ఫేస్ ఫ్యాట్‌ని తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వాలి కొందరికి ఫేస్ మరీ లావుగా ఉంటుంది. దానివల్ల వారు కాస్త పెద్దగా కనిపిస్తారు. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే దానిని తగ్గించుకుని యవ్వనంగా కనిపించవచ్చు. రెగ్యూలర్‌గా ఫేషియల్ ఎక్సర్సైజ్లు, ఫేస్ యోగా చేస్తే ఫ్యాట్ తగ్గుతుంది. ఆల్కహాల్ తాగడం తగ్గితే చాలా మంచిది. లేదంటే అది ముఖంపై ఫ్యాట్‌ను పెంచుతుంది. ఫైబర్ రిచ్ ఫుడ్‌ను డైట్లో చేర్చుకోవాలి. ఇది ఎక్కువగా తినడాన్ని తగ్గిస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోతే ముఖం ఉబ్బిపోతుంది. కాబట్టి మంచి నిద్ర బ్యూటీ, హెల్త్‌ని ప్రమోట్ చేస్తుంది. కార్డియో ఎక్కువగా చేస్తే మెటబాలిజం పెరుగుతుంది. ఇది ఫేస్ ఫ్యాట్ తగ్గిస్తుంది. ఇవి అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)