Eesha Movie Glimpse : హెబ్బా పటేల్ హారర్ థ్రిల్లర్ 'ఈషా' - గ్లింప్స్‌తోనే ఫుల్లుగా భయపెట్టేశారు... వాళ్లు ఈ మూవీ చూడకుంటేనే బెటర్
Eesha Glimplse : హీరోయిన్ హెబ్బా పటేల్ మరో హారర్ థ్రిల్లర్‌తో థ్రిల్ చేయబోతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ 'ఈషా' గ్లింప్స్ వచ్చేసింది.

Hebah Patel Horror Thriller Eesha Glimpse Out Now : టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్, త్రిగుణ్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'ఈషా'. ఇప్పటివరకూ చూడని ఓ డిఫరెంట్ థ్రిల్లింగ్ అంశాలతో మూవీ ఉండబోతోందని తాజా గ్లింప్స్ బట్టే అర్థమవుతోంది. ఈ మూవీకి శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించారు.
అసలు ఆత్మలు ఉన్నాయా?
ఫస్ట్ ఫస్టే శ్మశానంలో దెయ్యం ఎంట్రీ భయాన్ని రెట్టింపు చేసేలా ఉంది. నలుగురు పిల్లలు స్కూలుకు వెళ్తుండగా... అందులో ఓ చిన్నారి తన పక్కింట్లో ఓ అమ్మాయి ఉరి వేసుకున్న విషయం మిగిలిన పిల్లలకు చెబుతుంది. ఇది విన్న ఓ అబ్బాయి.. 'అసలు నువ్వు దాని గురించే ఆలోచించకు. ఆత్మలు గీత్మలు అంతా ట్రాష్' అంటూ బెబుతాడు. అప్పుడే చేతబడి బొమ్మలు, క్షుద్రపూజల సీన్ భయం గొల్పేలా ఉంటుంది. ఓ ఇంట్లో తమ చిన్నారితో దిగిన దంపతులకు ఎదురైన అనుభవాలే 'ఈషా' మూవీ అని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది.
Also Read : 'అఖండ 2' టికెట్ బుకింగ్స్ షురూ - రేట్స్ పెంచిన తెలంగాణ ప్రభుత్వం... ఏపీతో పోలిస్తే...
మూవీలో త్రిగుణ్, హెబ్బా పటేల్‌తో పాటు అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని బన్నీ వాస్ వర్క్స్ సమర్పణలో వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ నెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వాళ్లు ఈ మూవీ చూడొద్దు
గ్లింప్స్‌తోనే భయపెట్టేయగా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హార్ట్ వీక్‌గా ఉన్న వాళ్లు ఈ సినిమా చూడకపోవడమే మంచిదని అన్నారు. 'దెయ్యాలు, ఆత్మలు అంటే నేను భయపడను. ఎక్కడైనా హంటింగ్ ప్లేస్ ఉంటే ప్రత్యేకంగా వెళ్లి చూసొస్తాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను నాలుగు సార్లు భయపడ్డాను. దెయ్యం మేకప్ ఎలా వేస్తారో, షూటింగ్ ఎలా చేస్తారో.. అన్నీ తెలిసిన నేనే ఇలా భయపెడ్డాను.
ఎడిటింగ్ మీద, సౌండింగ్ మీద ఎంతో గ్రిప్ ఉంటేనే ఇలాంటి మూవీ వస్తుంది. డైరెక్టర్ శ్రీనివాస్ చాలా అద్భుతంగా రూపొందించారు. క్లైమాక్స్ 15 నిమిషాలు అయితే అద్భుతంగా ఉంటుంది. డిసెంబర్ 12న థియేటర్‌కు వచ్చి భయపడి ఎంజాయ్ చేయండి. కొంచెం హార్ట్ వీక్ ఉన్న వాళ్లు మాత్రం దయచేసి ఈ సినిమాను చూడకండి. థియేటర్స్‌కి వచ్చిన తర్వాత ఏమైనా అయితే మమ్మల్ని అడగొద్దు.' అంటూ చెప్పారు.





















