Ustaad Bhagat Singh: దేవిశ్రీకి పవన్ కళ్యాణ్ షేక్ హ్యాండ్ - చాలా రోజుల తర్వాత మాంచి డ్యాన్స్ నంబర్… కొట్టండ్రా డప్పులు!
Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ గ్రేస్, జోష్ వేరే లెవల్ అని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. రీసెంట్‌గా ఓ పాట షూట్ చేశామని... అదరగొట్టేశావ్ అంటూ పవన్ ప్రశంసించారని అన్నారు.

Devi Sri Prasad About Ustaad Bhagat Singh Songs: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవెయిటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ బర్త్ డే సందర్భంగా రీసెంట్‌గా రిలీజ్ చేసిన వింటేజ్ స్టైలిష్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఓ సాంగ్‌లో స్టెప్‌తో ఆ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ ఒక్క పోస్టర్‌తోనే మూవీలో పాటలు ఓ రేంజ్‌లో ఉంటాయని అర్థమవుతోంది.
తాజాగా ఉస్తాద్‌లో సాంగ్స్‌పై మ్యూజిక్ మాస్ లెజెండ్ దేవిశ్రీ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దుబాయ్ వేదికగా జరిగిన 'సైమా 2025' వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుందంటూ చెప్పారు. దీంతో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ షేక్ హ్యాండ్...
'ఉస్తాద్ భగత్ సింగ్'లో రీసెంట్‌గానే ఓ సాంగ్ షూట్ చేసినట్లు దేవిశ్రీ తెలిపారు. 'పవన్ సూపర్‌గా డ్యాన్స్ చేశారు. సాంగ్ షూట్ అయిన తర్వాత పవన్ కల్యాణ్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అదరగొట్టేశావ్ దేవి. చాలా కాలం తర్వాత నాకు డ్యాన్స్ చేయాలనే కోరిక కలిగించావ్. నాతో డ్యాన్స్ చేయిస్తున్నావ్ నువ్వు అంటూ ప్రశంసించారు. అది విన్న వెంటనే నాకు రెక్కలు వచ్చినట్లు అనిపించింది. ఈ మూవీ సాంగ్స్, పవన్ డ్యాన్స్ అందరికీ ఎల్లప్పటికీ గుర్తుండిపోతుంది.' అంటూ చెప్పారు.
Also Read: 'సైమా అవార్డ్స్ 2025' విన్నర్స్ లిస్ట్: 'పుష్ప 2'కు నాలుగు... సత్తా చాటిన 'కల్కి', 'హనుమాన్'
మోత మోగిపోవాల్సిందే
మాస్ ఆడియన్స్‌కు ఫుల్ ఎనర్జీ ఇచ్చేలా రాకింగ్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్ ఉంటుంది. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సేమ్ కాంబో రిపీట్ అవుతోంది. ఆ మూవీలో పాటలు, పవన్ ఎనర్జీ, గ్రేస్‌తో థియేటర్లలో మోత మోగిపోయింది. ఈసారి కూడా అదే జోష్ కంటిన్యూ అవుతుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇప్పటికే మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్ కూడా పూర్తైంది. ఇక కొత్త షెడ్యూల్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. దీంతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఈ మూవీలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు కేఎస్ రవికుమార్, నవాబ్ షా, పార్ధిబన్, రాంకీ, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేం అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు.
పవర్ స్టార్... పోలీస్ ఆఫీసర్
గతంలో గబ్బర్ సింగ్‌లోనూ పవన్ పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టారు. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'లోనూ ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పవన్ వీరాభిమాని అయిన హరీష్ శంకర్ ఆయన్ను మరోసారి ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుండిపోయే రోల్, లుక్‌లో చూపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ చూస్తుంటే రికార్డులు కొల్లగొట్టడం ఖాయమనే కామెంట్స్ వస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.





















