అన్వేషించండి

Kalyan Ram: NKR21 క్లైమాక్స్‌ ఫైర్ యాక్షన్ ఎపిసోడ్ పూర్తి - వెయ్యి మందితో కళ్యాణ్‌ రామ్‌ భారీ యాక్షన్‌ సీన్‌, రూ.8 కోట్ల భారీ సెట్‌

NRK21 Climax Shooting: కళ్యాణ్‌ రామ్‌ NRK21 మూవీ భారీ యాక్షన్‌ సీన్‌ పూర్తయ్యింది. మూవీలో కీలకమైన ఈ క్లైమాక్స్‌ యాక్షన్‌ సీన్‌ కోసం రూ. 8 కోట్ల భారీ సెట్‌ వేసి షూటింగ్ పూర్తి చేశారు.

 NKR21 Intense Climax Shoot With 1000 Artists Completed: నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది కళ్యాణ్‌ రామ్‌ 21వ సినిమా. #NKR21 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్‌ మూవీ. దివంగత నటులు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ప్రకటించిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది.

మూవీ ప్రకటనతోనే 'Fist Of Flame' పేరుతో గ్లింప్స్‌ రిలీజ్‌ చేసి హైప్‌ పెంచింది మూవీ టీం. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ పవర్ఫుల్‌ లుక్‌లో కనిపించాడు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కానీ సైలెంట్‌గా ఈ మూవీ షూటింగ్‌ని చకచక జరుపుకుంటుంది. ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం. ఇటీవల ఈ సినిమా క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ పూర్తయినట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్‌ సీన్‌ షూటింగ్ జరుపుకోబోతుంది.

ఇదోక ఫైర్ యాక్షన్ ఎపిసోడ్. క్లైమాక్స్‌లో వచ్చే ఈ ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌ కానుందట. థియేటర్లో ఆడియన్స్‌కి గూస్‌బంప్స్‌ తెప్పించే భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ అట. ఈ సీన్‌ కోసం అత్యంత భారీ సెట్‌ ప్లాన్‌ చేశాడట డైరెక్టర్‌. దాదాపు రూ. 8 కోట్ల వ్యయంతో ఈ క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం భారీ సెట్‌ వేసి షూటింగ్‌ జరిపారు. ఫైర్ యాక్షన్ ఎపిసోడ్‌ని దాదాపు 1000 మందితో షూటింగ్‌ చేశారు. ఈ అప్‌డేట్‌ చూసి నందమూరి ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ సినిమా నుంచి వచ్చిన ఈ లేటెస్ట్‌ అప్‌డేట్‌ మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ చేసింది.

ఈ సినిమాను ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌. విజయశాంతి, సోహెల్ ఖాన్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: భర్త రాహుల్‌పై చిన్మయి పోస్ట్‌ - కూతురికి తండ్రి హగ్‌ ఇస్తే తప్పేంటి? గాయనిపై నెటిజన్ల సెటైర్లు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Game Changer Pre Release Event Highlights: 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guntur Municipal Commissioner Throw Mic | మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో మైక్ విసిరేసిన కమిషనర్ | ABP DesamGame Changer Ticket Rates Fix | గేమ్ ఛేంజర్ కి రేట్ ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్ | ABP DesamSwimmer Shyamala Swimming Vizag to Kakinada | 52ఏళ్ల వయస్సులో 150 కిలోమీటర్లు సముద్రంలో ఈత | ABP DesamAus vs Ind 5th Test Day 2 Highlights | ఆసక్తికరంగా మారిపోయిన సిడ్నీ టెస్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Game Changer Pre Release Event Highlights: 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Telangana New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు కోసం అర్హతలివేనా?
తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు కోసం అర్హతలివేనా?
HYDRA: ప్రజలకు 'హైడ్రా' కమిషనర్ కీలక సూచన - కంప్లైంట్ చేయాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి
ప్రజలకు 'హైడ్రా' కమిషనర్ కీలక సూచన - కంప్లైంట్ చేయాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి
Guinnes World Record: నాలుకతో ఒక్క నిమిషంలో 57 ఫ్యాన్ బ్లేడ్లను ఆపాడు - సూర్యాపేట వాసికి గిన్నిస్ రికార్డుల్లో చోటు
నాలుకతో ఒక్క నిమిషంలో 57 ఫ్యాన్ బ్లేడ్లను ఆపాడు - సూర్యాపేట వాసికి గిన్నిస్ రికార్డుల్లో చోటు
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
Embed widget