Samantha: శోభితాతో నాగచైతన్య పెళ్లి రూమర్స్ - సమంతపై ఎఫెక్ట్?
Samantha: నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత కూడా వీరు మళ్లీ కలుస్తారేమో అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ ఇంతలోనే శోభితా ధూళిపాళతో షికార్లు కొడుతూ కనిపిస్తున్నాడు నాగచైతన్య.
Naga Chaitanya And Sobhita Wedding Rumors: సమంత, నాగచైతన్య విడాకుల వార్త.. అప్పట్లో ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదంతా పూర్తయ్యి దాదాపు రెండేళ్లు అవుతున్నా ఇంకా ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరూ కలిస్తే బాగుంటుందని అనుకుంటూనే ఉన్నారు. బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య.. ఆఫ్ స్క్రీన్‌లో కూడా పెళ్లి చేసుకొని అందరినీ సంతోషపెట్టారు. కానీ కొన్నాళ్లకే విడిపోయి అందరికీ షాకిచ్చారు. అయితే విడాకుల తర్వాత సామ్, చైతూ పర్సనల్ లైఫ్‌లో చాలా మార్పులు జరిగాయి. కొన్నాళ్లుగా నాగచైతన్య.. హీరోయిన్ శోభితా ధూళిపాళతో డేటింగ్‌లో ఉన్నాడని, పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.
గ్రీస్‌లో పుట్టినరోజు..
ప్రస్తుతం సమంత, నాగచైతన్య ఎవరి పర్సనల్ లైఫ్‌లో వారు బిజీగా ఉన్నారు. సమంత.. తన మాయాసైటీస్ ట్రీట్మెంట్, హెల్త్ పోడ్కాస్ట్‌లతో బిజీగా ఉండగా.. నాగచైతన్య తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయ్యాడు. తాజాగా సమంత తన 37వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి గ్రీస్‌కు వెళ్లింది. బర్త్ డే తర్వాత రోజు గ్రీస్‌లోని ఏథెన్స్‌లో తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. వాటన్నింటి మధ్యలో ‘నిన్ను నువ్వు ఎప్పుడూ కోల్పోకు’ అనే కొటేషన్‌ను కూడా షేర్ చేసింది సామ్. ఇది చూసి సమంత.. ఏదో విషయంలో ఫీల్ అవుతుందని, నాగచైతన్య, శోభితా డేటింగ్ రూమర్స్ తనపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.
మధ్యలో శోభితా..
నాగచైతన్య, సమంత విడాకుల వెనుక అసలు కారణమేంటి అని ఈ జంట ఇప్పటికీ బయటపెట్టలేదు. కానీ పలు సందర్భాల్లో తమ రిలేషన్‌షిప్‌ను వర్కవుట్ చేయడానికి ప్రయత్నించినా కాలేదని చెప్పుకొచ్చారు. అయితే కొన్నాళ్ల తర్వాత అయినా వీరు మళ్లీ కలుస్తారు అని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ అంతలోనే తెలుగమ్మాయి శోభితా ధూళిపాళతో చక్కర్లు కొట్టడం ప్రారంభించాడు చైతూ. ఫారిన్‌లో వీరిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్‌లో కనిపించారు. అప్పటినుండి వీరిపై రూమర్స్ మొదలయ్యాయి. ఇక ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి ఎక్కువగా షికార్లు కొడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో త్వరలోనే నాగచైతన్య, శోభితా వివాహం కూడా చేసుకోనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
కలిసి ట్రిప్స్..
తాజాగా నాగచైతన్య ఓ ఫారెస్ట్ ఏరియాకు షికారుకు వెళ్లి.. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదే సమయంలో శోభితా కూడా అచ్చం అదే లొకేషన్‌లో ఫోటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరూ కలిసి ట్రిప్‌కు వెళ్లారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసేసుకున్నారు. దీంతో వీరు ఇంత ఓపెన్‌గా షికార్లు చేయడం మొదలుపెట్టారు కాబట్టి పెళ్లి కూడా చేసుకుంటారేమో అని అనుకోవడం మొదలుపెట్టారు. కానీ సమంత మాత్రం ఇవేవి పెద్దగా పట్టించుకోకుండా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా ఇన్‌డైరెక్ట్ కౌంటర్లు ఇస్తూ తన వెకేషన్స్‌లో ఎంజాయ్ చేస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా ‘బంగారం’ అనే కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేసింది.
Also Read: గుడిలో సింపుల్‌గా నటుడు జయరామ్ కుమార్తె వివాహం - ఇంతకీ వరుడు ఎవరో తెలుసా?