Jr NTR: వారిని మిస్ అవుతాను - 'దేవర' నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన ఎన్టీఆర్
Jr NTR On Devara Shooting: జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీకి సంబంధించిన ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే అప్‌డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ వారందరిని మిస్ అవుతానంటూ ఎమోషనల్ అయ్యాడు.
Jr NTR Wrapped Devara Shooting: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే 'దేవర' ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రోడక్షన్ వర్క్‌తో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు 'దేవర'.
NTR Just wrapped Final Shot for Devara Part 1"ఇప్పుడే దేవర పార్ట్ 1 షూటింగ్‌లోని చివరి షాట్‌ను పూర్తి చేశాను. ఇదోక అద్బుతమైన ప్రయాణం. అద్భుతమైన టీం, వారి సముద్రమంత ప్రేమను మిస్ అవుతాను. సెప్టెంబర్ 27న శివ రూపొందించిన ప్రపంచంలోకి ప్రతి ఒక్కరు ప్రయాణించే వరకు వేచి ఉండలేకపోతున్నా" అంటూ ఫ్యాన్స్ కిక్ ఇచ్చే అప్‌డేట్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఈ సందర్భంగా సెట్‌లో కొరటాల శివతో దిగిన ఫోటోను షేర్ చేశాడు.
Just wrapped my final shot for Devara Part 1. What a wonderful journey it has been. I will miss the ocean of love and the incredible team. Can’t wait for everyone to sail into the world crafted by Siva on the 27th of September. pic.twitter.com/RzOZt3VCEB
— Jr NTR (@tarak9999) August 13, 2024
కాగా దేవర రెండు పార్టులుగా వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ముందు నుంచి సమాచారం. దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన లేదు. కానీ, మూవీ అప్‌డేట్స్, ప్రచార పోస్టర్స్ ఎన్టీఆర్ ఇందులో డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టు అర్థమైపోతుంది. కాగా ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక రీసెంట్‌గా జాన్వీ-ఎన్టీఆర్ మధ్య తీసిన "చుట్టమల్లే.." రొమంటిక్ సాంగ్ విడుదల కాగా దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో మారుమోగుతూ ట్రెండింగ్‌లో నిలిచింది.
ఇందులో జాన్వీ-ఎన్టీఆర్‌ల కెమిస్ట్రీ బాగుందని, వారిద్దరి జోడి అదిరిపోయిందంటూ రివ్యూస్ వచ్చాయి. విస్మరణక గురైన తీర ప్రాంతం నేపథ్యంలో యాక్షన్, రివేంజ్ డ్రామాగా దేవరను పాన్ ఇండియా స్థాయిలో తెరెక్కిస్తున్నాడు కొరటాల. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె దేవర దేవరను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ వంటి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.