Rashmika Mandanna: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో చీరలో మెరిసిన రష్మిక - చూడడానికి సింపుల్‌గా ఉన్నా ఈ శారీ ధర ఎంతో తెలుసా?
Rashmika Mandanna: అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు హాజరయిన పలువురు సౌత్ సెలబ్రిటీల్లో రష్మిక మందనా కూడా ఒకరు. ఇక ఈ వేడుకల్లో తన ధరించిన బ్లూ శారీ.. చాలామందిని ఆకర్షించింది.
Rashmika Mandanna Saree At Ambani Wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి మాత్రమే కాదు.. ఆ పెళ్లికి వచ్చిన గెస్టులు, వారు ధరించిన చీరలు.. ఇలా ఆ ఈవెంట్‌కు సంబంధించిన ప్రతీ ఒక్క విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలావరకు హీరోయిన్లు ధరించిన చీరలు, లెహెంగాల గురించే చాలామంది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అనంత్, రాధిక పెళ్లికి బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా పలువురు సౌత్ స్టార్లు కూడా హాజరయ్యారు. అందులో రష్మిక మందనా ఒకరు. ఈ పెళ్లికి బ్లూ కలర్ చీరలో మెరిసింది రష్మిక. దీంతో ఈ శారీ చూసి ఇంప్రెస్ అయిన చాలామంది దీని ధర కనుక్కునే ప్రయత్నం చేశారు.
డిజైనర్ చీర..
పెళ్లికి ముందు శుభ్ ఆశీర్వాద్ అనే ప్రత్యేకమైన ఈవెంట్‌ను ప్లాన్ చేసింది అంబానీ ఫ్యామిలీ. ఆ ఈవెంట్ కోసం షిమ్మరింగ్ బ్లూ శారీని ధరించింది రష్మిక. ఈ చీర చూసినవారంతా ఏంటి రష్మిక ఇంత సింపుల్‌గా వచ్చేసింది అని అనుకున్నారు. కానీ ధర తెలిసిన తర్వాత శారీ అంత సింపుల్‌గా ఏం లేదు అని అనుకోవడం మొదలుపెట్టారు. నిధి తాంబి కేజ్రివాల్ డిజైన్ చేసిన ఈ ధర రూ.1.28 లక్షలు అని తెలుస్తోంది. ఈ శారీపై సింపుల్‌గా స్లీవ్‌లెస్ డార్క్ బ్లూ బ్లౌజ్‌ను ధరించింది ఈ కన్నడ బ్యూటీ. ఆ శారీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక మందనా.
View this post on Instagram
గుజరాతీ స్టైల్..
ఇక అంబానీ ఇంట జరిగిన మరో ఈవెంట్ కోసం రష్మిక ముస్తాబయిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇందులో తను యెల్లో లెహెంగాపై వైట్ కలర్ ఓణీతో ఆకట్టుకుంది. ఈ ఫోటోలు చూస్తుంటే తను అచ్చం గుజరాతీ స్టైల్‌లో రెడీ అవ్వడానికి ప్రయత్నించిందని అర్థమవుతోంది. చేతి నిండా గాజులు, హెవీ జ్యువలరీ.. తన లుక్‌కు మరింత బ్యూటీని యాడ్ చేసింది. యెల్లో లెహెంగాలో తను షేర్ చేసిన ఫోటోలతో పాటు ఈ కలర్ తన ఫేవరెట్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది రష్మిక మందనా.
View this post on Instagram
ప్యాన్ ఇండియా సినిమాలు..
ప్రస్తుతం రష్మిక మందనా ప్యాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తోంది. ఇప్పటికే తన చేతిలో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లోని ‘పుష్ప 2’ ఉండగా.. సల్మాన్ ఖాన్ ‘సికిందర్’లో కూడా తనే హీరోయిన్‌గా ఎంపికయ్యింది. విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ‘ఛావా’లో కూడా ఈ భామ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో రష్మిక ఫుల్ బిజీ అయిపోయింది.
Also Read: అంబానీ పెళ్లిలో ఆసక్తికర సంఘటన - అమితాబ్ కాళ్లకు నమస్కరించిన రజనీకాంత్, వీడియో వైరల్