Dil Raju: ఆ రెండు సినిమాలకు పోటీ తప్పదు - అందుకే ‘హనుమాన్’ రిలీజ్ వాయిదా వేయట్లేదు: దిల్ రాజు
Dil Raju: ‘గుంటూరు కారం’తో పోటీపడడానికి ‘హనుమాన్’ కూడా అదే రోజు విడుదలకు సిద్ధమయ్యింది. అయితే ‘హనుమాన్’ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సులు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలకు దిల్ రాజు చెక్ పెట్టారు.
Dil Raju about HanuMan Release: 2024 సంక్రాంతికి ఒకేసారి దాదాపు అయిదు సినిమాలు విడుదల అవుతుండడంతో అసలు థియేటర్లు ఎలా సరిపోతాయి, కలెక్షన్స్ ఎలా వస్తాయి అని ఇండస్ట్రీ నిపుణుల్లో చర్చ మొదలయ్యాయి. పైగా మేకర్స్ అంతా ముందు నుంచి అనుకున్న రిలీజ్ డేట్స్ కావడంతో.. ఎవరూ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. ‘గుంటూరు కారం’లాంటి కమర్షియల్ సినిమాలకు పోటీగా ‘హనుమాన్’లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా చిత్రాలు కూడా ఒకేరోజు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సంక్రాంతి విడుదలల గురించి మాట్లాడడానికి తాజాగా తెలుగు నిర్మాతలంతా ప్రెస్ మీట్ పెట్టగా.. అందులో ‘హనుమాన్’ మూవీ రిలీజ్‌పై స్పందించారు దిల్ రాజు.
హిందీ మార్కెట్‌ను టార్గెట్..
‘‘ప్రశాంత్ వర్మ నన్ను కలిసి మాట్లాడారు. అప్పుడు నిరంజన్ రెడ్డి అందుబాటులో లేరు. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు వచ్చేలా ట్రై చేసుకోండి అని నేను చెప్పాను. 12,13,14,15 ఇలా. మేజర్‌గా హిందీ టార్గెట్ చేస్తున్నాం. అందుకే 12న విడుదల కావాలి. వేరే ఆప్షన్ లేదు అని ప్రశాంత్ వర్మ చెప్పారు. ప్రశాంత్ వర్మ చెప్పిన దాన్నిబట్టి వారు మేజర్‌గా హిందీ రిలీజ్ కోసం చూస్తున్నారు కాబట్టి అలా అంటే వారికి శుక్రవారమే రిలీజ్ ఉండాలి. కాబట్టి అది మారడానికి ఛాన్స్ లేదు. ‘గుంటూరు కారం’ అయితే ఎప్పటినుండో అదే రోజు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పెద్ద స్టార్ సినిమా కాబట్టి వారు వారం మొత్తం వారికే కావాలని చూస్తారు. వారు కూడా మారడానికి ఛాన్స్ లేదు. రెండు సినిమాలు ఒకేరోజు వచ్చే అవకాశాలే ఉన్నాయి’’ అంటూ ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’కు పోటీ తప్పదని దిల్ రాజు తెలిపారు.
దయజేసి హైలెట్ చేయొద్దు..
విలేకర్ల ప్రశ్నకు దిల్ రాజు బదులిస్తూ ‘‘రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమాను పోస్ట్‌పోన్ చేయడానికి కృషి చేస్తాం. ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రయత్నిస్తాం. అవి కాకుండా 13న ఒక సినిమా, 14న ఒక సినిమా విడుదల కానున్నాయి. మీరేదో అడుగుతారు, మేమేదో చెప్తాము. దయజేసి దానిని హైలెట్ చేయొద్దు. హెల్తీ పోటీ కోసం చేసే ప్రయత్నం ఇది. అందరూ సాయం చేసి దీనిని కరెక్ట్‌గా ముందు తీసుకెళ్లండి’’ అంటూ సంక్రాంతి విడుదల గురించి ఒక క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. ఇక ‘హనుమాన్’ మూవీని సంక్రాంతి రేసు నుంచి తప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా అవి విఫలమే అయ్యాయని ఒక సందర్భంలో ప్రశాంత్ వర్మనే ఓపెన్‌గా చెప్పేశాడు. అంతే కాకుండా కచ్చితంగా జనవరి 12న తన సినిమా విడుదల అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు.
పోటీ తప్పదు..
తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలయిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్.. అన్నీ ఈ జోనర్ సినిమాలు ఇష్టపడేవారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. పైగా తెలుగులో మాత్రమే కాదు.. ‘హనుమాన్’ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి. ఫైనల్‌గా దిల్ రాజు చెప్పినదాని ప్రకారం సంక్రాంతికి ‘గుంటూరు కారం’ వర్సెస్ ‘హనుమాన్’ పోటీ తప్పదని అర్థమవుతోంది.
Also Read: అమ్మ నన్ను ఆ తెలుగు బూతుతో తిట్టేది - రివీల్ చేసిన జాన్వీ కపూర్