Kingdom Result: కింగ్డమ్ ఫ్లాప్ కాదు... బిజినెస్ లెక్కల బయటకు తీసిన నాగవంశీ
Naga Vamsi On Kingdom: 'కింగ్డమ్' ఫ్లాప్ కాదంటున్నారు నిర్మాత నాగవంశీ. ఆయన బిజినెస్ లెక్కలు కూడా తీస్తున్నారు. విజయ్ దేవరకొండ లాస్ట్ సినిమాలతో కలెక్షన్స్ కంపేర్ చేస్తున్నారు.

'కింగ్డమ్' విడుదలకు ముందు సినిమాపై ఉన్న అంచనాలు వేరు. ఆ మూవీ రిలీజ్ తర్వాత వచ్చిన రిజల్ట్ వేరు. సాధారణ ప్రేక్షకులతో పాటు విజయ్ దేవరకొండ అభిమానులను సైతం డిజప్పాయింట్ చేసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కాదని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అంటున్నారు.
బిజినెస్ లెక్కలు తీసిన నాగ వంశీ!
'కింగ్డమ్' ఫ్లాప్ కాదని చెప్పడానికి బిజినెస్ లెక్కలు తీశారు నాగవంశీ. ఓవర్సీస్ మార్కెట్టులో వన్ మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ ప్రీమియర్స్ ద్వారా కలెక్ట్ చేసిన సినిమా 'కింగ్డమ్' అని ఆయన అన్నారు. విదేశాలలో ఆ సినిమా మొత్తం మీద 1.8 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిందని తెలిపారు. ఒక్క నైజాం ఏరియాలో 11 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా కింగ్డమ్ అని వివరించారు నాగ వంశీ.
'కింగ్డమ్' కంటే ముందు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన 'ఖుషి', 'ఫ్యామిలీ స్టార్' కలెక్షన్స్ బయటకు తీశారు నాగవంశీ. ఆ రెండు సినిమాలతోనూ 'కింగ్డమ్' రిజల్ట్ కంపేర్ చేశారు. విజయ్ దేవరకొండ, 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ కాంబినేషన్ వల్ల సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయని, అయితే ఆ అంచనాలను సినిమా అందుకోలేదని నాగవంశీ తెలిపారు. అలాగని సినిమా ఫ్లాప్ కాదని, ఎబౌవ్ యావరేజ్ అని ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని ఏరియాలలో 70 శాతం, మరికొన్ని ఏరియాలలో 80, 90% రికవరీ చేసిందని జీఎస్టీ ఎడ్జస్ట్ చేసిన తర్వాత చాలా మంది బయ్యర్లు సేఫ్ అయ్యారని ఆయన తెలిపారు.
Also Read: మీ టైపు ఎవరు? అందరికీ తెలుసు... రౌడీయేగా - కన్ఫర్మ్ చేసిన రష్మిక
'కింగ్డమ్' సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. అయితే అది పట్టాలు ఎక్కుతుందో లేదో చూడాలి. నాగ వంశీ ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ సినిమా 'మాస్ జాతర' అక్టోబర్ 31న విడుదల కానుంది. దీని తరువాత విశ్వక్ సేన్ 'ఫంకీ', అల్లరి నరేష్ 'ఆల్కహాల్', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' సినిమాలు ఆయన నిర్మాణ సంస్థ నుంచి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Also Read: రష్మిక vs దీపిక... బాలీవుడ్ బ్యూటీకి నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్





















