అన్వేషించండి

Mahesh Babu: రియల్ హీరో... లిటిల్ హార్ట్స్ సేవియర్ మహేష్ బాబు - సూపర్ స్టార్ ఫౌండేషన్ నుంచి సాయం ఇలా పొందొచ్చు!

Mahesh Babu Foundation: మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారులకు హార్ట్ సర్జరీ ఫ్రీగా చేయిస్తోన్న సంగతి తెలిసిందే. మరి సాయం కావాలనుకునే వారు ఏం చేయాలో తెలుసా?

Mahesh Babu Foundation Application Details: ఎప్పుడూ ముఖంపై చెరగని చిరునవ్వు... తరగని అందం... తన నటనతో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు. సమాజ సేవలోనూ ఎప్పుడూ ముందుంటూ రియల్ హీరో అనిపించుకున్నారు. వేలాది మంది పేద చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేసి వారి కుటుంబాల్లో సంతోషం నింపారు.

కేవలం హార్ట్ ఆపరేషన్స్ మాత్రమే కాకుండా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే, పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, వృద్ధులకు, అభాగ్యులకు ఆపన్న హస్తం అందిస్తూ వచ్చారు. మహేష్ 50వ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విషెష్ చెబుతున్నారు.

ఇలా అప్లై చెయ్యొచ్చు

మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె సమస్యలు ఉన్న పేద చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్స్ చేయిస్తారు. ఇందుకోసం అందరికీ అందుబాటులో ఓ వెబ్ సైట్ తీసుకొచ్చారు. డైరెక్ట్‌గా 'https://www.maheshbabufoundation.org/' సైట్‌లో రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఇందులో పూర్తి వివరాలు ఎంటర్ చేస్తే ఆయన టీమే మిమ్మల్ని సంప్రదిస్తుంది. కొద్ది రోజుల క్రితమే మహేష్ బాబు ఫ్యాన్స్ తమ సోషల్ మీడియాc బయోలో ఈ ఫౌండేషన్ లింక్ షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు ఆయన్ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. మహేష్ తమ పాలిట దేవుడని సాయం పొందిన ఎందరో ప్రశంసిస్తున్నారు.

Also Read: మహేష్ బాబు పర్సనల్ లైఫ్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు - సమాధానాలు తెల్సా?

ఫౌండేషన్ వెనుక కథ

మహేష్ బాబు కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడే గుండె సంబంధిత సమస్య ఉండడంతో సర్జరీ చేయించారు. అయితే, ఆర్థికంగా ఇబ్బందులు పడే వారు తమ చిన్నారులకు డబ్బుల్లేక సర్జరీ చేయించలేకపోతున్నారనే ఆలోచన మహేష్ బాబును కదిలించింది. దీంతో చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్స్ ఫ్రీగా చేయించేలా ఈ ఫౌండేషన్‌ను మహేష్, ఆయన భార్య నమ్రతతో కలిసి 2020లో స్థాపించారు. ఇప్పటివరకూ దాదాపు వేలాది మందికి ఉచితంగా ఆపరేషన్స్ చేయించారు.

30 శాతం సేవా కార్యక్రమాలకు

మహేష్ బాబు తన సంపాదనలో 30 శాతం సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నారు. పిల్లల గుండె ఆపరేషన్స్ కోసం ఏటా రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో 2 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు సైతం చేస్తున్నారు. 2016లో ఏపీలోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. అక్కడి ఆస్పత్రుల నుంచి, ఫ్రీ మెడికల్ క్యాంప్స్, బాలికలకు గర్భకోశ నివారణ వ్యాక్సిన్లు, పాఠశాలలకు కంప్యూటర్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.

కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్

మహేష్ బాబు తన తండ్రి పేరిట 'సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్'ను స్టార్ట్ చేశారు. 40 మందికి పైగా పేద విద్యార్థులను సెలక్ట్ చేసి వారికి స్కాలర్షిప్ అందించారు. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పీజీ వరకూ స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. మహేష్ ముద్దుల కూతురు సితార సైతం చారిటీస్‌లో ముందుంటారు. ఆమె ఓ జ్యువెలరీ కంపెనీ యాడ్‌లో నటించగా వచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్‌ రూ.కోటికి పైగా డబ్బులను వృద్ధుల ఆరోగ్యం, ఆహార అవసరాల కోసం ఇచ్చేసి తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spirit: 'స్పిరిట్' షూటింగ్ అప్డేట్... ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పారో విన్నారా?
'స్పిరిట్' షూటింగ్ అప్డేట్... ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పారో విన్నారా?
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
NTR Jr On Balakrishna Injury: బాబాయ్ బాలయ్య కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు... ఫోనులో మావయ్యకు లోకేష్ పరామర్శ
బాబాయ్ బాలయ్య కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు... ఫోనులో మావయ్యకు లోకేష్ పరామర్శ
Manasaagadhe Song Lyrics: మనసాగదే సాంగ్ లిరిక్స్... తారా సుతారియాతో యశ్ రొమాంటిక్ మెలోడీ... ట్రెండింగ్‌లో 'టాక్సిక్' సెకండ్ సింగిల్
మనసాగదే సాంగ్ లిరిక్స్... తారా సుతారియాతో యశ్ రొమాంటిక్ మెలోడీ... ట్రెండింగ్‌లో 'టాక్సిక్' సెకండ్ సింగిల్

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget