అన్వేషించండి

Jayasudha: అందరినీ అలా పిలిచే అలవాటు నాకు లేదు, ఇండస్ట్రీలో ఆ ఇద్దరే నాకు అన్నయ్యలు - జయసుధ

Jayasudha: సీనియర్ హీరోయిన్ జయసుధ.. అప్పటి నటులతో చాలా క్లోజ్‌గా ఉంటారు. కానీ అందులో కొందరినీ మాత్రమే తన కుటుంబం అనుకుంటానని చెప్పారు. ఇద్దరిని మాత్రమే తాను అన్నయ్యల్లాగా భావిస్తానని తెలిపారు.

Jayasudha: సీనియర్ నటి జయసుధకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అలవాటు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధ.. ఇండస్ట్రీలో తను సన్నిహితంగా ఉండేవారి గురించి చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తను నిర్మాతగా తెరకెక్కించిన ‘హ్యాండ్సప్’ సినిమా విశేషాలను గుర్తుచేసుకున్నారు. అసలు ఆ మూవీలో నటించడానికి చిరంజీవి ఎలా ఒప్పుకున్నారు? మూవీ చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి అని బయటపెట్టారు జయసుధ.

అలవాటు లేదు..

‘‘ఇండస్ట్రీలో కొంతమందిని నేను కుటుంబ సభ్యులుగా భావిస్తాను. కానీ కుటుంబం అంటే కుటుంబమే. మోహన్ బాబు, మురళీ మోహన్ నన్ను చెల్లెమ్మ అన్నారు కాబట్టి వాళ్లను అన్నయ్య అంటాను తప్పా అందరినీ అన్నయ్య, అక్క అని పిలిచే అలవాటు నాకు లేదు. ఎవరైనా అలా అనుకున్నా కూడా అలా ఎలా అనుకుంటారు అనిపిస్తుంది. నాకు అలాంటివి అలవాటు లేదు’’ అని క్లారిటీ ఇచ్చారు జయసుధ. చాలావరకు ఈ నటి జీవితంలో జరిగిన పర్సనల్ విషయాలు చాలామంది ప్రేక్షకులకు తెలుసు. ఆ విషయాన్ని తాన్నే స్వయంగా ఒప్పుకుంటారు కూడా. దానిపై ఆమె స్పందిస్తూ.. చాలామంది హీరోలు కూడా తనలా మాట్లాడాలనుకుంటారు కానీ మాట్లాడలేరు అని స్టేట్‌మెంట్ ఇచ్చారు జయసుధ.

సరదా సంభాషణ..

జయసుధ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు లీడ్ రోల్ చేసిన మూవీ ‘హ్యాండ్సప్’. అందులో నాగబాబు కూడా మరో లీడ్ రోల్‌లో నటించారు. చిరంజీవికి, జయసుధకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉండడంతో అప్పుడప్పుడు ఆయన ఫోన్ చేసి సినిమా ఎలా నడుస్తుందని కనుక్కునేవారు ఆమె గుర్తుచేసుకున్నారు. అలా ఒకానొక సందర్భంగా తనకేమైనా రోల్ ఉందా అని సరదాగా అడిగారని అన్నారు. అప్పుడే దర్శకుడు శివ నాగేశ్వర రావు వచ్చి క్లైమాక్స్‌లో ఒక పెద్ద హీరో గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారట. అదే విషయంపై చిరంజీవిని ఆ రోల్ కోసం సంప్రదించారట జయసుధ.

ఆ లెవెల్‌లో లేదు..

‘హ్యాండ్సప్’లో క్యామియో చేయడానికి చిరంజీవిని సంప్రదించగా.. స్పెషల్ అప్పీయరెన్స్ అనేది అసలు మన ప్రేక్షకులకు అర్థమవుతుందో లేదో అని అన్నారని గుర్తుచేసుకున్నారు జయసుధ. ‘‘ఆ సమయంలో బాలీవుడ్ అనేది మనకంటే చాలా ముందు ఉంది. అమితాబ్ బచ్చన్ సడెన్‌గా ఒక సినిమాలో కనిపించడం లాంటివి ఉండేవి. వాళ్లు హాలీవుడ్ స్టైల్‌ను ఫాలో అయ్యేవారు. ఆ లెవెల్‌కు మనవాళ్లకు అర్థమవుతుందో లేదో అని చిరంజీవి అన్నారు. డౌట్ ఉన్నా కూడా సినిమా చేశారు కానీ పోస్టర్‌లో మాత్రం ఆయన ఫోటో వేయొద్దు అని చెప్పారు ఎందుకంటే నేను చివర్లో వస్తాను కదా అన్నారు’’ అని బయటపెట్టారు. ‘హ్యాండ్సప్’ కథ విన్నప్పుడు చిరంజీవికి నచ్చినా సినిమా చూశాక ఆయనకు అస్సలు నచ్చలేదని ఓపెన్‌గా చెప్పేశారు జయసుధ.

Also Read: త్రివిక్రమ్ చెప్పిన పాయింట్ నాకు నచ్చలేదు, ఆ మూవీకి డైలాగ్స్ రాయనన్నారు: విజ‌య్ భాస్క‌ర్

టాప్ హెడ్ లైన్స్

Niharika Konidela : పింక్ ఎలిఫెంట్ గోత్రం... నిహారిక నక్షత్రం - నేషనల్ అవార్డ్ విన్నింగ్ హ్యాపీ మూమెంట్స్
పింక్ ఎలిఫెంట్ గోత్రం... నిహారిక నక్షత్రం - నేషనల్ అవార్డ్ విన్నింగ్ హ్యాపీ మూమెంట్స్
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
The Odyssey Collections : నోలన్ ది ఒడిస్సీ రికార్డు - మూడు రోజుల్లోనే 2 వేల 500 కోట్ల కలెక్షన్స్
నోలన్ ది ఒడిస్సీ రికార్డు - మూడు రోజుల్లోనే 2 వేల 500 కోట్ల కలెక్షన్స్
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget