త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!
'వర్షం' సినిమాతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ త్రిష... మళ్లీ వెండితెరపై దూకుడుపెంచింది. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ధనుష్, అజిత్ వంటి స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ ను కొట్టేసింది త్రిష.
Trisha : ఒకప్పుడు స్టార్ నటిగా వెలుగొందిన త్రిష.. కొన్ని రోజులుగా ఆమె కెరీర్ స్లో అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఆమె ఏ టాప్ బ్యానర్‌లతోనూ, ఏ స్టార్ హీరో చిత్రానికి ఆమె సంతకం చేయలేదు. త్రిష చివరిసారిగా మణిరత్నం రూపొందించిన 'పొన్నియన్ సెల్వన్' పార్ట్స్ లో ఓ ప్రధాన పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఆమె భవిష్యత్ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించింది. మొన్నటివరకూ ఎలాంటి ఆఫర్లు లేక ఖాళీగా ఉన్న త్రిష.. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయిపోయిది. ఆమె.. స్టార్ హీరో విజయ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'లియో'లో కనిపించనుంది. తమిళ స్టార్ అజిత్ కుమార్ సరసన కథానాయికగా నటించడానికి ఆమె సిద్ధమైంది.
ధనుష్ ప్రతిష్టాత్మక గోల్డెన్ జూబ్లీ చిత్రంలోనూ త్రిష కథానాయికగా నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు తాత్కాలికంగా 'D50' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రామ్ దర్శకత్వంలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ రాబోయే చిత్రంలోనూ త్రిష నటించనుంది.
‘లియో’లో అలా ఆఫర్ వచ్చిందట..
విజయ్ దళపతి హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న'లియో' చిత్రంలో ఓ స్టార్ హీరోయిన్ తప్పుకోవడంతో త్రిషకు ఛాన్స్ వచ్చిందని ఇటీవల కథనాలు వచ్చాయి. ముందుగా ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవిని అనుకున్నారట. ఆమెకు కథ కూడా చెప్పారట. అయితే, సాయి పల్లవి నో చెప్పారట. సినిమాల ఎంపికలో ఎంతో ఆచితూచి వ్యవహరించే సాయి పల్లవి.. కమర్షియల్ సినిమాలకు, హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యం ఉన్న సినిమాలకు ఆమె కొంచెం దూరంగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ముందు ఓకే చెప్పినా.. ఆ తర్వాత మాత్రం పలు కారణాల వల్ల సాయి పల్లవి మొత్తం మీద సినిమా చేయనని చెప్పేశారట. కారణాలేమైనా గానీ సాయి పల్లవి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ త్రిషకు వచ్చిందని టాక్ వినిపిస్తోంది.
ధనుష్ D50 లోనూ త్రిషే..
కెప్టెన్ మిల్లర్ తర్వాత ధనుష్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలోనూ ధనుష్ కి జోడీగా త్రిష పేరే పరిశీలనలో ఉందనే వార్త హల్ చల్ చేస్తోంది. ఈ లెక్కన చూస్కుంటే కోలీవుడ్ స్టార్ హీరోలంతా త్రిష పేరే జపం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న త్రిష.. రీసెంట్ డేస్ లో సీనియర్ లిస్ట్ లోకి వెళ్లిపోయింది. ఈ సమయంలోనే ఇటీవల మణిరత్నం తీసిన 'పొన్నియన్ సెల్వన్' లో నటించి.. మళ్లీ మునుపటి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కుందవై పాత్రలో అలరించిన త్రిష.. ప్రమోషన్స్ లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మూవీ ప్రమోషన్స్ లో ఆమె కట్టుబొట్టు అందర్నీ ఆకర్షించింది. 'పొన్నియన్ సెల్వన్' హిట్, ఫ్లాపుల విషయాన్ని పక్కన పెడితే.. ఆ సినిమా మాత్రం త్రిషకు బాగానే కలిసొచ్చింది. ఆ సినిమా ఫలితమే ఆమెకు ఇప్పుడు వరుస ఛాన్స్ లు వచ్చేలా చేసిందని పలువురు అంటున్నారు. ఇక హీరో అజిత్ 'విడా మయుర్చి'లోనూ త్రిషనే హీరోయిన్ గా ఎంపికైంది. అంతే కాదు మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న మూవీలోనూ త్రిష పేరే పరిశీలనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఏదైమైనా త్రిష ఒక్క సినిమాతో తన కెరీర్ ను మళ్లీ సెట్ చేసుకుందంటూ ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!