అమితాబ్ బచ్చన్ 3000 కోట్ల ఆస్తికి చట్టపరమైన వారసులెవరు? ఐశ్వర్య రాయ్ కి ఎంతొస్తుంది?
Amitabh Bachchan Property: అమితాబ్ బచ్చన్ 3000 కోట్ల ఆస్తికి చట్టపరమైన వారసులెవరు? పంపకాలు ఎలా జరుగుతాయి? కోడలు ఐశ్వర్య రాయ్ కి ఎంతొస్తుంది?

Amitabh Bachchan 3000 Crore Property : అమితాబ్ బచ్చన్.. తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో నటించారు, ఇప్పటికీ మంచి మంచి పాత్రలు చేస్తూనే ఉన్నారు. యాంగ్రీ యంగ్ మెన్ గా కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు బిగ్ బీ. ఇప్పటికీ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. సినిమాల్లో, స్మాల్ స్క్రీన్ పైనా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో మెరుస్తున్నారు. ఈ ఏజ్ లోనూ ఇంత బిజీగా ఉండడం , ఉత్సాహంగా వరుస షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేయడం చూసి అభిమానులు ముచ్చటపడుతుంటారు. కెరీర్ సంగతి పక్కనపెట్టేస్తే బిగ్ బీకి ఇప్పుడు కోట్ల ఆస్తి ఉంది. మరి బిగ్ బీ ఆస్తికి వారసులు ఎవరు? తనకున్న కోట్ల ఆస్తిని ఎవరికి ఎంతిస్తారు?
అమితాబ్ బచ్చన్ ఆస్తి ఎంత?
బాలీవుడ్ షెహెన్షా అమితాబ్ బచ్చన్ తన సినిమాలు, కౌన్ బనేగా కరోడ్‌పతి అనే షో ద్వారా కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించారు. లైఫ్‌స్టైల్ ఆసియా నివేదిక ప్రకారం అమితాబ్ బచ్చన్ 3 వేల 190 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు. ఆయనకు 112 కోట్లు ఉన్న లగ్జరీ బంగ్లాలు ఉన్నాయి. వీటిలో జనక్ , వత్స వంటి బంగ్లాల విలువ కోట్లలో ఉంది. బిగ్ బీ లగ్జరీ కార్ల సేకరణ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. వీటిలో బెంట్లీ కాంటినెంటల్ GT, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, రోల్స్ రాయిస్ ఫాంటమ్, లెక్సస్ LX570 మరియు ఆడి A8L ఉన్నాయి. బిగ్ బీ దాదాపు 260 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌కు కూడా యజమాని.
View this post on Instagram
అమితాబ్ బచ్చన్ 3 వేల కోట్ల ఆస్తికి వారసుడు ఎవరు?
అమితాబ్ బచ్చన్ 3 వేల కోట్ల ఆస్తికి చట్టపరమైన వారసులు ఆయన భార్య జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్, కుమార్తె శ్వేతా బచ్చన్. బిగ్ బీ తన కుమారుడు అభిషేక్ బచ్చన్ , కుమార్తె శ్వేతా బచ్చన్ ని సమానంగా చూస్తారు. తన ఆస్తిని తన ఇద్దరు పిల్లలకు సమానంగా పంచుతానని ఓ సందర్భంలో చెప్పారు కూడా. 2011లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నేను చనిపోయినప్పుడు, నా దగ్గర ఉన్నదంతా నా కుమార్తె కుమారుడికి సమానంగా పంచుతారు - ఇందులో ఎటువంటి వివక్ష ఉండదు. జయా నేను చాలా కాలం క్రితమే ఇది నిర్ణయించుకున్నాం. అమ్మాయిలు పరాయి ధనం అని అందరూ అంటారు, ఆమె తన భర్త ఇంటికి వెళుతుంది, కానీ నా దృష్టిలో ఆమె మా కుమార్తె, అభిషేక్‌కు ఉన్న హక్కులే ఆమెకు కూడా ఉన్నాయి." అని చెప్పారు. గతేడాది అమితాబ్ బచ్చన్ ముంబైలో తన కోట్ల రూపాయల బంగ్లా ప్రతిక్షను తన కుమార్తె శ్వేతా బచ్చన్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ బంగ్లా ధర 50 కోట్లుగా చెబుతున్నారు.
కోడలు ఐశ్వర్యకు కూడా ఆస్తిలో వాటా వస్తుందా?
అమితాబ్ బచ్చన్ ఆస్తిలో కోడలు ఐశ్వర్యకు చట్టబద్ధంగా నేరుగా వాటా రాదు. కానీ అభిషేక్ బచ్చన్ భార్య , ఆరాధ్య తల్లిగా, ఆమె ఆస్తితో పరోక్షంగా సంబంధం కలిగి ఉంటుంది.
బచ్చన్ కుటుంబం మొత్తం నికర ఆస్తుల విలువ ఎంత?
అమితాబ్ బచ్చన్: రూ. 3,110 కోట్లు (ప్రతీక్షను బహుమతిగా ఇచ్చిన తర్వాత)
జయా బచ్చన్: రూ. 1,083 కోట్లు
ఐశ్వర్య రాయ్ బచ్చన్: రూ. 828 కోట్లు
అభిషేక్ బచ్చన్: రూ. 280 కోట్లు
శ్వేతా బచ్చన్: రూ. 110 కోట్లు (బహుమతిగా ఇచ్చిన ప్రతిక్ష ఇందులో లేదు)
ఆగస్త్య , నవ్య నందా: రూ. 1-2 కోట్లు , రూ. 16 కోట్లు






















