అన్వేషించండి

Maa Inti Bangaram First Review - 'మా ఇంటి బంగారం' ఫస్ట్ రివ్యూ: సమంత బ్యాగ్రౌండ్ తెలిసింది... మరి సినిమా ఎలా ఉందంటే?

Maa Inti Bangaram Review In Telugu: సమంత నటించిన తాజా సినిమా 'మా ఇంటి బంగారం'. ప్రముఖ దర్శకుడు - సామ్ భర్త రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్ ప్లే, నిర్మాణ సారధ్యంలో రూపొందిన సినిమా ఎలా ఉందంటే?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సమంత ప్రధాన పాత్రలో 'మా ఇంటి బంగారం' జూన్ 19న విడుదల.
  • ఫ్లాష్‌బ్యాక్‌లో సమంత ధీర వనితగా ప్రజల కోసం పోరాటం.
  • విలన్ గుల్షన్ దేవయ్యతో ఆమె గత పోరాటమే కథకు కీలకం.
  • సమంత నటన, కథనం సినిమాను విజయవంతం చేస్తాయని టాక్.

Samantha Maa Inti Bangaram Telugu Review: సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'మా ఇంటి బంగారం'. ప్రముఖ దర్శకుడు - సామ్ భర్త రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరించారు. సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి సమంత నిర్మించారు. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. జూన్ 19 (శుక్రవారం) తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఫస్ట్ రివ్యూ వచ్చింది. సినిమా ఎలా ఉందంటే?

సమంత బ్యాగ్రౌండ్ అదేనబ్బా...
సెకండాఫ్ ట్విస్ట్, యాక్షన్ అదుర్స్!
Samantha MIB First Review: 'నేనెవరో నీకు తెలుసా? అసలు నేనెవరో నీకు తెలుసా?' - ఇదీ 'మా ఇంటి బంగారం'లో సమంత చెప్పిన మొదటి మాట. సారీ సారీ... రౌడీ గ్యాంగులో ఒకరికి వేసిన ప్రశ్న. ఆ మాటకు ముందు 'నిన్ను ఏడనో చూసినట్టు ఉన్నాది. నీ పేరేమి? నీది యాఊరి?' అని మరొక ఆర్టిస్ట్ అడుగుతారు. ట్రైలర్ చూస్తే... ఫ్లాష్‌ బ్యాక్‌లో సమంత పాత్రకు భారీ బ్యాగ్రౌండ్ ఉందని చాలా సులభంగా అర్థం అవుతోంది. 'బాషా', 'కలిసుందాం రా' కలిస్తే ఎలా ఉంటుందో, 'మా ఇంటి బంగారం' అలా ఉంటుందని చెప్పారు నందినీ రెడ్డి.

'మా ఇంటి బంగారం' సినిమా చూసిన జనాలు సమంత ఫ్లాష్ బ్యాక్ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. ఆడియన్స్ అందరికీ ఆమె పాత్ర షాక్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు. చీర కట్టుకుని చక్కగా తెలుగింటి కోడలిగా కనిపించిన బంగారం, అత్తారింటిలో అందరి మనసులు గెలుచుకోవడానికి ప్రయత్నించే బంగారం... ఆ పెళ్లికి ముందు ప్రజల కోసం పోరాటం చేసిన ధీర వనిత అని టాక్. సమాజంలో అసమానతలు చూసి విసిగి న్యాయం కోసం పోరు బాట పట్టిన మహిళగా సమంత కనిపిస్తారని తెలిసింది. చీర కట్టుకుని గన్ పట్టుకోవడం వెనుక ట్విస్ట్ కూడా అదేనట. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్, సమంత యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు హైలైట్ అంటున్నారు.

Also ReadTG T20 league - తెలంగాణ t20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ... టీజీ టీ20 మ్యాచ్ టికెట్ రేట్స్ నుంచి షెడ్యూల్స్, ప్రైజ్ మనీ వరకు... ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి

'మా ఇంటి బంగారం' ఫ్లాష్ బ్యాక్‌లో, అలాగే ప్రజెంట్ ఎపిసోడ్‌లో సమంత, గుల్షన్ దేవయ్య మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు కీలకమని తెలిసింది. సినిమాకు, సమంతకు గుల్షన్ దేవయ్య విలన్ అని టాక్. అన్యాయాలపై ఎదురు తిరగాలని గుల్షన్ దేవయ్య దళంలోకి వెళ్లిన సమంత, ఆ దళం నుంచి ఎందుకు వెనక్కి వచ్చింది? పెళ్లి చేసుకుని సాధారణ మహిళ తరహాలో ఎందుకు జీవితాన్ని వెళ్లదీస్తుంది? అత్తారింటి మీదకు వచ్చి మనుషులు ఎవరు? తన గతాన్ని సమంత ఎంత వరకు దాచింది? ఆమెను వెతుక్కుంటూ వచ్చిన గుల్షన్ దేవయ్య ఏం చేశాడు? అనేది సినిమా.

Also ReadDisha Patani Success Story - బీటెక్ సెకండియర్‌లో కాలేజ్ మానేసి సినిమాల్లోకి... 500 నుంచి 5వేల కోట్లకు... దిశా పటాని సక్సెస్ వెనుక ఏం జరిగిందో తెలుసా?

'మా ఇంటి బంగారం' సినిమాకు సమంత నటన, ఆమె క్యారెక్టర్ హైలైట్ అని ఎర్లీ రిపోర్ట్. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ జనాలు మెచ్చే అంశాలు సైతం ఈ సినిమాలో ఉన్నాయని తెలిసింది. రాజ్ నిడిమోరు & కో అందించిన కథతో నందినీ రెడ్డి కమర్షియల్ సినిమా తీశారట. ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా సాగినప్పటికీ... ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ అంతా రేసీగా ముందుకు వెళుతుందని, వరుస ట్విస్టులు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయని, సినిమా పక్కా హిట్ అని టాక్. సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యిందట. ఈ సినిమాతో సమంత భారీ హిట్ అందుకోవడం గ్యారెంటీ అంటున్నారు.

Also ReadHimanshu Jangra On 370 Biryani Controversy - 370 బిర్యానీ ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్... కథలో కొంతే నిజమట - లేటెస్ట్ వీడియోలో హిమాన్షు జంగ్రా

Frequently Asked Questions

'మా ఇంటి బంగారం' సినిమాలో ప్రధాన పాత్రలో ఎవరు నటించారు? దర్శకురాలు ఎవరు?

సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించారు. నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

'మా ఇంటి బంగారం' సినిమా కథ దేని గురించి ఉంటుంది?

సమంత పాత్రకు ఒక బలమైన నేపథ్యం ఉంది. సమాజంలోని అసమానతలపై పోరాడిన ఆమె, తర్వాత సాధారణ మహిళగా జీవిస్తుంటుంది. ఆమె గతం, వర్తమానం చుట్టూ కథ అల్లుకుంది.

'మా ఇంటి బంగారం' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? ఏయే భాషల్లో?

ఈ సినిమా జూన్ 19 (శుక్రవారం) నాడు విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది.

ఈ సినిమాలో ప్రధాన హైలైట్స్ ఏమిటి?

సమంత నటన, యాక్షన్ సీక్వెన్సులు, ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రధాన హైలైట్స్. సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Crime Thriller Movies OTT : ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
Crime Thrillers OTT : ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget