Rag Mayur - Vimal Krishna Movie: 'డిజే టిల్లు' దర్శకుడితో రాగ్ మయూర్ కొత్త సినిమా... పూజతో పనులు షురూ
DJ Tillu Director Vimal Krishna New Movie: 'డీజే టిల్లు' దర్శకుడు విమల్ కృష్ణ కొత్త సినిమా మొదలు పెట్టారు. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఆ సినిమా పూజతో మొదలైంది.

రచయితగా, దర్శకుడిగా విమల్ కృష్ణ (Vimal Krishna)కు మంచి పేరుంది. 'డీజే టిల్లు' సినిమా (DJ Tillu Movie Director)తో విమల్ కృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. డీజే టిల్లు పాత్ర తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఇంటికి రీచ్ అయింది. స్మాల్ గ్యాప్ తరువాత ఇప్పుడు విమల్ కృష్ణ మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్, నవీన్ చంద్రలు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
రాగ్ మయూర్ హీరోగా విమల్ కృష్ణ సినిమా
Rag Mayur teams up with direcror Vimal Krishna: విమల్ కృష్ణ క్రియేట్ చేసిన ఓ డిఫరెంట్ పాత్రను రాగ్ మయూర్ పోషిస్తున్నాడు. రాగ్ మయూర్ అసలే ఇప్పుడు మంచి ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. అతని కామెడీ టైమింగ్‌కు అంతా ఫిదా అవుతుంటారు. అలాంటి రాగ్ మయూర్‌తో విమల్ ఓ క్రేజీ పాత్రను చేయిస్తున్నట్టుగా సమాచారం. ఇక ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి. మేఘ చిలక మరియు స్నేహ జగ్తియాని క్లాప్ కొట్టారు. సునీల్ నామా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, విమల్ కృష్ణ స్క్రిప్ట్ అందజేశారు.
Also Read: నేను బ్రతికే ఉన్నాను... చావలేదు - ఫేక్ న్యూస్‌పై కాజల్ అగర్వాల్ క్లారిటీ

విమల్ కృష్ణ, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల నటించిన సరదా వీడియోతో ఇటీవల మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్ అవ్వడం, ప్రాజెక్ట్ మీద బజ్ ఏర్పడటం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, అనన్నయ, చరిత్ర్ వంటి వారు నటించనున్నారు. సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చనున్నారు. జె.కె. మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఎడిటింగ్‌ను అభినవ్ కునపరెడ్డి నిర్వహిస్తున్నారు.
ప్రేక్షకులను ఉత్కంఠభరితంగా మార్చే ఒక క్రేజీ పాత్రను అందించేందుకు విమల్ కృష్ణ సిద్ధంగా ఉన్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ చిలక ప్రొడక్షన్స్‌లో నాలుగో ప్రాజెక్ట్‌గా రాబోతోంది. త్వరలోనే ఇతర వివరాల్ని చిత్రయూనిట్ ప్రకటించనుంది.
రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, అన్నయ్య, చరిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు రచన & దర్శకత్వం: విమల్ కృష్ణ, సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాతలు: రాజీవ్ చిలక - రాజేష్ జగ్తియాని - హీరాచంద్ దండ్ - నవీన్ చంద్ర, సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి, నిర్మాణ సంస్థ: చిలకా ప్రొడక్షన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ, క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రావణ్ కుప్పిలి.





















