అన్వేషించండి

Deewana First Review - 'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?

Deewana Review In Telugu: హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన 'దీవానా' శుక్రవారం రిలీజ్ అవుతోంది. అయితే పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. సినిమాకు వచ్చిన టాక్ ఏమిటి? ఫస్ట్ రివ్యూ ఎలా ఉందంటే?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హర్షిత్ రెడ్డి 'దీవానా' చిత్రం పేయిడ్ ప్రీమియర్లతో శుక్రవారం విడుదలైంది.
  • సినిమాలో ఊహించని ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను చాలా ఆశ్చర్యపరిచింది.
  • భావోద్వేగ సన్నివేశాలు, హర్షిత్ రెడ్డి నటనకు మంచి స్పందన లభించింది.
  • సంగీతం, ఇతర నటీనటుల నటన చిత్రానికి మరింత బలం చేకూర్చింది.

Harshit Reddy Deewana Movie Review In Telugu: ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'లో చేసిన పాత్ర యువ నటుడు హర్షిత్ రెడ్డికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చింది. అయితే ఆ సినిమాకు ముందు 'మెయిల్'లో, తర్వాత సమంత 'శుభం'లో హీరోగా నటించారు. హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'దీవానా'. జూన్ 19 (ఈ శుక్రవారం) రిలీజ్. అయితే రెండు రోజుల ముందు పెయిడ్ ప్రీమియర్లు వేశారు. సినిమాకు వచ్చిన టాక్ ఏమిటి? ఎలా ఉంది? ఫస్ట్ రివ్యూలో తెలుసుకోండి. 

మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్!
చచ్చేంత ప్రేమ లేకపోతే అది ప్రేమే కాదు - 'దీవానా' ట్రైలర్‌లో ఫస్ట్ డైలాగ్ ఇది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే... ఇదొక టీనేజ్ లవ్ స్టోరీ అని ఈజీగా అర్థం అవుతుంది. ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితులను, ఆఖరికి కన్న తల్లిదండ్రులను కూడా వద్దనుకున్న ఓ యువకుడి కథ అని, ఇదొక వన్ సైడ్ లవ్ స్టోరీ అని ట్రైలర్ బట్టి తెలుస్తుంది. మరి, సినిమా ఎలా ఉంది? అంటే...

Also ReadMaa Inti Bangaram First Review - 'మా ఇంటి బంగారం' ఫస్ట్ రివ్యూ: సమంత బ్యాగ్రౌండ్ తెలిసింది... మరి సినిమా ఎలా ఉందంటే?

'దీవానా' ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఇంటర్వెల్ పాయింట్ గురించి గొప్పగా చెబుతున్నారు. ఇంటర్వెల్ పాయింట్ చూసి షాక్ అయ్యామని అంటున్నారు. ప్రేమ, స్నేహం, ఆ రెండిటినీ మించి భావోద్వేగం... ఇంటర్వెల్ దగ్గర చాలా బాగా వర్కవుట్ అయ్యాయట. ట్విస్ట్ తెలిస్తే సినిమా చూసేటప్పుడు ఎంజాయ్ చేయలేరు గనుక రివీల్ చేయడం లేదు. 

కర్చీఫులు తీసుకుని వెళ్లండమ్మా...!
థియేటర్లలో 'దీవానా' ట్విస్ట్ దెబ్బకు కుర్చీల్లో నుంచి రెండు మూడు నిమిషాలు ప్రేక్షకులు ఎవరూ పైకి లేవలేదట. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ కంటతడి పెడతారని, ఎమోషనల్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు అయితే తప్పకుండా ఏడుస్తారని కొందరు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి రేర్ అండ్ యూనిక్ సినిమా రాలేదని ప్రీమియర్ చూసిన ప్రేక్షకుడు ఒకరు చెప్పారు.

Also Read: Samantha Meets CM Vijay - విజయ్‌ను కలిసిన సమంత... తమిళనాడు సీఎంను ఆకాశానికి ఎత్తేసిన హీరోయిన్

Harshith Reddy Acting In Deevana: యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటనపై ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని డైలాగ్ డెలివరీతో పాటు యాక్టింగ్ గురించి చెబుతున్నారు. సినిమా ఎవరినీ డిజప్పాయింట్ చేయదని ఎర్లీ రిపోర్ట్స్ వచ్చాయి. హీరోయిన్ స్మేహ మణిమేగలై నటన కూడా సినిమాకు ప్లస్ అయ్యిందట. ఈ సినిమాకు ఈశ్వర్ చంద్ సంగీతం అందించారు. ఆయన పాటలు, నేపథ్య సంగీతం సినిమాను ఎలివేట్ చేశాయట. మరి ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో? హర్షిత్ రెడ్డి మరొక హిట్ అందుకుంటాడో? లేదో? వెయిట్ అండ్ సి.

Also ReadNeno Butterfly Song Promo - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసిందిరోయ్... సూర్యతో మమితా బైజు ప్రేమ పాట, ఆ డ్యాన్స్‌ చూశారా?

Frequently Asked Questions

'దీవానా' సినిమా ఎప్పుడు విడుదలైంది?

'దీవానా' సినిమా జూన్ 19న విడుదల కానుంది. అయితే, రెండు రోజుల ముందుగానే పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శించారు.

'దీవానా' సినిమా కథాంశం ఏమిటి?

ఇది ఒక టీనేజ్ లవ్ స్టోరీ. ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితులను, తల్లిదండ్రులను వదిలేసిన యువకుడి వన్-సైడ్ లవ్ స్టోరీ ఇది.

'దీవానా' సినిమా ఇంటర్వెల్ గురించి ప్రత్యేకత ఏమిటి?

సినిమా ఇంటర్వెల్ పాయింట్ వద్ద మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఉందని ప్రేక్షకులు ప్రశంసించారు. ఇది ప్రేమ, స్నేహం, భావోద్వేగాలను అద్భుతంగా వర్కవుట్ చేసిందని అంటున్నారు.

'దీవానా' సినిమాలో హర్షిత్ రెడ్డి నటన ఎలా ఉంది?

హర్షిత్ రెడ్డి నటనకు, డైలాగ్ డెలివరీకి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఆయన పాత్ర ఎవరినీ నిరాశపరచదని ఎర్లీ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
This Week Theatrical Movies : ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు
ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Advertisement

వీడియోలు

Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
Embed widget