National Cinema Day 2022 : ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ - ఆ రోజు టికెట్ రేట్ 75 రూపాయలే
సినిమా టికెట్ రేట్స్ తగ్గుతున్నాయి. మల్టీప్లెక్స్‌లలో మూడు, రెండు వందలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. కేవలం 75 రూపాయలు ఉంటే చాలు. అయితే, ఆ ఆఫర్ ఒక్క రోజు మాత్రమే.
మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా టికెట్ రేట్స్ తగ్గుతున్నాయ్! సాధారణంగా సిటీలలో ఏ మల్టీప్లెక్స్‌కు వెళ్లినా సరే... రెండు నుంచి మూడు వందల రూపాయల టికెట్ రేటు ఉంటోంది. అటువంటి టికెట్‌ను కేవలం 75 రూపాయలకు మాత్రమే విక్రయించాలని నిర్ణయించారు. ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
నేషనల్ సినిమా డే (National Cinema Day ) సందర్భంగా...
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని థియేటర్ యాజమాన్యాలు సెప్టెంబర్ 3న 'నేషనల్ సినిమా డే'గా నిర్ణయించాయి. సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాయి. అందులో భాగంగా ఈ రోజు (సెప్టెంబర్ 3న) టికెట్ రేటు కేవలం మూడు డాలర్లు మాత్రమే అని పేర్కొన్నాయి. ఆ రేటుకు అమ్మాయి.
అమెరికాలో థియేటర్ సంఘాలు తమ నిర్ణయం ప్రకటించిన తర్వాత 'మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' (Multiplex Association Of India) మన దేశంలో సెప్టెంబర్ 16న 'నేషనల్ సినిమా డే'ను సెలబ్రేట్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఆ రోజు టికెట్ రేటు 75 రూపాయలకు విక్రయించనున్నట్లు తెలిపాయి. ప్రేక్షకులకు ఈ నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించింది.
నేషనల్ సినిమా డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు?
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా కొన్ని రోజులు స్తంభించింది. జనాలు అందరూ ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. ఆ సమయంలో థియేటర్లు కూడా మూసేశారు. ఆ తర్వాత జన జీవనం మళ్ళీ కాస్త గాడిలో పడినప్పటికీ... థియేటర్లు తెరుచుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. మళ్ళీ సెప్టెంబర్ 16న పూర్తి స్థాయిలో దేశమంతా థియేటర్లు తెరుచుకున్నాయి. అందుకని, ఆ రోజు 'నేషనల్ సినిమా డే'గా సెలబ్రేట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నాలుగు వేల థియేటర్లలో రూ. 75 టికెట్ రేట్ అందుబాటులో ఉంటుంది.
Brahmastra ticket price In Hyderabad: సెప్టెంబర్ 9న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 'బ్రహ్మాస్త్ర' విడుదల కానుంది. ఆ రోజు హైదరాబాద్ మల్టీప్లెక్స్‌లలో త్రీడీలో ఆ సినిమా చూడాలంటే 325 రూపాయలు పెట్టి టికెట్ కొనాలి. అదే సెప్టెంబర్ 16న అయితే... 75 రూపాయలు పెడితే చాలు. తెలుగులో రణ్‌బీర్ కపూర్ సినిమాకు అంత టికెట్ రేటు ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమేనని సోషల్ మీడియాలో... నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.
Also Read : అభిమానులకు సారీ చెప్పిన ఎన్టీఆర్
నిజంగా 75 రూపాయలేనా?
మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అయితే 75 రూపాయలకు టికెట్ అమ్మాలని నిర్ణయించాయి. బుక్ మే షో, పేటీయం వంటి యాప్స్ ద్వారా బుక్ చేస్తే... ఎక్స్ట్రా ఛార్జీలు పడే అవకాశం ఉంది. మామూలుగా థియేటర్ దగ్గర టికెట్ కొంటే తక్కువ రేటు ఉంటుంది. ఆన్ లైన్ లో బుక్ చేస్తే ఎక్కువ రేటు ఉంటుంది. ఇదీ అంతే.
కరోనా తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే... ఆగస్టులో విడుదలైన తెలుగు సినిమాలు 'బింబిసార', 'సీతా రామం' ఘన విజయాలు సాధించాయి. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని మరోసారి నిరూపించాయి. నిఖిల్ 'కార్తికేయ 2' సినిమా అయితే ఉత్తరాదిలో కూడా ఘన విజయం సాధించింది.
Also Read : ఫ్లాప్‌లతో కట్టిన స్టార్‌డమ్ కోట - పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరే లెవల్