అన్వేషించండి

Director Vijay Bhaskar: త్రివిక్రమ్ చెప్పిన పాయింట్ నాకు నచ్చలేదు, ఆ మూవీకి డైలాగ్స్ రాయనన్నారు: విజ‌య్ భాస్క‌ర్

Vijay Bhaskar: డైరెక్ట‌ర్ విజ‌య్ భాస్క‌ర్. ఎన్నో హిట్ సినిమాలు తీశారు. మంచి మంచి సినిమాలు అందించారు. అల‌నాటి ముచ్చ‌ట్లు పంచుకున్నారు ఆయ‌న‌. 'స్వ‌యంవ‌రం' సినిమా విశేషాలు చెప్పుకొచ్చారు.

Director Vijay Bhaskar About Trivikram : 'స్వ‌యంవ‌రం' సినిమా.. అప్ప‌ట్లో ఇది సూప‌ర్ హిట్. ఇప్ప‌టికీ ఆ సినిమా పాట‌లు, డైలాగులు ఫేమ‌స్. మ్యూజిక్ ల‌వ‌ర్స్ ఆ పాట‌ల‌ను ఆస్వాదిస్తూనే ఉంటారు. వేణు, ల‌య న‌టించిన ఆ సినిమా డైరెక్ట‌ర్ విజ‌య్ భాస్క‌ర్. ఆ సినిమా త‌ర్వాత ఎన్నో హిట్ సినిమాలు అందించారు విజ‌య భాస్క‌ర్. అయితే, ఆ సినిమా కంటే ముందు సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డం, రెండో సినిమా ఆగిపోవ‌డంతో భ‌యం వేసింద‌ని అంటున్నారు విజ‌య్ భాస్క‌ర్. ఇక స్వ‌యం వ‌రం సినిమా లైన్ ముందు త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, మార్చడంతోనే హిట్ అయ్యింద‌ని ఆయ‌న అన్నారు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కి ఆ పేరు ఎలా వ‌చ్చిందో ఆయ‌న చెప్పారు. ఇటీవ‌ల ఆయ‌న ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాల‌న్నీ పంచుకున్నారు. 

చాలా భ‌యం వేసింది.. 

ఫ‌స్ట్ సినిమా ఫ్లాప్ అయ్యింది? రెండో సినిమా ఆగిపోయిన‌ప్పుడు మీకు కెరీర్ గురించి భ‌యం వేయ‌లేదా? అని అడిగిన ప్ర‌శ్న‌కి ఆయ‌న ఈ స‌మాధానం చెప్పుకొచ్చారు. "ఇప్పుడు త‌లుచుకుంటే ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటుంది. అప్పుడు మాత్రం చాలా భ‌యంగా ఉందేడి. భ‌యం అంటే.. కంప్ర‌హెన్ష‌న్. నా ద‌గ్గ‌ర మ్యాట‌ర్ ఉంది నేను చేయ‌గ‌ల‌ను అనుకునే వాడిని. అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. బాగుంది అన్నీ ఉన్నాయి అనుకున్నా. కానీ, కొన్ని జ‌ర‌గ‌వు. త‌ర్వాత నాకు అర్థం అయ్యింది ఏందంటే?  నీకు జ‌రగ‌న‌ప్పుడు యూనివ‌ర్స్ అంతా అన్ హ్యాపీ అనిపిస్తుంది. అనుకున్న ప్ర‌తీది పాడ‌వుతుంది. ఒక టైం వ‌చ్చిన‌ప్పుడు యూనివ‌ర్స్ హ్యాపీగా ఉంటుంది. అలా స్వ‌యంవ‌రం ఆఫ‌ర్ వ‌చ్చింది. వెళ్లిపోదాం చెన్నై అనుకున్న‌ప్పుడు ఫోన్ కాల్ వ‌చ్చింది. సినిమా ఏదో అనుకుంటున్నారు అదేమైనా చేస్తారా అని. స‌రే అన్నాను అలా నా కెరీర్ మ‌లుపు తిరిగింది" అంటూ చెప్పుకొచ్చారు విజ‌య్ భాస్క‌ర్. 

త్రివిక్ర‌మ్ చెప్పిన లైన్ న‌చ్చ‌లేదు... 

"స్వ‌యంవ‌రంకి' ఓకే చెప్పాను. లైన్ చెప్పారు. కానీ, నాకు న‌చ్చ‌లేదు. వెంట‌నే నాకు న‌చ్చ‌లేదు స్క్రీన్ ప్లే మార్చాలి అన్నాను. కుద‌ర‌దు అని చెప్పారు. ముందే దెబ్బ‌తిని ఉన్నాను. తెలిసి తెలిసి త‌ప్పు చేయ‌లేం క‌దా. అలా మూడు రోజులు డిస్క‌ష‌న్ జ‌రిగింది. అప్పుడు శ్యాంగారు "ఏం మారుస్తారో చూడొచ్చు క‌దా? అప్పుడు మీరు రిజ‌క్ట్ చేయొచ్చు క‌దా" అని చెప్పారు.

క‌ట్ చేస్తే ఒక రూమ్ లో నేను, త్రివిక్ర‌మ్.. అప్పుడు ఆయ‌న పేరు శ్రీ‌నివాస్. మూడు రోజులు కూర్చుని వ‌ర్క్ చేశాం. అంతా ప్రిపేర్ చేసిన త‌ర్వాత‌.. డైలాగులు కూడా మీరే రాయండి అని త్రివిక్ర‌మ్ ని అన్నాను. అయితే, ఒప్పుకోలేదు. "డైరక్ష‌న్ చేయ‌డానికి వ‌చ్చాను రైట‌ర్ గా కాదు" అన్నాడు. అప్పుడు నేనే లేదు లేదు మీరు రాయాలి. బాగోక‌పోతే వేరే వాళ్ల‌ను పెట్టుకుందాం అన్నాను. అలా త్రివిక్ర‌మ్ డైలాగ్స్ రాశాడు.

నేను సినిమాలో మార్చింది ఏంటంటే? హీరోనే విల‌న్ అందులో. ప్రేమిస్తాను అంటాడు పెళ్లి చేసుకోను అంటాడు. తేడాగా ఉంటుంది. నేను ఏంటంటే దాన్ని పాజిటివ్ గా చెప్పాలి అనుకున్నాను. లేకుంటే వీళ్ల‌కు మెంట‌లా? అనుకుంటారు. శ్రీ‌శ్రీ గారు అన్న‌ట్లు కుక్క పిల్ల‌, అగ్గిపుల్ల‌, స‌బ్బు బిల్ల కాదేది క‌విత‌కు అన‌ర్హం. అలా మ‌నం దేనైన్నా స్టోరీగా చేయొచ్చు. మ్యాజిక్ అంతా స్క్రిన్ ప్లే మీద ఆధార‌ప‌డి ఉంటుంది. వాడు ఎందుకు అలా అనుకుంటున్నాడో చెప్పాలి.

ప్రేమ అనే స్వ‌ర్గం నుంచి ఏడ‌డుగుల న‌ర‌కమే పెళ్లి. అలా ఆడియెన్స్ దాన్ని ఒప్పేసుకుంటారు. జ‌న‌ర‌లైజ్ చేసి పెళ్లి వ‌ద్ద‌ని చెప్పం. దాన్ని కొంచెం ఎంట‌ర్ టైనింగ్ గా చెప్పాలి. అట్ల దాన్ని కొంచెం ఎంట‌ర్ టైనింగ్ గా చేశాం. అలా కుదిరింది. మూడు రోజుల్లో అన్ని చేసేశాం. టక ట‌క అయిపోయాయి. ఇక రైట‌ర్ గా త‌న పేరు వ‌ద్ద‌న్నాడు త్రివిక్ర‌మ్. అప్పుడు నేను త‌ర్వాత రిగ్రెట్ అవుతావు నీకు చాలా ఫ్యూచ‌ర్ ఉంది అని అప్పుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అని పేరు వేశాం" అని అన్నారు విజ‌య్ భాస్క‌ర్.

వందేమాత‌రం శ్రీ‌నివాస్‌ను వ‌ద్ద‌న్నారు

"వందేమాత‌రం శ్రీ‌నివాస్ అప్ప‌టికే రాములమ్మ లాంటివి చేశారు. అంద‌రూ వ‌ద్ద‌న్నారు. మీరు రొమాంటిక్ సినిమా అంటున్నారు. ల‌వ్ స్టోరీ అంటున్నారు ఆయ‌న ఎందుకు అన్నారు. చాలా మంది మ్యూజిక్ డైరెక్ట‌ర్ల కోసం చూశాం. కానీ, ఎవ్వ‌రూ సెట్ అవ్వ‌లేదు. అత‌ను వ‌చ్చాడు క‌థ చెప్పాను చెప్పిన వెంట‌నే.. స‌రే సార్ చేసేద్దాం అని అన్నాడు. అలలా మ్యూజిక్ ఆ సినిమాకి చాలా సెట్ అయ్యింది". 

Also Read: 'వ‌కీల్ సాబ్' మళ్లీ వచ్చేస్తున్నాడు - రీరిలీజ్ ఎప్పుడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Kavitha: నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?
నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?
Lok Sabha Elections 2024: ఐదో దశ పోలింగ్ ప్రారంభం, ఈ విడతలో ఓటేసిన ప్రముఖులు వీరే
ఐదో దశ పోలింగ్ ప్రారంభం, ఈ విడతలో ఓటేసిన ప్రముఖులు వీరే
Top 5 Hatchback Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌లు - 2024 స్విఫ్ట్ నుంచి టియాగో దాకా!
రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌లు - 2024 స్విఫ్ట్ నుంచి టియాగో దాకా!
Jr NTR Birthday Special: ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్‌కు విమర్శకులూ సైలెంట్
ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్‌కు విమర్శకులూ సైలెంట్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Anantapur New SP Gowthami Sali | అనంతపురం కొత్త ఎస్పీ ప్రెస్‌మీట్ | ABP DesamHusband Accused His Wife For Threatening | భార్య వేధింపులపై భర్త సెల్ఫీ వీడియో | ABP DesamWife Beats Her Husband: Viral Video | భార్య కొడుతోందని..రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించిన భర్తSRH vs PBKS Match Fans Reactions | పంజాబ్ తో మ్యాచ్... ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Kavitha: నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?
నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?
Lok Sabha Elections 2024: ఐదో దశ పోలింగ్ ప్రారంభం, ఈ విడతలో ఓటేసిన ప్రముఖులు వీరే
ఐదో దశ పోలింగ్ ప్రారంభం, ఈ విడతలో ఓటేసిన ప్రముఖులు వీరే
Top 5 Hatchback Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌లు - 2024 స్విఫ్ట్ నుంచి టియాగో దాకా!
రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌లు - 2024 స్విఫ్ట్ నుంచి టియాగో దాకా!
Jr NTR Birthday Special: ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్‌కు విమర్శకులూ సైలెంట్
ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్‌కు విమర్శకులూ సైలెంట్
Weather Latest Update: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ గుడ్‌న్యూస్! వాటి ప్రస్తుత గమనం ఇదే
నైరుతి రుతుపవనాలపై ఐఎండీ గుడ్‌న్యూస్! వాటి ప్రస్తుత గమనం ఇదే
Redmi Note 13R: మార్కెట్లోకి రెడ్‌మీ నోట్ 13ఆర్ ఎంట్రీ - రూ.16 వేలలోనే!
మార్కెట్లోకి రెడ్‌మీ నోట్ 13ఆర్ ఎంట్రీ - రూ.16 వేలలోనే!
RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Embed widget