అన్వేషించండి

Mr. Bachchan: యాక్షన్ మోడ్ లో రవితేజ - 'మిస్టర్ బచ్చన్' నుంచి క్రేజీ అప్డేట్ అందించిన హరీష్ శంకర్

Mr. Bachchan Update: హీరో రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. దర్శకుడు తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ అందించారు.

Mr. Bachchan Shooting Update: మాస్ మహారాజా రవితేజ కెరీర్ ప్రారంభం నుంచీ హిట్టు ఫ్లాప్ లను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. గతేడాది 'వాల్తేరు వీరయ్య', 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాలలో అలరించిన రవితేజ.. ఈ ఏడాదిలో ఇప్పటికే 'ఈగల్' మూవీని రిలీజ్ చేశారు. ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' అంటూ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ బయటకి వచ్చింది.

రవితేజ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా 'మిస్టర్ బచ్చన్'. 'నామ్ తో సునా హోగా' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇటీవలే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హరీష్ ఎప్పటికప్పుడు ఈ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నారు. ఆ మధ్య కరైకుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు.. ఇప్పుడు తాజా షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు.

'Mr. బచ్చన్ యాక్షన్ టైమ్' అంటూ హరీశ్ శంకర్ తాజాగా ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. షాట్ కు సంబంధించిన ఫోటోని కూడా పంచుకున్నారు. దీన్ని బట్టి రవితేజ మీద ఓ పవర్ ఫుల్ హై ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారని అర్థమవుతోంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ నార్త్ ఇండియాలోని పెద్ద నగరమైన ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్నట్టుగా సమాచారం.

Also Read: అటు సినిమాలు, ఇటు వివాదాలు - ప్రకాష్ రాజ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

'మిస్టర్ బచ్చన్' సినిమాలో రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. కమెడియన్ సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ మాస్ రాజా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. టైటిల్ పోస్టర్ లో రవితేజ పాత స్కూటర్‌పై స్టైల్‌గా కూర్చుని, తన అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్ ఐకానిక్ పోజ్‌ను అనుకరించే ప్రయత్నం చేశారు. అలానే వాలెంటైన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన రొమాంటిక్ పోస్టర్ లో రవితేజ - భాగ్యశ్రీ జోడీ ఆకట్టుకుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

'షాక్', 'మిరపకాయ్' సినిమాల తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో 'మిస్టర్ బచ్చన్' పై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. ఇది బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ హీరోగా నటించిన 'రైడ్' అనే హిందీ సినిమాలు రీమేక్ అనే టాక్ ఉంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వెల్లడి కానున్నాయి.

Also Read: హోళీ పండుగను పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకున్న శ్రీ విష్ణు - 'ఓం భీమ్ బుష్' నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget