Suhas: 'కలర్ ఫోటో' ఫేం సుహాస్ కీలక నిర్ణయం - 'జనక అయితే గనక'కి రిస్క్ చేస్తున్నాడా?
Suhas Janaka Aithe Ganaka Movie: కలర్ ఫోటో ఫేం, టాలంటెడ్ యాక్టర్ సుహాస్ తన సినిమాతో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. తన సినిమాకు తానే డిస్ట్రీబ్యూటర్‌గా మారబోతున్నాడట.
Suhas Takes Janaka Aithe Ganaka US Rights: టాలంటెడ్ యాక్టర్ సుహాస్ వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కంటెంట్ ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ని అలరిస్తున్నాడు. 'కలర్ ఫోటో'తో హీరోగా మారిన సుహాస్ రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్నవదనం వంటి చిత్రాలతో హీరోగా సక్సెస్ అందుకున్నాడు. హీరోగానే కాదు నటుడిగాను రాణిస్తున్నాడు. పాత్రకు ప్రాధాన్యత ఉంటే స్టార్ హీరో చిత్రాల్లోనూ సహానటుడి పాత్ర చేస్తున్నాడు.
ప్రస్తుతం హీరోగానే సినిమాలపై ఫోకస్ పెట్టిన సుహాస్ త్వరలోనే 'జనక అయితే గనక' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోతున్నాడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా శిరీష్ సమర్పణ హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సలార్ సినిమాకి డైలాగ్స్ రాసిన సందీప్ రెడ్డి బండ్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది.సినిమాలో సుహాస్ ఒక మిడిల్ క్లాస్ యువకుడిగా కనిపించబోతున్నాడు.
తన భార్య, పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని కలలు కంటూ పెళ్లికాని కుర్రాడిగా పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో డబ్బు విపరీతంగా సేవ్ చేసే పిసినారి పాత్రలో కనిపించబోతున్నాడని టీజర్ చూస్తే అర్థమైపోతుంది. సెప్టెంబర్ 7న ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఫైనల్ వెర్షన్ కూడా వచ్చేసింది. తాజాగా ఇది చూసిన సుహాస్ మూవీ కోసం ఓ రిస్క్ చేస్తున్నాడట. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు ప్రమోషన్స్‌ని జరుపకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ప్రెస్‌లో మీట్‌లో పాల్గొన్న సుహాన్ మాట్లాడుతూ మూవీ గురించిన విశేషాలను పంచుకున్నాడు.
View this post on Instagram
ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ.. "ఈ సినిమా ఫైనల్ వెర్షన్ చూశాను. సినిమా చాలా బాగా వచ్చింది. మూవీ హిట్ అవుతందనే నమ్మకం కలిగింది. వెంటనే ఆలోచించకుండ ఈ సినిమా యూఎస్ రైట్స్ తీసుకున్నాను. ఇది పక్కా ఎంటర్‌టైనింగ్ సినిమా అవుతుంది. ఇందులో నా పాత్ర మీమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతున్నారు. ప్రతి దానికీ లెక్కలు చెప్పే మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తాను. తప్పకుండా ప్రేక్షకులు పడీ పడీ నవ్వుకుంటారు. మా డైరక్టర్ చాలా మంచి సినిమా చేశారు. దిల్‌రాజు గారు ఇచ్చిన సపోర్టు మర్చిపోలేం" అని చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాతో సుహాస్ డిస్ట్రిబ్యూటర్‌గా మారబోతోన్నాడు. తన సినిమాకు తనే డిస్ట్రీబ్యూట్ చేసుకోవడం విశేషం. అయితే దీనిపై కొందరు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేరీర్ ప్రారంభంలోనే డిస్ట్రీబ్యూటర్‌గా మారడం అంటే రిస్క్ చేస్తున్నట్టే అంటున్నారు. కానీ, నటుడిగా తనకు వచ్చిన ఏ అవకాశాన్ని సుహాస్ వదలుకోవడం లేదు. ఇండస్ట్రీలో తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు అందిని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అలాగే ఇది కూడా అంటున్నారు. ఇక సుహాస్ ఈ సినిమాతో పాటు మరో మూడు చిత్రాలకు హీరోగా సైన్ చేశాడు. అలాగే ఓ చిత్రంలో అతిథి పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: 'ఖుషీ 2' ఎప్పుడు? ఎస్‌జే సూర్యకు ప్రియాంక మోహన్ ఆసక్తికర ప్రశ్న - ఆయన రియాక్షన్ ఏంటంటే..!