Bhool Chuk Maaf OTT Release Date: థియేటర్లలో రిలీజై 2 వారాలైనా కాలేదు - ఓటీటీలోకి బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'భూల్ చుక్ మాఫ్'
Bhool Chuk Maaf OTT Platform: బాలీవుడ్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'భూల్ చుక్ మాఫ్' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. థియేటర్లలో రిలీజ్ అయిన 2 వారాల్లోనే ఓటీటీలోకి రానుంది.

Rajkumar Rao's Bhool Chuk Maaf OTT Release On Amazon Prime Video: రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'భూల్ చుక్ మాఫ్'. మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రెండు వారాలైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ మూవీ ఈ నెల 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఇండో పాక్ వార్, 'ఆపరేషన్ సింధూర్' నేపథ్యంలో ఈ మూవీని తొలుత థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని పీవీఆర్ ఐనాక్స్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ దినేష్ విజన్.. మాడాక్ ఫిల్మ్స్‌పై దావా వేసింది. ఈ వివాదం కారణంగా దాదాపు రూ.60 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు చల్లబడిన తర్వాత ఓటీటీలో కాదు నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామంటూ 'మాడాక్ ఫిల్మ్స్' మరో ప్రకటన చేసింది. ఈ మేరకు మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'భూల్ చుక్ మాఫ్'. ఈ మూవీకి కరణ్ శర్మ దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ కీలక పాత్రలు పోషించారు. దినేశ్ విజన్ మూవీని నిర్మించారు. ఈ మూవీలో సంజయ్ మిశ్రా, సీమా పహ్వా, రఘుబీర్ యాదవ్ కూడా కీలక పాత్రలు పోషించారు.
రెండు వారాల్లోనే ఓటీటీలోకి..
అయితే, థియేటర్లలో రిలీజ్ అయిన రెండు వారాల్లోపే ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. 'ఆపరేషన్ సింధూర్' ఎఫెక్ట్‌తో తొలుత ఓటీటీలో రిలీజ్ ప్రకటన.. ఆ తర్వాత మళ్లీ నేరుగా థియేటర్లలో రిలీజ్.. ఇప్పుడు తాజాగా థియేటర్లలో రిలీజ్ అయిన రెండు వారాల్లోపే మళ్లీ ఓటీటీలోకి వస్తుండడం పెద్ద మార్పే అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 'ఈ చిత్రం తప్పకుండా వినోదం పంచుతుంది. నిరంతరం మాకు మద్దతుగా నిలిచిన ఎగ్జిబిటర్లకు కృతజ్ఞతలు.' అంటూ నిర్మాత దినేశ్ విజన్ తెలిపారు.
స్టోరీ ఏంటంటే?
తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు గవర్నమెంట్ జాబ్ సాధించిన ఓ యువకుడి కథనే 'భూల్ చుక్ మాఫ్'. రంజన్ ఓ చిన్న టౌన్‌లో నివసిస్తాడు. అతను తన ప్రియురాలు తితిలిని వివాహం చేసుకునేందుకు గవర్నమెంట్ జాబ్ సాధిస్తాడు. అయితే, సరిగ్గా తన వివాహానికి ముందు రోజు రాత్రి తాను ఓ సమస్యలో చిక్కుకున్నట్లు రంజన్ గ్రహిస్తాడు. ఈ సమస్య గురించి తన కుటుంబ సభ్యులకు చెప్పినా.. ఎవరూ నమ్మరు. ఇంతకూ అతనికి ఎదురైన సమస్య ఏంటి?, పెళ్లికి ముందు అతను ఏం గ్రహించాడు?, దాన్నుంచి ఎలా బయటపడగలిగాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ముందు ఓటీటీ, ఆ తర్వాత థియేటర్.. ఇప్పుడు మళ్లీ ఓటీటీలోకి వస్తుండడంతో మూవీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





















