అన్వేషించండి

Janhvi Kapoor: అమ్మ నన్ను ఆ తెలుగు బూతుతో తిట్టేది - జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్

Janhvi Kapoor: శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. ఇప్పటిక పలుమార్లు తనతో ఉన్న అనుబంధం గురించి బయటపెట్టింది. తాజాగా తన తల్లి ఉపయోగించే ఒక తెలుగు బూతు పదాన్ని రివీల్ చేసింది.

Janhvi Kapoor about Sridevi: అతిలోక సుందరి శ్రీదేవికి ఒకప్పుడు మాత్రమే కాదు.. ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. తన నటనకు ఎంతోమంది ప్రేక్షకులు అభిమానులుగా మారిపోయారు. ఇక శ్రీదేవి ఉన్నంతకాలం తన కూతుళ్లను కూడా వెండితెరపై హీరోయిన్లుగా చూడాలని ఆశపడింది. కానీ ఆ కల నెరవేరకుండానే తను మరణించింది. తన మరణం తర్వాత కరణ్ జోహార్‌లాంటి ఇండస్ట్రీ పెద్దలు కలిసి జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే తల్లి సౌత్ అమ్మాయి కావడంతో తనను తెలుగులో తిట్టేది అంటూ, ఒక పదాన్ని రిపీట్ చేసి చూపించింది జాన్వీ కపూర్. ప్రస్తుతం జాన్వీ చెప్పిన ఈ బూతు మాటకు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అమ్మ అలా తిట్టేది

తన మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సమయంలో లేదా మామూలుగా ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొంటున్న సమయంలో తన తల్లి శ్రీదేవి గురించి మాట్లాడడానికి జాన్వీ కపూర్ ఎక్కువగా ఇష్టపడుతుంది. అలా ఇప్పటికీ తనకు, తల్లికి మధ్య ఉన్న ఎన్నో జ్ఞాపకాలను బయటపెట్టింది జాన్వీ. తాజాగా తను ఏదైనా తప్పు చేసినప్పుడు శ్రీదేవి ఏమని తిట్టేదో బయటపెట్టింది. ‘‘నేను ప్రతీసారి అమ్మ రూమ్‌కు వెళ్లి లిప్‌స్టిక్‌ను దొంగతనం చేసి పాకెట్స్ నిండా పెట్టుకొని వచ్చేదాన్ని. అప్పుడు పాకెట్లు చూపించు అనేది. నేను వద్దమ్మా అనేదాన్ని. అప్పుడు ‘నా కొడకా’ అనే తిట్టేది’’ అని రివీల్ చేసింది జాన్వీ కపూర్. ఒక బూతు పదాన్ని జాన్వీ ఎంత క్యూట్‌గా చెప్పింది అంటూ ఈ వీడియోకు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా వీడియోలో కేవలం ఈ పదాన్ని మాత్రమే కట్ చేసి వైరల్ కూడా చేస్తున్నారు.

‘దేవర’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ

2018లో ‘ధడక్’ అనే చిత్రంతో ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమయ్యింది జాన్వీ కపూర్. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో తనపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మొదట్లోనే ఆ అంచనాలను అందుకోలేక ట్రోలింగ్‌కు గురయ్యింది జాన్వీ. ఇప్పటికీ జాన్వీ ఏం చేసినా.. ట్రోల్ చేసే ప్రేక్షకులు ఉన్నారు. కానీ సినిమా, సినిమాకు తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలతో వెండితెరపై కనిపిస్తోంది ఈ భామ. బాలీవుడ్‌లో మంచి ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే తెలుగులో ఎన్‌టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న‘దేవర’లో నటించే అవకాశం కొట్టేసింది. అప్పట్లో తన తల్లి శ్రీదేవి.. సీనియర్ ఎన్‌టీఆర్‌తో నటిస్తే.. ఇప్పుడు జాన్వీ కపూర్.. జూనియర్ ఎన్‌టీఆర్‌తో నటిస్తుందంటూ ప్రేక్షకులు గుర్తుచేసుకుంటున్నారు.

తెలుగులో ఒకటి.. హిందీలో రెండు

‘దేవర’తో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తోంది జాన్వీ కపూర్. అవే ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, ‘ఉలఝ్’. ఇక శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్.. ఇప్పటికే బాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకోగా.. చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా తాజాగా ఒక ఓటీటీ మూవీతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ‘ది ఆర్చీస్’ అనే నెట్‌ఫ్లిక్స్ చిత్రంతో హీరోయిన్‌గా డెబ్యూ ఇచ్చింది ఖుషీ. ఈ మూవీతో మరెందరో బాలీవుడ్ సినీ వారసులను ప్రేక్షకులకు పరిచయం చేసింది జోయా అఖ్తర్. కానీ ఇందులో ఒక్కరి నటన కూడా బాలేదని, బాలీవుడ్‌లో స్టార్ నటీనటుల వారసులు అని చెప్పుకునే విధంగా ఒకరు కూడా నటనను కనబరచలేదని ‘ది ఆర్చీస్’ ఎక్కువగా నెగిటివ్ రివ్యూలనే అందుకుంది. 

Also Read: 'సలార్' ర్యాంపేజ్ - 12 రోజుల్లోనే 'బాహుబలి 2' రికార్డ్ బ్రేక్ - అక్కడ రికార్డులే రికార్డులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Embed widget