అన్వేషించండి

Emergency Trailer: ఇందిరా పాత్రలో జీవించిన కంగనా - ఆ రోజులను కళ్లకు కట్టేలా ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ మూవీలో ఇందిరా పాత్రలో కంగనా అద్భుత నటన కనబర్చింది.

Emergency Trailer Out: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ కథాంశంతో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రంలో కంగనా రనౌత్ దివంగత మాజీ ప్రధాని ఇందిరా పాత్రలో నటించారు. ఈ చిత్రం కంగనా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. సెప్టెంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ఇవాళ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో భారత్, పాక్ మధ్య యుద్ధం, ఆ సమయంలో ఇందరా గాంధీ తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల కారణంగా ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు, ఎమర్జెన్సీ సమయంలో దేశం ఎదుర్కొన్న దారుణాలను చూపించారు.

ఆకట్టుకుంటున్న ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్

‘ఎమర్జెన్సీ’ ట్రైలర్ లో కీలక విషయానులు ప్రస్తావించారు. తండ్రి జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత ఇందిర రాజకీయాల్లోకి అడుగు పెడుతుంది. ఆమె ప్రధాని పీఠాన్ని దక్కించుకోవడం, భారత్ పాకిస్థాన్ యుద్ధం, సిమ్లా ఒప్పందం, ప్రతిపక్ష నేతలతో ఆమె వ్యవహరించిన తీరు,  దేశంలో  ఎమర్జెన్సీ విధించడాన్ని ఇందులో ప్రస్తావించారు. “ఈ దేశం నుంచి తనకు ద్వేషం తప్ప మిగిలింది ఏమీ లేదంటూ” ఇందిరా గాంధీ చెప్పడం.. “ఇందిర అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర” అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, ఇందిర జీవితం షేక్ స్పియరియన్ విషాదం అని ఎందుకు అంటారో ఈ మూవీలో చూపించే ప్రయత్నం చేశారు.

ఒక్క రోజు ముందుగానే ట్రైలర్ విడుదల

తాజాగా ‘ఎమర్జెన్సీ’ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్, ఆగష్టు 15న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే, చెప్పిన టైం కంటే ఒకరోజు ముందుగానే ట్రైలర్ ను విడుదల చేశారు. నిజానికి ఈ సినిమా గ‌త ఏడాది నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, పోస్టు ప్రొడక్షన్ పనులలో ఆలస్యం కారణంగా చిత్ర విడుదల జూన్ 14కు వాయిదా పడింది. అదే సమయంలో కంగనా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. హిమాచల్ ప్రదేశం లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సినిమా మరోసారి వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కాబోతోంది.

ఇక ఈ చిత్రంలో  జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌ నటిస్తున్నారు.  మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయీ క్యారెక్టర్ ను శ్రేయస్ తల్పడే పోషిస్తున్నారు. మహిమా చౌదరి, మిలింద్‌ సోమన్‌, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీ స్టూడియోస్‌, మణికర్ణిక ఫిలిమ్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Read Also: పాలిటిక్స్ తోనే సరిపోతుంది, వాటికి అస్సలు టైమ్ దొరకట్లేదన్న కంగనా రౌనత్

Read Also: మాటల్లేవ్.. అంతా కోడి గోలే - ‘కల్కీ 2898 ఏడీ’ కైరా లేటెస్ట్ మూవీ ట్రైలర్ చూశారా? ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Embed widget