Gopichand 33: భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!
Gopichand Sankalp Reddy Movie: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఓ భారీ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం భారీ యాక్షన్ సీన్ తీస్తున్నారు.

మాచో స్టార్ గోపీచంద్ (Gopichand) అంటే యాక్షన్ సీన్లకు పెట్టింది పేరు. ప్రతి సినిమాలో, ప్రతి యాక్షన్ సీక్వెన్సులో బెస్ట్ ఇస్తారు. ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఈ హీరోతో 'ఘాజీ', 'అంతరిక్షం 9000 కెఎంపీహెచ్' వంటి సినిమాలు తీసిన విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ 33వ చిత్రమది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో భారీ ఫైట్!
గోపీచంద్ - సంకల్ప్ రెడ్డి సినిమా నాలుగు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు 55 రోజులు షూట్ చేశారు. ప్రస్తుతం హీరో గోపిచంద్ సహా ఇతర ప్రధాన తారాగణంపై కీలకమైన ఫైట్ తీస్తున్నారు. వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు. ఇది సినిమాకు మెయిన్ హైలైట్ అవుతుందని, ఆడియన్స్ అందరికీ సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
Also Read: నిర్మాతగా సుకుమార్ భార్య తబిత... పదేళ్ళ క్రితం వచ్చిన బోల్డ్ సినిమాకు సీక్వెల్!
గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ విడుదల చేశారు. ఆ రెండిటికీ అద్భుతమైన స్పందన లభించింది. అందులో ఒక యోధుడిలా హీరో గోపీచంద్ కనిపించారు. ఇప్పటి వరకు దేశభక్తి నేపథ్యంలో కథలు తీసుకుని సంకల్ప్ రెడ్డి సినిమాలు చేశారు. మరి ఈసారి ఎటువంటి కథతో సినిమా చేయబోతున్నారో? వెయిట్ అండ్ సి. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, మ్యూజిక్: అనుదీప్ దేవ్.
Also Read: కింగ్‌డమ్ ఫ్లాప్ కాదు... బిజినెస్ లెక్కల బయటకు తీసిన నాగవంశీ





















