Goodachari 2: నాకు భయం వేస్తోంది, 'గూఢచారి 2' మూవీపై అడివి శేష్ ట్వీట్
అడవి శేష్ హీరోగా నటించిన 'గూడచారి' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకోగా.. ప్రస్తుతం ఆ సినిమాకి సీక్వెల్ రూపొందుతోంది. తాజాగా ఈ సీక్వెల్ కు సంబంధించి అడివి శేష్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న అడవి శేష్ ఓ వైపు రైటర్ గాను మరోవైపు హీరోగానూ మంచి సక్సెస్ తో ముందుకు వెళ్తున్నారు. గత ఏడాది 'మేజర్', 'హిట్2' లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న అడవి శేష్ ప్రస్తుతం 'గూడచారి' సినిమాకి సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. 'G2' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్స్, ప్రీ లుక్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు అడవి శేష్.' G2' (గూఢచారి సీక్వెల్) ని గేమ్ చేంజింగ్ మూవీగా వ్యాఖ్యానిస్తూ ఆసక్తిని క్రియేట్ చేశాడు.
తాజాగా ట్విట్టర్ లో ఓ నెటిజన్ 'టాలీవుడ్ లో వచ్చిన ది బెస్ట్ స్పై థ్రిల్లర్స్ లో ఇది ఒకటి' అని పేర్కొంటూ గూడచారి గ్లింప్స్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దానిపై స్పందించిన అడవి శేష్, గూడచారి సీక్వెల్ పై అప్డేట్ ఇచ్చారు. " మీ ప్రేమకు ధన్యవాదాలు. గేమ్ చేంజింగ్ మూవీ ని అందించేందుకు దర్శకుడు వినయ్ కుమార్, రచయిత అబ్బూరి రవి గత ఆరు నెలలుగా కష్టపడుతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ భారీ స్థాయిలో ఉండబోతోంది. వినయ్ కుమార్ విజన్ చూస్తుంటే అప్పుడప్పుడు నాకు భయమేస్తుంది. కానీ నేను చెప్పేది మాత్రం ఒక్కటే!.. సినిమా మాత్రం అదిరిపోతుంది" అంటూ తన ట్విట్ లో పేర్కొన్నాడు అడివి శేష్. గూడచారి సినిమాను మించి సీక్వెల్ ఉండబోతుందని స్వయంగా అడవి శేష్ చెప్పడంతో ఆయన చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
'గూడచారి సీక్వెల్ కోసం వెయిటింగ్ అన్నా, 'పార్ట్ 2 పార్ట్ 1 కి మించి ఉండాలి', 'సినిమాటిక్ యూనివర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?' అంటూ అభిమానులు ట్వీట్స్ కూడా పెడుతున్నారు. కాగా గూడచారి సినిమాకి సీక్వెల్ని 'G2' అనే పేరుతో కొన్ని నెలల క్రితమే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు విడుదల చేసిన ప్రీవిజన్ వీడియో కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక గూఢచారి విషయానికొస్తే.. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. అవుట్ అండ్ అవుట్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అడవి శేష్ సరసన శోభిత దూళిపాళ్ల హీరోయిన్గా నటించింది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు.
ఈ సినిమాకి కొనసాగింపుగా ఇప్పుడు గూడచారి సీక్వెల్ 'G2' ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఎడిటర్ గా పనిచేసిన వినయ్ కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఇక గూడచారి కథ మొత్తం ఇండియాలోనే ఉంటుంది. కానీ ఈ సీక్వెల్లో కథ మొత్తం ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉండనుంది. ఫస్ట్ పార్ట్ లో కనిపించిన కొన్ని పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ఈ సీక్వెల్లో కనిపించనున్నాయి. ఇక ఈ సీక్వెల్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాయి.
Thank you for your love ❤️
— Adivi Sesh (@AdiviSesh) July 21, 2023
Been writing with director @vinaykumar7121 & @abburiravi sir for the last six months to give you a game changing film 💥#G2 script is ….a Huge Vision. Massive preparation underway. Director @vinaykumar7121 His vision scares me sometimes BUT…all… https://t.co/SMIzn3T473
Also Read : దసరాకు 'భగవంత్ కేసరి'గా బాలకృష్ణ ఆయుధపూజ - రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial