Extra Jabardasth Latest Promo: ఇక 'ఎక్స్ట్రా'ల్లేవ్... జస్ట్ 'జబర్దస్త్'... స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ
Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్, 'జబర్దస్త్' కమెడియన్ కమ్ టీం లీడర్ రాకింగ్ రాకేశ్ స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక నుంచి 'ఎక్స్ట్రా' ఉండదని స్టేజిపై ఎమోషనల్ అయ్యారు. అసలు విషయంలోకి వెళితే...
![Extra Jabardasth Latest Promo: ఇక 'ఎక్స్ట్రా'ల్లేవ్... జస్ట్ 'జబర్దస్త్'... స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ Extra Jabardasth Latest Promo Anchor Rashmi Gautam gets emotional as show name changes Extra Jabardasth Latest Promo: ఇక 'ఎక్స్ట్రా'ల్లేవ్... జస్ట్ 'జబర్దస్త్'... స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/c5f81f1eefe15db604af93a3a36242101716879224591313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నో మోర్ ఎక్స్ట్రాలు... జస్ట్ 'జబర్దస్త్' మాత్రమే... లేటెస్ట్ ప్రోమోలో ఆ ముక్క చాలా క్లారిటీగా చెప్పారు. దాంతో స్టేజి మీద యాంకర్ రష్మీ గౌతమ్, టీమ్ లీడర్లలో ఒకరు అయిన 'రాకింగ్' రాకేష్ ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక నుంచి 'ఎక్స్ట్రా' ఉండబోదని తెలిసి స్కిట్ ద్వారా ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు 'ఆటో' రామ్ ప్రసాద్. పూర్తి వివరాల్లోకి వెళితే...
500 మైలురాయికి ముందే 'ఎక్స్ట్రా'కు ఎండ్ కార్డు
తెలుగు టీవీ హిస్టరీలో 'జబర్దస్త్' ఒక సెన్సేషన్. అప్పటి వరకు సీరియళ్లు, గేమ్ షోస్ వంటివి చూసిన ప్రజల ముందుకు సరికొత్త వినోదాన్ని తెచ్చింది మల్లెమాల టీవీ. ఛోటా మోటా ఆర్టిస్టులను తీసుకొచ్చి స్టేజి మీద కామెడీ చేయించింది. అతి తక్కువ కాలంలో 'జబర్దస్త్' పాపులర్ కావడంతో 'ఎక్స్ట్రా జబర్దస్త్' స్టార్ట్ చేసింది ఈటీవీ & మల్లెమాల టీం.
ఇప్పుడు 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు ఎండ్ కార్డు వేస్తున్నారు. మే 24న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ 490వ ఎపిసోడ్. వచ్చే వారం... అంటే మే 31, శుక్రవారం టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ 491వది. 500 మైలురాయి చేరుకోవడానికి ముందు ఆ పేరుతో షోను ఎండ్ చేశారు. 'ఎక్స్ట్రా' లేకుండా షో కంటిన్యూ అవుతుందని తెలిపారు.
'జబర్దస్త్' యాంకర్ (Jabardasth Anchor)గా అనసూయ, 'ఎక్స్ట్రా జబర్దస్త్' యాంకర్ (Extra Jabardasth Anchor)గా రష్మీ గౌతమ్ పాపులర్ అయ్యారు. ప్రతి గురు, శుక్ర వారాల్లో మెజారిటీ తెలుగు ప్రజలు టీవీల ముందు కూర్చునేలా చేసిన ఘనత, నవ్వించిన చరిత్ర 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్' షోలది. ఇప్పుడు ఆ 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో 'ఎక్స్ట్రా' అనే పదం ఇకపై ఉండబోదు. ఈ విషయాన్ని రష్మీ గౌతమ్ చేత స్వయంగా చెప్పించారు.
ఇక నుంచి రెండు షోలు కలిపి ఒక్కటే!
''మాకు రెండు కంపెనీలు ఉన్నాయి అండీ! ఇప్పుడు ఆ రెండు కలిపి ఒక్కటే చేస్తానని అంటున్నారు. నేను ఏమో ఫస్ట్ నుంచి ఈ కంపెనీలో ఉన్నాను. ఇప్పుడు సడన్ గా ఆ కంపెనీ వెళ్లిపోతుంటే కొంచెం బాధగా ఉందండీ, అంతే!'' అని 'ఆటో' రామ్ ప్రసాద్ స్కిట్ లో డైలాగ్ చెప్పాడు. 'ఎందులోకి వెళ్లినా సంపాదిస్తాం కదండీ' అని టీం మెంబర్ అడగ్గా.... ''సంపాదిస్తాం అండీ. ఇందులో ఉంటే సంతోషం ఉంటుంది. మన పేరు ముందు ఇంటి పేరు ఉంటే ఎంత అందంగా ఉంటుంది. అది మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతోంది సార్'' అని రామ్ ప్రసాద్ బదులు ఇచ్చాడు.
Also Read: 'జబర్దస్త్'లో స్మాల్ ఛేంజ్ - జడ్జ్ సీటు నుంచి ఇంద్రజ అవుట్
'ఎక్స్ట్రా' మిస్ అయినా కామెడీకి లోటు ఉండదు!
'ఎక్స్ట్రా జబర్దస్త్' నుంచి 'ఎక్స్ట్రా' అనే పదం మిస్ అయినప్పటికీ ప్రేక్షకులకు ఇచ్చే కామెడీ విషయంలో ఎటువంటి లోటు ఉండదనే భరోసా ఇచ్చారు. ''నెక్స్ట్ వీక్ నుంచి ఎక్స్ట్రా పదం అనేది మిస్ అవుతుంది. ప్రతి శుక్ర, శనివారాల్లో సరికొత్త ప్యాకేజీలో మీ అందరి కోసం సేమ్ జబర్దస్త్ ఎక్స్ట్రా జోష్ అండ్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ తో'' అని రష్మీ గౌతమ్ చెప్పారు.
Also Read: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)