Allu Arjun: ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ దగ్గరకు... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'దిల్' రాజు సినిమా
Allu Arjun Prashanth Neel Movie: అల్లు అర్జున్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'దిల్' రాజు ఓ సినిమా ప్రొడ్యూస్ చేయనున్నారు. 'తమ్ముడు' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమా కన్ఫర్మ్ చేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తెలుగు చిత్రసీమలోని అగ్ర నిర్మాతలలో ఒకరైన 'దిల్' రాజు మధ్య మంచి అనుబంధం ఉంది. 'ఆర్య' నుంచి మొదలు పెడితే 'పరుగు', 'దువ్వాడ జగన్నాథమ్' వరకు వాళ్ళ బంధం చక్కగా కొనసాగుతోంది. ఆ మధ్య అనౌన్స్ చేసిన 'ఐకాన్' ఆగినా... ఇప్పుడు వాళ్ళిద్దరి కలయికలో మరొక సినిమా రానుంది. ఆ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారు.
ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ దగ్గరకు...
'కేజీఎఫ్' సినిమాతో ప్రశాంత్ నీల్ సత్తా ఏమిటనేది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ సాక్షిగా అందరికీ తెలిసింది. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకత్వం వహించిన 'సలార్' సినిమాతో ప్రశాంత్ నీల్ తన సత్తా మరోసారి చాటారు. కమర్షియల్ పంథాలో యాక్షన్ ఫిలిమ్స్ తీయడం, హీరోయిజం ఎలివేట్ చేయడం ఎలా? అనేది అందరికీ చూపించారు. ప్రశాంత్ నీల్ సినిమాలు యాక్షన్ జానర్‌లో ట్రెండ్ సెట్ చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Prashanth Neel to direct Allu Arjun: 'సలార్' తర్వాత ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. 'సలార్' సీక్వెల్ కాకుండా 'రావణం' సినిమా చేయడానికి ప్లాన్ చేశారు. అయితే ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ప్రభాస్ దగ్గర నుంచి ఆ కథ అల్లు అర్జున్ దగ్గరకు వచ్చింది.
బన్నీతో 'రావణం' కన్ఫర్మ్ చేసిన రాజు!
Dil Raju to produce Allu Arjun and Prashanth Neel Movie: నితిన్ కథానాయకుడిగా నిర్మించిన 'తమ్ముడు' జూలై 4 (శుక్రవారం) విడుదల కానున్న సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో 'దిల్' రాజు ముచ్చటించారు. అప్పుడు బన్నీ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'రావణం' ప్రొడ్యూస్ చేస్తున్నామని తెలిపారు.
Also Read: చిరంజీవి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా మహేష్ బాబు... అదీ ఒరిజినల్ ప్లాన్... తర్వాత ఏం జరిగిందంటే?
Ravanam Movie Update: ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్నారు. ఆ తరువాత మరొక సినిమా లైనులో ఉంది. త్రివిక్రమ్ సినిమా ఉంటుందా? లేదా? అనేది పక్కన పెడితే కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు బన్నీ. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా 'డ్రాగన్' సినిమా చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత 'సలార్' సీక్వెల్ పూర్తి చేయాల్సి ఉంది. అటు అల్లు అర్జున్, ఇటు ప్రశాంత్ నీల్... ఇద్దరి చేతిలో రెండేసి సినిమాలు ఉన్నాయి అవి పూర్తి చేశాక 'రావణం' మొదలు అవుతుందని 'దిల్' రాజు స్పష్టం చేశారు.
Also Read: 'తమ్ముడు'కు ముందు... పవన్ కళ్యాణ్ టైటిల్స్ వాడిన హీరోలు ఎవరు? ఆ సినిమాలు ఏమిటి?





















