అన్వేషించండి

Amitabh Bachchan-Rajinikanth: అంబానీ పెళ్లిలో ఆసక్తికర సంఘటన - అమితాబ్‌ కాళ్లకు నమస్కరించిన రజనీకాంత్‌, వీడియో వైరల్‌

Rajinikanth and Amitabh Bachchan Video: అనంత్‌ అంబానీ,రాధిక మర్చంట్‌ పెళ్లిలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అమితాబ్‌ను చూడగానే పలకరిస్తూ రజనీకాంత్‌ ఆయన కాళ్లకు నమస్కరించిన వీడియో వైరల్‌గా మారింది. 

Rajinikanth Touches Amitabh Bachchan Feet: ప్రస్తుతం దేశమంత అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా అంబానీ పెళ్లిలో సందడి చేశారు. ఇక బాలీవుడ్‌ తారల హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు. జులై 3 నుంచి మొదలైన ఈ పెళ్లి వేడుకల్లో ఎక్కడ చూసిన బాలీవుడ్‌ సెలబ్రిటీల సందడే కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసి, ఎవరి నోట విన్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు.

ఈ వివాహమహోత్సవానికి మన టాలీవుడ్‌ స్టార్స్‌, సౌత్‌ హీరోలు కూడా వెళ్లడంతో దక్షిణాదిలోనూ అంబానీ పెళ్లి అంశం ఆసక్తిని సంతరించుకుంది. మహేష్‌ బాబు,రామ్‌ చరణ్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, విక్టరి వెంకేటేష్‌, హీరో సూర్యతో పాటు పలువురు సతీసమేతంగా అంబానీ పెళ్లికి వెళ్లారు. అక్కడ ఇతర స్టార్స్‌ మన సౌత్‌ హీరోలతో కలివిడిగా ఉంటూ వారిని అప్యాయంగా పలకిరించిన దృశ్యాలు ఫ్యాన్స్‌ని ఆకట్టుకున్నాయి. అయితే నిన్న అనంత్‌, రాధిక శుభ్‌ ఆశీర్వాద్‌ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకులో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, సౌత్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ కలుసుకున్నారు. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుని కాసేపు ముచ్చటించుకున్నారు.

అయితే అమితాబ్‌ను చూడగానే రజనీకాంత్‌ ఆయన కాళ్లకు నమస్కరించబోయారు.  దీంతో బిగ్‌బి వెంటనే స్పందిస్తూ రజనీని ఆపారు. అలా ఇద్దరు అగ్ర నటుల ఎలాంటి ఈగో లేకుండా మాట్లాడుకోవడం, ఒకరిపట్ల ఒకరు గౌరవం ప్రదర్శించుకోవడం చూసి ఆయా హీరో ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియో వైరల్‌ అవుతుంది. ఇక ఇద్దరు లెజెండరిలను ఒకేఫ్రేంలో చూడటం.. అదీ కూడా ఇద్దరు సరదగా ముచ్చటించుకోవడం చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. కాగా అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌లు జూలై 12న మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

View this post on Instagram
 
A post shared by Pallav Paliwal (@pallav_paliwal)

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిరథుల సమక్షంలో, వేదపండితులు, ఇరుకుటుంబ సభ్యుల మధ్య ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. పెళ్లి అనంతరం వేదపండితులను ఈ జంటకు శభ్‌ ఆశిర్వాదం పేరుతో ఈవెంట్‌ను నిర్వహించి ఆశీర్వాచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన అగ్రతారలు, నటీనటులు హజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కొత్త జంటకు ఖరీదైన బహుమతి ఇచ్చి ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పెళ్లి సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, వెంకటేష్‌, రామ్‌ చరణ్‌, రాగా దగ్గుబాటిలు సతీసమేతంగా వచ్చారు. అక్కినేని హీరో నాగార్జున తనయుడు అఖిల్‌ కూడా ఈ పెళ్లిలో సందడి చేశాడు. 

Also Read: 'కల్కి 2898 ఏడీ' మైలురాయి, ఆ డైరెక్టర్‌ను టార్గెట్‌ చేస్తూ నాగ్‌ అశ్విన్‌ షాకింగ్ కామెంట్స్‌ - అసూయ పడ్డారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget