిన హైకోర్టు.. 'మీరేమైనా చరిత్రకారుడా?' అంటూ ఆయన్ను ప్రశ్నించింది. 'మీరు కమల్ హాసన్ కావొచ్చు. మరెవరైనా కావొచ్చు. ప్రజల మనోభావాలను దెబ్బతీయలేరు. ఓ ప్రజా ప్రతినిధిగా అలాంటి కామెంట్స్ చేయకూడదు. మీ కామెంట్స్ వల్ల వివాదం ఏర్పడింది. కన్నడ ప్రజలు మిమ్మల్ని క్షమాపణలు మాత్రమే అడిగారు. మీరు ఏ ప్రాతిపదికన ఆ కామెంట్స్ చేశారు?, మీరేమైనా చరిత్రకారులా?, లేదా భాషావేత్తనా? ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారు.' అంటూ కమల్ హాసన్‌ను హైకోర్టు ప్రశ్నించింది.
Also Read: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ మూవీ 'పెళ్లి కాని ప్రసాద్' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
జస్ట్ 'సారీ' చెబితే నో ప్రాబ్లమ్
క్షమాపణ చెప్పని పక్షంలో కర్ణాటకలో సినిమాను ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారని? కమల్ హాసన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. 'భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హద్దులు దాటి, ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదు కదా. మీరు 'సారీ' చెబితే ఏ సమస్యా ఉండదు. మీ సినిమాను ప్రదర్శించడం ద్వారా కర్ణాటక నుంచి కూడా మీరు రూ.కోట్లలో ఆదాయాన్ని పొందొచ్చు.' అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.
అయితే, కమల్ ఉద్దేశపూర్వకంగా ఆ కామెంట్స్ చేయలేదంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. 'పరిస్థితుల కారణంగా బాధితుడయ్యే వ్యక్తికీ, వాటిని సృష్టించే వ్యక్తికీ మధ్య చాలా తేడా ఉంది. ఇప్పటికే కమల్ బహిరంగంగా తన అభిప్రాయాన్ని ప్రకటించారు. దాన్ని మీరు ఇప్పుడు కప్పిపుచ్చలేరు. మిగిలింది సారీ చెప్పడమే.' అని తెలిపింది. కమల్ పరిస్థితిని చక్కబరిచేందుకు ప్రయత్నించినా.. అది ఓ దశలో పక్కదారి పట్టిందని ఆయన తరఫు లాయర్ చెప్పారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. 'మీరే పరిస్థితి చేయిదాటిపోయేలా చేశారు. ఇప్పుడేమో మీ సినిమాను రక్షించాలని కోరుతున్నారు.' అంటూ కామెంట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
'థగ్ లైఫ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది' అంటూ కామెంట్ చేశారు కమల్. దీనిపై కన్నడ నాట పెద్ద దుమారమే రేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు సహా కన్నడీగులు కూడా కమల్ కామెంట్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన 'సారీ' చెప్పాలని లేకుండా మూవీ రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని అన్నారు. అటు.. 'కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్' కూడా మూవీ రిలీజ్‌పై బ్యాన్ విధించాలంటూ కోర్టును ఆశ్రయించింది. మరోవైపు.. కమల్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ 'సారీ' చెప్పనని స్పష్టం చేశారు. మూవీ రిలీజ్ అయ్యేలా చూడాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా.. కేఎఫ్‌సీసీ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు కమల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.





















