Independence Day Special: మార్పు మనతోనే రావాలి.. సుకుమార్, అల్లు అర్జున్ వీడియో షేర్ చేసిన గీతా ఆర్ట్స్
Allu Arjun: 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్-సుకుమార్‌ల స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. ఇందులో దేశ పౌరల బాధ్యతను గుర్తు చేస్తూ ఓ మంచి మెసేజ్ ఇచ్చారు.
Allu Arjun-Sukumar I AM THAT CHANGE Video: దేశమంత 78వ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటుంది. పాఠశాలు, ఆఫీసులు ఎక్కడ చూసిన త్రివర్ణ పతాకాలతో కనిపిస్తుంది. ఇవాళ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం. అన్ని సోషల్ మీడియాల వేదికగా వివిధ మెసేజ్‌లతో నెటిజన్లు దేశభక్తిని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ షాట్ ఫిలింతో స్వంతత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ మెసేజ్ ఇచ్చారు.
ఈ మేరకు 'ఐయామ్ దట్ ఛేంజ్(IAM THAT CHANGE)'అంటూ ఈ వీడియో షేర్ చేసింది. ఇందులో ట్రాఫిక్ పోలీసు, విద్యార్థి, ఓ చిన్నపిల్లవాడు తమ తమ బాధ్యతలను గుర్తు చేస్తూ ప్రతిఒక్క దేశ పౌరుడికి మెసేజ్ ఇచ్చినట్టుగా చూపించారు. ఇలా మూడు పాత్రలను చూపించారు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ కార్యక్రమానికి వెళుతూ ఉండగా మీడియా ఆయనను వెంటపడుతుంది. ఆ బయట చెకింగ్ దగ్గర స్కానింగ్ లేకుండ నేరుగా లోపలికి వెళుతూ ఉండగా.. ఆ తర్వాత ఆగిపోయి తన బాధ్యతను గుర్తు చేసుకని తిరిగి వెనక్కి వెళ్లి సెక్యూరిటీతో చెకింగ్ చేయించుకుంటాడు దేశపౌరుడిగా తన బాధ్యతను గుర్తు చేశాడు.
View this post on Instagram
ఆ తర్వాత ఎక్సామ్ రాసే విద్యార్థిని ఎక్సామ్‌లో తన స్నేహితురాలు ఇచ్చిన కాపీ పేపర్‌ని తిరస్కరించి తన బాధ్యత నిర్వర్తించింది. అలాగే ట్రాఫిక్ పోలీసు ఆఫీసర్ లంచ్ ఇస్తున్న కారు వ్యక్తికి చలాన్ విధించి తన విధిని గుర్తుచేశాడు. ముందుకు వెళ్లిన చిన్న పిల్లాడు తిరి వెనక్కి వచ్చిన రోడ్డపై ఉన్న చెత్తను చెత్తబుట్టలో పడేసి ఓ పౌరుడిగా బాధ్యతగా పాటించాడు. వీరిలాగే దేశ పౌరులకు తమ తమ బాధ్యతలను గుర్తు చేసేలా ఉంది ఈ వీడియో. దీనికి "మన విధులు దేశభక్తికి ఒక రూపం. మార్పు మనలోనే మొదలవుతుంది. మీరు చూడాలనుకుంటున్న మార్పుకు నాయకత్వం వహించండి.'I AM THAT CHANGE' గతంలో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ షాట్ వీడియోను గీతా ఆర్ట్స్ వారు షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో చివరిలో అల్లు అర్జున్ చేత చెప్పించిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
"మన బాధ్యత మనం నిర్వర్తించడం కూడా దేశభక్తి. మార్పు మనతోనే మొదలవ్వాలి. I AM THAT CHANGE" అంటూ ఈ షాట్ ఫిలింతో మంచి మెసేజ్ అందించే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ అండ్ డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం ఈ వీడియోపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. మంచి మెసేజ్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీతో బిజీగా ఉన్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ఫ 2 వాయిదా పడిన సంగతి తెలిసిందే. షూటింగ్ ఆలస్యంగా కారణంగా మూవీని వాయిదా వేసి డిసెంబర 6న రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటన ఇచ్చింది. ఇందులో అల్లు అర్జున్ సరసన్ రష్మిక మందన్నా నటిస్తుంది.