Gods And Soldiers Title Teaser: లుక్కు మార్చిన రాజ్ తరుణ్... 'గాడ్స్ అండ్ సోల్జర్'తో హిట్టు మీద గురి - టైటిల్ టీజర్ చూశారా?
Raj Tarun New Movie: ట్యాలెంటెడ్ యంగ్ హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. అయితే ఆయన ప్రతిభకు తగ్గ విజయాలు ఇటీవల రాలేదు. 'గాడ్స్ అండ్ సోల్జర్స్'తో మళ్ళీ హిట్టు మీద గురి పెట్టారు.

యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) లుక్కు మార్చారు. 'గాడ్స్ అండ్ సోల్జర్స్' - తమిళ్, తెలుగు బైలింగ్వల్ కోసం ఆయన కొత్తగా మారారు. వినాయక చవితి సందర్భంగా టైటిల్ టీజర్ విడుదలైంది. అందులో డైలాగ్, రాజ్ తరుణ్ వాయిస్ వింటే ఆయన హిట్టు కొట్టడం ఖాయంగా కనబడుతోంది.
'గోలీసోడా' ఫ్రాంఛైజీలో 'గాడ్స్ అండ్ సోల్జర్స్'
Gods And Soldiers Title Teaser Unveiled: తమిళ సినిమాలు 'గోలీసోడా', 'గోలీసోడా 2' సినిమాలకు తమిళనాడులో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. విమర్శకులతో ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్న సినిమాలు అవి. ఇప్పుడు ఆ ఫ్రాంఛైజీలో 'గాడ్స్ అండ్ సోల్జర్స్' రూపొందుతోంది.
'గోలీసోడా' ఫ్రాంఛైజీలో ఆ సినిమాల దర్శకుడు, ప్రముఖ కెమెరామెన్ విజయ్ మిల్టన్ (Vijay Milton) దర్శకత్వంలో 'గోలీసోడా'లోని స్పిరిట్, ఆ లెగసీని కంటిన్యూ చేస్తూరూపొందుతున్న చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో రాజ్ తరుణ్ తమిళ తెరకు పరిచయం అవుతున్నారు.
Also Read: సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు... వచ్చేది ఎవరు? వెనక్కి వెళ్లేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు?
వినాయక చవితికి టైటిల్ టీజర్ విడుదల చేశారు. ప్రముఖ తమిళ కథానాయకులు విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని, ఆర్యలతో పాటు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తమ ట్విట్టర్ అకౌంట్ వేదికగా టైటిల్ రివీల్ చేశారు. 'ఎవడైనా నీ మీద రాయి విసిరితే... నువ్వు వాడి మీద పువ్వు విసురు. కానీ మళ్ళీ వాడే రాయి విసిరితే... ఆడమ్మా! అదే పూల కుండీతో వాడి తల పగలగొట్టు, చస్తాడు' అని రాజ్ తరుణ్ డైలాగ్ చెప్పారు. దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ... ''గోలీసోడా'లో రఫ్ నెస్ ఈ న్యూ చాప్టర్‌లో ఆడియన్స్ చూస్తారు. టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తెలుగు, తమిళ భాషల ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందీ సినిమా'' అని చెప్పారు.
Gods And Soldiers Movie Cast: రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'గాడ్స్ అండ్ సోల్జర్స్' సినిమాలో సునీల్, వేదన్, భారత్, అమ్ము అభిరామి, కిషోర్, జెఫ్రీరి, భరత్ శ్రీని, పాల డబ్బా, విజిత తదితరులు ఇతర ప్రధాన తారాగణం. రఫ్ నోట్ ప్రొడక్షన్స్ సంస్థలో రూపొందుతున్న ఈ సినిమాకు సంగీతం: శ్యామ్ సీఎస్, కూర్పు: పాపన్ జేఆర్, యాక్షన్: కలై కింగ్‌సన్ - విక్రమ్ మౌర, రచన - ఛాయాగ్రహణం - దర్శకత్వం: విజయ్ మిల్టన్.





















