News
News
వీడియోలు ఆటలు
X

Gopichand-Teja Interview: ప్రోమో దుమ్మురేపినా, అసలు మ్యాటర్ ఔట్, తేజ-గోపీచంద్ ఇంటర్వ్యూలో వాటికి సమాధానాలు ఏవి?

గోపీచంద్, తేజ ఇంటర్వ్యూ ప్రోమో సృష్టించిన సంచనలం అంతా ఇంతా కాదు. విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్ నుంచి ఎత్తేశారు. తేజ ప్రశ్నలకు గోపీచంద్ నీళ్లు నమిలారు. తాజాగా ఫుల్ ఇంటర్వ్యూ విడుదలైంది.

FOLLOW US: 
Share:

గోపీచంద్ హీరోగా, డింపుల్  హయతి హీరోయిన్ గా నటించిన  'రామబాణం' చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.  మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యం చిత్ర బృందం ప్రమోషన్ జోరుగా కొనసాగిస్తుంది. మీడియా ఇంటరాక్షన్‌లు, టీవీ ఇంటర్వ్యూల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే దర్శకుడు తేజతో హీరో గోపీచంద్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే ఇంటర్వ్యూ షూట్ చేశారు. రీసెంట్ గా  ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అయితే, కొద్ది గంటల తర్వాత ఆ ప్రోమో యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు. వాస్తవానికి ఈ ఇంటర్వ్యూలో తేజ అడిగిన ప్రశ్నలు గోపీచంద్ కు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. ‘జయం’ లాంటి హిట్ ఇచ్చిన తనతో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చి ఎందుకు ఫోన్ ఎత్తలేదు? అని అడిగారు. అలాగే, గోపీచంద్ తండ్రి మీద ఉన్న గౌరవంతోనే ‘జయం’ సినిమాలో తనకు అవకాశం ఇచ్చినని చెప్పడం లాంటి ప్రశ్నలు కాస్త ఇబ్బంది పెట్టాయి. బాలయ్యతో ‘రామ బాణం’ టైటిల్ అనౌన్స్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.  ‘నువ్వు ఏం పీకావ్‘ లాంటి కఠినమైన మాటలు కూడా ఉన్నాయి.‘రామబాణం’ మూవీ ప్రమోషన్ కోసం రూపొందించిన ఈ ఇంటర్వ్యూ ప్రోమో చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. అందులో తేజ అడిగే ముక్కుసూటి ప్రశ్నలకు గోపీచంద్ సమాధానం చెప్పలేకపోయారు. ఒక్కో ప్రశ్న బుల్లెట్ లా దూసుకొస్తుంటే గోపీచంద్ కు నోట మాట రాలేదు.  ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. 

ఫుల్ ఇంటర్వ్యూలో అసలు కంటెంట్ ఎక్కడ?

తాజాగా వీరి ఫుల్ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ప్రోమోలో చూపించిన 90 శాతం కంటెంట్ ఈ ఇంటర్వ్యూలో కట్ అయ్యింది. గంటకు పైగా ఇంటర్వ్యూ ఉంటుందని అందరూ భావించినా, కేవలం 38 నిమిషాలకు పరిమితం చేశారు. అంతేకాదు, ఇంటర్వ్యూలో పరుష పదాలు, గోపీచంద్ ను ఇబ్బంది పెట్టే మాటలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ‘నువ్వు ఏం పీకావ్?’ లాంటి మాటలకు కంప్లీట్ గా కత్తెర వేశారు.  మొత్తంగా ప్రోమో దుమ్మురేపినా,  పూర్తి ఇంటర్వ్యూలో అసలు కంటెంట్ మిస్ అయ్యింది.   

Also Read : గుడి ఓకే, అందులో సమంత ఎక్కడ? - ట్రోల్స్ చూస్తే నవ్వు ఆగదు!

తేజ ఇంటర్వ్యూ ప్రోమో ఎందుకు డిలీట్ చేశారంటే?

అటు తేజ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో హీరో గోపీచంద్ ఇప్పటికే వెల్లడించారు. ఇంటర్వ్యూకు.. ప్రోమోకు సంబంధం లేకపోవడం వల్లే యూట్యూబ్ నుంచి తొలగించినట్లు తెలిపారు. “ఇంటర్వ్యూలోని అసలు సారాంశాన్ని పట్టించుకోకుండా వీడియో ఎడిటర్ ప్రోమోను చాలా వివాదాస్పదంగా కట్ చేశాడు. అసలు ఇంటర్వ్యూ కంటే ప్రోమో చాలా భిన్నంగా ఉంది. అందుకే ఆ ప్రోమోను తొలగించారు” అని గోపీచంద్ తెలిపారు. మొత్తంగా తేజతో ఇంటర్వ్యూ చేయించి పొందిన లాంభం కంటే కలిగిన నష్టమే ఎక్కువని గోపీచంద్ టీమ్ భావిస్తుందట.

Read Also: సిస్టర్ సెంటిమెంట్ 'బిచ్చగాడు 2'లో కోర్టు కేసు ఏమిటి? - ట్రైలర్ చూశారా?

శ్రీవాస్ దర్శకత్వం వహించిన ‘రామబాణం’ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు.

Published at : 29 Apr 2023 02:06 PM (IST) Tags: Hero Gopichand Dimple Hayathi Sriwass Director Teja Rama Banam Movie Teja interview promo

సంబంధిత కథనాలు

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?