Vicky The Rockstar: రైతు పాదాలకు ముద్దు పెడుతున్న హీరో
హీరో హీరోయిన్ ముద్దు పెట్టుకోవడాన్ని ఫస్ట్ లుక్ కింద విడుదల చేసిన సినిమాలు ఉన్నాయి. అయితే... రైతు పాదాలకు హీరో ముద్దు పెడుతున్న స్టిల్ ఫస్ట్ లుక్ కింద విడుదల చేసింది 'విక్కీ ద రాక్ స్టార్' యూనిట్.
Movie About Farming: దేశానికి రైతు వెన్నుముక అంటారు. అయితే, ఆధునిక భారతంలో రైతాంగం అడుగులు వేసే యువత తక్కువ మంది కనిపిస్తున్నారు. వ్యవసాయం ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఆ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమా చేశారు. ఇటీవల రైతు విలువ వివరించే చిత్రాలు తీయడానికి కొంత మంది చిన్న హీరోలు, దర్శక - నిర్మాతలు ముందడుగు వేస్తున్నారు. 'విక్కీ ది రాక్ స్టార్' కూడా అటువంటి చిత్రమే.
హీరో హీరోయిన్లు ముద్దులు పెట్టుకోవడం కామన్. ఆ ముద్దులు ఫస్ట్ లుక్స్ కింద ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ఉన్నాయి. అమ్మాయికి కాకుండా ఒక రైతు పాదాలకు హీరో ముద్దు పెట్టడం డిఫరెంట్. అటువంటి డిఫరెంట్ ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'విక్కీ ది రాక్ స్టార్' యూనిట్. విక్రమ్, అమృత చౌదరి జంటగా నటిస్తున్న చిత్రమిది. సిఎస్ గంటా దర్శకత్వంలో శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి (IAF) ప్రొడ్యూస్ చేస్తున్నారు. తాజాగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
'విక్కీ ది రాక్ స్టార్' ఫస్ట్ లుక్ చూస్తే... గిటార్ భుజాన వేసుకున్న ఒక రాక్ స్టార్ నాగలి మోస్తున్న రైతు పాదాలకు ముద్దు పెడుతున్నట్లు ఉంది. ఈ లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మోషన్ పోస్టర్‌లో 'నీ కాళ్ళకే ముద్దులే పెట్టనా ఫార్మర్?' అంటూ వినిపించిన సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది. బాణీ మోడ్రన్ గా ఉంది. అదీ సంగతి! వైవిధ్యమైన, ఇప్పటి వరకు తెలుగులో ఎవరూ స్పృశించని కథాంశంతో సినిమా తీస్తున్నట్లు చిత్ర బృందం చెబుతోంది.
Also Read: డీ గ్లామర్ రోల్‌లో కీర్తీ సురేష్ - టీజర్‌లో ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటే సినిమాలో ఎలా ఉంటుందో?
''ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కు ప్రజల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఆసక్తి పెంచింది. అది మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని దర్శక - నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా : భాస్కర్, ఎడిటర్ : ప్రదీప్ జంబిగా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : సుభాష్, చరిత.
Also Read: కరీనా కపూర్ బొట్టు ఎక్కడ? హిందువులను అవమానించడమే - ట్రోలింగ్ గురూ