News
News
X

GoodBye Movie Poster : డీ గ్లామర్ లుక్‌లో రష్మిక - అమితాబ్ బచ్చన్ డాడీతో కలిసి

అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'గుడ్ బై' సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు. అలాగే, సినిమా విడుదల తేదీ కూడా వెల్లడించారు.

FOLLOW US: 

రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ సినిమా 'గుడ్ బై'. ఇది ఆమెకు బాలీవుడ్‌లో తొలి సినిమా. ఇందులో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ (GoodBye First Look Poster) విడుదల చేశారు.

డీ గ్లామర్ లుక్‌లో రష్మిక
'గుడ్ బై' ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... రెగ్యులర్ కమర్షియల్ మూవీ హీరోయిన్ రోల్‌లో కాకుండా, రష్మిక డిఫరెంట్ క్యారెక్టర్ చేసినట్లు అర్థం అవుతోంది. ఆవిడ డీ గ్లామర్ లుక్‌లో కనిపించారు. మరోవైపు అమితాబ్ బచ్చన్ గాలిపటం ఎగరేస్తూ... కైట్ ఫైట్‌కు దిగినట్లు ఉన్నారు. ఇద్దరి ముఖాల్లో చిరునవ్వు బావుంది.

అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు... 
'గుడ్ బై' ఫస్ట్ లుక్ మాత్రమే కాదు... ఈ రోజు విడుదల తేదీ కూడా వెల్లడించారు. అక్టోబర్ 7న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. విజయ దశమి సందర్భంగా వినోదం అందించడానికి రెడీ అయ్యారు (GoodBye Release Date).
 
చిరు, నాగ్ నుంచి పోటీ
హిందీలో అక్టోబర్ తొలి వారంలో 'గుడ్ బై' కాకుండా 'తేజస్', 'వైట్', 'అభి జావో పియా', 'హిందుత్వ', 'మిస్టర్ అండ్ మిస్సెస్ మహి' వంటి సినిమాలు విడుదలకు ఉన్నాయి. అవన్నీ చిన్న సినిమాలే. అయితే... అమితాబ్, రష్మికకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున నుంచి పోటీ ఎదురు కానుంది.

చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన 'గాడ్ ఫాదర్' అక్టోబర్ 5న విడుదల కానుంది. హిందీలోనూ సినిమాను విడుదల చేస్తున్నారు. అదే రోజున నాగార్జున 'ది ఘోస్ట్' కూడా విడుదలకు రెడీగా ఉంది. 'గుడ్ బై' విడుదలకు రెండు రోజుల ముందు ఈ రెండు సినిమాలు వస్తున్నాయి. అందువల్ల, మూడు సినిమాల మధ్య పోటీ తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రష్మిక ఉన్నారు కనుక దక్షిణాదిలో సైతం 'గుడ్ బై' మీద ఆసక్తి నెలకొంది. అయితే... చిరంజీవి, నాగార్జున సినిమాల ముందు ఆ సినిమాకు తక్కువ ఆదరణ ఉండొచ్చని టాక్. సల్మాన్ ఉన్నారు కనుక హిందీలోనూ 'గుడ్ బై' మీద 'గాడ్ ఫాదర్' ఎఫెక్ట్ ఉంటుంది.

Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం

సిద్ధార్థ్ మల్హోత్రాతో రష్మిక రెండో హిందీ సినిమా
సౌత్ సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన్న స్టార్ హీరోయిన్. తెలుగులో అగ్ర కథానాయకుల సరసన నటించారు. సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ తమిళంలో కార్తీతో 'సుల్తాన్' చేశారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ 'వారసుడు'లో నటిస్తున్నారు. మాతృభాష కన్నడలో సినిమాలు చేశారనుకోండి. ఒక వైపు సౌత్ సినిమాలు చేస్తూనే... మరోవైపు హిందీ సినిమాలు చేస్తున్నారు. 'గుడ్ బై' తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా 'మిషన్ మజ్ను' కూడా ఉంది. ఆ రెండు సినిమాలతో ఆమెకు ఎటువంటి పేరు వస్తుందో చూడాలి.

Also Read : ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ - ఆ రోజు టికెట్ రేట్ 75 రూపాయలే

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

Published at : 03 Sep 2022 12:02 PM (IST) Tags: Rashmika Mandanna Amitabh bachchan GoodBye Movie GoodBye Movie Poster GoodBye Release Date

సంబంధిత కథనాలు

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను నమ్మి మరో ఛాన్స్ ఇస్తాడా?

Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను నమ్మి మరో ఛాన్స్ ఇస్తాడా?

Lakshman K Krishna Interview : కమల్ హాసన్ టైటిల్ అనగానే భయపడ్డా - 'స్వాతిముత్యం' దర్శకుడు లక్ష్మణ్ ఇంటర్వ్యూ

Lakshman K Krishna Interview : కమల్ హాసన్ టైటిల్ అనగానే భయపడ్డా - 'స్వాతిముత్యం' దర్శకుడు లక్ష్మణ్ ఇంటర్వ్యూ

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?