News
News
వీడియోలు ఆటలు
X

Jabardasth Aishwarya: లైఫ్ పార్ట్‌నర్‌ను ఇంట్రడ్యూస్ చేసిన 'జబర్దస్త్' ఐశ్వర్య

Jabardasth Aishwarya Boyfriend : జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన ఐశ్వర్య ఉల్లింగల తనకు కాబోయే భాగస్వామి ఎవరో చెప్పేసింది. అంతే కాదు వేదికపైనే తన ప్రియుడితో తాళి కట్టించుకుంది.

FOLLOW US: 
Share:

Jabardasth Aishwarya: ఇటీవలి కాలంలో పలు వెబ్ సిరీస్ లు, 'జబర్దస్త్' (Jabardasth) షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న నటి ఐశ్వర్య ఉల్లింగల ( Aishwarya Ullingala )  తన మనసులోని మాటను చెప్పేసింది. జబర్దస్త్ వేదికపై ప్రియుడితో తాళి కట్టించుకుని అందర్నీ సర్ ప్రైజ్ చేసింది. రీసెంట్ గా విడుదలైన ఈ వారం 'జబర్దస్త్' ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

ఈ నేపథ్యంలో ప్రతీ వారం లాగానే ఈ వారానికి సంబంధించిన 'జబర్దస్త్' షో ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ సారి ప్రోమో కాస్త ఇంట్రస్టింగ్ గా ఉండనున్నట్టు వీడియో ఓపెన్ చేయగానే తెలిసిపోతోంది. ఈ ప్రోమోలో కంటెస్టంట్లలో ఒకరైన ఐశ్వర్య ఉల్లింగల తన కాబోయే వ్యక్తిని వేదికపై పరిచయం చేసింది. అప్పుడే వేదికపై వచ్చిన శ్రీనివాస్ సాయి అనే వ్యక్తి.. అందరికీ షాక్ ఇచ్చాడు. అప్పటికే పెళ్లి కూతురి గెటప్ లో ఉన్న ఐశ్వర్య మెడలో శ్రీనివాస్ తాళి కట్టడం ఇంకా ఆసక్తిగా అనిపిస్తోంది. అంతే కాదు ఇదే సమయంలో శ్రీనివాస్ మోకాళ్లపై స్టైల్ గా కూర్చొని గులాభీ పువ్వు ఇస్తూ ఐశ్వర్యకు లవ్ ప్రపోజ్ చేస్తాడు. 

శ్రీనివాస సాయి కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. ఆయనది బెంగళూరు. 'శుభలేఖ + లు', 'వినరా సోదర వీర కుమార', 'మధనం' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొంది, తక్కువ కాలంలోనే ఎనలేని ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న  టెలివిజన్ షో 'జబర్దస్త్' కామెడీ షో. ఈ షో పాపులర్ కావడంతో కంటెస్టంట్లకు సైతం మంచి గుర్తింపు వచ్చింది. అలా ఈ రోజు సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగారు. అలాంటి వాళ్లలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ధన్ రాజ్, రాకెట్ రాఘవ, గెటప్ శ్రీను లాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇటీవల 'బలగం' అనే మొదటి సినిమాతోనే రికార్డులు సృష్టించిన కమెడియన్ వేణు టిల్లు కూడా ఈ షో నుంచి వచ్చిన వాడే. ఈ మూవీతో డైరెక్టర్ గా మారి, ఎనలేని పేరు తెచ్చుకున్నారు. అలా షో లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ఏదో ఒక గుర్తింపుతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. 

ఇక ఈ షోలో ఇంతకుముందు రష్మీ, అనసూయలు యాంకర్స్ గా, మెగా బ్రదర్ నాగబాబు, నటి రోజా జడ్జెస్ గా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్లెవరూ లేరు. షోలో కామెడీ చేసే కంటెస్టంట్ లు కూడా మొత్తం చేంజ్ అయ్యారు. ప్రస్తుతం  ప్రముఖ కమెడియన్ కృష్ణ భగవాన్, హీరోయిన్ ఇంద్రజ జడ్జ్ లుగా వ్యవహరిస్తుండగా.. ఇటీవలే యాంకర్ రష్మీ స్థానంలో సౌమ్యా రావు అనే కొత్త యాంకర్ వచ్చి చేరారు. దీంతో పాత 'జబర్దస్త్'లో ఉన్న వాళ్లంతా బిగ్ స్క్రీన్ కి, పలు ఫ్లాట్ ఫామ్స్ కి వెళ్లిపోవడంతో ప్రస్తుతం కామెడీ తగ్గిందని బుల్లి తెర ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. దీంతో షో రేటింగ్ కూడా ముందులా కాకుండా చాలా పడిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read 'జూబ్లీ' వెబ్ సిరీస్ రివ్యూ : స్టార్ హీరోయిన్ ఎఫైర్... సెక్స్ వర్కర్‌తో డైరెక్టర్ లవ్... అదితి రావు హైదరి నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

ఈ ప్రోమోను చూసిన న్యాయ నిర్ణేతలు వారిపై పలు వ్యాఖ్యలు చేశారు. 'జబర్దస్త్' స్టేజ్ మీదే మీరిద్దరూ కలవడం చాలా కంగ్రాట్స్ అని కృష్ణభగవాన్ చెప్పగా...  అయ్య బాబోయ్ అంటూ ఇంద్రజ సమాధానం అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజైన ఈ ప్రోమో వీడియోకు భారీ రెస్పా్న్స్ వస్తోంది. వేదికపై ఒక్కటైన ఐశ్వర్య, శ్రీనివాస్ సాయిలకు ప్రేక్షకులు ఈ సందర్భంగా కంగ్రాజ్యులేషన్స్ చెబుతున్నారు. ఈ 'జబర్దస్త్' ప్రోమోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా.. ఈ నెల 13వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Also Read 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?

Published at : 08 Apr 2023 05:57 PM (IST) Tags: Jabardasth Aishwarya Ullingala Srinivas Sai Jabardasth Aishwarya Boyfriend

సంబంధిత కథనాలు

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

అభిమానుల చేతుల మీదుగా 'భగవంత్ కేసరి' టీజర్ - ఎన్ని థియేటర్లలో తెలుసా?

అభిమానుల చేతుల మీదుగా 'భగవంత్ కేసరి' టీజర్ - ఎన్ని థియేటర్లలో తెలుసా?

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం