అన్వేషించండి

Game Changer: రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్ ‌ఎప్పుడో చెప్పిన దిల్‌ రాజు కూతురు - బెస్ట్‌ ఫ్రెండ్స్‌ మధ్య పోటీ తప్పదా? 

Game Changer Movie Release: 'గేమ్‌ ఛేంజర్'‌ మూవీ రిలీజ్‌ దిల్‌ రాజు కూతురు హన్షిత క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా మూవీ రిలీజ్‌ ఎప్పుడో చెప్పింది. దీంతో మెగా ఫ్యాన్స్‌, నందమూరి ఫ్యాన్స్‌ ఆంధోళన నెలకొంది.

Dil Raju Daughter on Game Changer Release: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ - సెన్సేషన్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. పాన్‌ ఇండియా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదటి నుంచి గేమ్‌ ఛేంజర్ మూవీ విషయంలో ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మూవీ సెట్స్‌పైకి వచ్చిన రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు మూవీ నుంచి పెద్దగా అప్‌డేట్స్‌ రావడం లేదు. ఫస్ట్‌లుక్‌, ఒక్క పాట తప్పితే ఇంత వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు.  దీంతో గేమ్‌ ఛేంజర్‌ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అంతా ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు.  కానీ ఆశించిన రేంజ్‌ అప్‌డేట్‌ రావడం లేదు.

 అయితే ముందు నుంచి 'గేమ్‌ ఛేంజర్‌' విషయంలో ఫ్యాన్స్‌ని టెన్షన్‌ పెడుతూనే ఉన్నాడు శంకర్‌.  ఈ సినిమాతో పాటు తెరకెక్కిస్తున్న 'భారతీయుడు 2' మూవీ రిలీజ్‌ డేట్‌ కూడా చెప్పేశాడు.  దీంతో 'గేమ్‌ ఛేంజర్‌' విషయంలో శంకర్‌ తీరుపై మెగా ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్‌ చివరి దశకు వచ్చినా.. ఇంకా రిలీజ్‌ డేట్ పై క్లారిటీ రావడం లేదు. సెప్టంబర్‌లో మూవీ రిలీజ్‌ చేస్తామని నిర్మాత దిల్‌ రాజు చెప్పినప్పటికీ దీనిపై క్లారిటీ లేదు. ఈ క్రమంలో తాజాగా దిల్ రాజు కుమార్తె హన్షిత్‌ గేమ్‌ ఛేంజర్ రిలీజ్‌పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. 

బెస్ట్ ఫ్రెండ్ మధ్య పోటీ?

ఈ రోజు తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న హన్షిత అక్కడ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమెకు గేమ్‌ ఛేంజర్‌ అప్‌డేట్‌ చెప్పమంటూ విలేకరులు కోరగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "గేమ్‌ ఛేంజర్‌ మూవీ అక్టోబర్‌లో రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు సరికొత్త రామ్‌ చరణ్‌ని చూస్తారు" అంటూ మూవీపై హైప్‌ ఇచ్చింది. ఇక దిల్ రాజు సెప్టెంబర్‌ అని చెబితే హన్షిత అక్టోబర్‌ అనడంతో ఫ్యాన్స్‌లో మరింత క్యూరియాసిటీ నెలకొంది. దీంతో గేమ్‌ ఛేంజర్‌ మూవీ అక్టోబర్‌లో దసరా టార్గెట్‌గా వస్తుందని అంతా ఫిక్స్‌ అవుతున్నారు. అయితే ఇది మ్యాన్‌ ఆప్‌ మాసెస్‌ దేవరతో వస్తుందా? లేక దసరా తర్వాత వస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ గేమ్‌ ఛేంజర్‌ అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో రిలీజ్‌ చేసే అవకాశం ఉంటే మాత్రం కచ్చితంగా ఇద్దరి మధ్య గట్టి పోటీ తప్పదనే చెప్పాలి. 

'దేవర' వాయిదా?

కానీ దేవర మూవీ వాయిదా పడే అవకాశం ఉందంటూ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తుంది. ఇప్పటికే 'దేవర'ను అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేస్తామని మూవీ టీం ప్రకటించింది. కానీ, షూటింగ్‌ ఇప్పట్లో పూర్తయ్యేలా లేదట. మరోవైపు తారక్‌ 'వార్‌ 2' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇదంతా చూస్తుంటే దేవర మూవీ రిలీజ్‌ వాయిదా పడేలా ఉందంటున్నారు. అదే నిజమైతే మాత్రం దసరా బరిలో 'గేమ్‌ ఛేంజర్‌' రావడం పక్కా అంటున్నారు. దేవర వాయిదా పడేతే మాత్రం అక్టోబర్‌ 10ని తన స్నేహితుడు రామ్‌ చరణ్‌కి ఇచ్చే అవకాశం ఉందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో చర్చించుకుంటున్నారు. అది కాకపోతే ఇద్దరు దసరా టార్గెట్‌గా వస్తే మాత్రం ఈ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ మధ్య గట్టి పోటీ తప్పదు. ఇప్పడిదే వారి ఫ్యాన్స్‌ని ఆందోళనలో పడేస్తుంది. మరి ఈ దసరాకి ఈ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ తగ్గేదే లే అంటూ బరిలో దిగుతారా? లేక ఎవరైన వెనక్కి తగ్గుతారా? చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget